Best Web Hosting Provider In India 2024
OTT Crime Thriller Movie: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న మాధవన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Crime Thriller Movie: ఓటీటీలోకి మాధవన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. గతేడాది నవంబర్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన ఈ మూవీని థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్రీమియర్ చేయాలని నిర్ణయించడం విశేషం.
OTT Crime Thriller Movie: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలుసు. ఇప్పుడు మాధవన్ నటించిన అలాంటిదే మరో మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు హిసాబ్ బరాబర్ (Hisaab Barabar). ఓ కార్పొరేట్ బ్యాంక్ లో జరిగే భారీ స్కామ్ ను బయటపెట్టే ఓ అకౌంటెంట్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సినిమాను గతేడాది 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.
ఓ సాధారణ వ్యక్తి ఓ బడా బ్యాంకులో జరిగే బిలియన్ డాలర్ల స్కామ్ ను ఎలా బయటపెట్టాడన్నదే ఈ మూవీ స్టోరీ. గతేడాది నవంబర్ 26న తొలిసారి ఇఫ్ఫిలో ప్రదర్శితమైన ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.
హిసాబ్ బరాబర్ మూవీ గురించి..
హిసాబ్ బరాబర్ మూవీలో మాధవన్ తోపాటు నీల్ నితిన్ ముకేశ్, కృతి కుల్హరి, ఫైసల్ రషీద్, రాజేష్ జైస్, సుకుమార్ తుడు, అక్షయ్ భాగట్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాలో రాధే మోహన్ శర్మ అనే రైల్వే టీసీ పాత్రలో మాధవన్ కనిపించాడు. తన బ్యాంకు అకౌంట్లో జరిగిన గోల్‌మాల్ తో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ చిన్న తప్పిదం తర్వాత అతిపెద్ద ఆర్థిక కుంభకోణాన్ని ఎలా వెలికితీసిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.
ప్రముఖ బ్యాంకర్ మిక్కీ మెహతా పాత్రలో నీల్ నితిన్ ముకేష్ నటించాడు. గతేడాది నవంబర్లో తొలిసారి ఫిల్మ్ ఫెస్టివల్లో మూవీ ప్రదర్శించినప్పుడు మాధవన్ దీని గురించి మాట్లాడాడు. తాను ఎప్పుడూ ఇలాంటి సామాన్యుడికి సంబంధించిన కథలను చేయాలని అనుకుంటానని, కొన్నిసార్లు అది వర్కౌట్ కాగా.. మరికొన్నిసార్లు కాదని అన్నాడు. ఈ హిసాబ్ బరాబర్ మూవీని జనవరి 24 నుంచి జీ5 ఓటీటీలో చూడొచ్చు.