Bachchala Malli OTT: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అల్లరి నరేష్ యాక్షన్ డ్రామా.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్

Best Web Hosting Provider In India 2024

Bachchala Malli OTT: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అల్లరి నరేష్ యాక్షన్ డ్రామా.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్

Hari Prasad S HT Telugu
Jan 09, 2025 03:56 PM IST

Bachchala Malli OTT: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో అల్లరి నరేష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా బచ్చల మల్లి రాబోతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ కన్ఫమ్ చేసింది.

మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అల్లరి నరేష్ యాక్షన్ డ్రామా.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్
మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అల్లరి నరేష్ యాక్షన్ డ్రామా.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్

Bachchala Malli OTT: అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే అంటే శుక్రవారం (జనవరి 10) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీయే వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా మూవీ వస్తోంది.

yearly horoscope entry point

20 రోజుల్లోనే ఓటీటీలోకి బచ్చల మల్లి

అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి మూవీ థియేటర్లలో రిలీజైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. బచ్చల మల్లి రేపటి నుంచే మీ ఈటీవీ విన్ ఓటీటీలో అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.

నిజానికి బుధవారం (జనవరి 8) ఈ సినిమా స్ట్రీమింగ్ తమ ప్లాట్‌ఫామ్ పైనే అని కన్ఫమ్ చేసిన ఆ ఓటీటీ.. డేట్ గెస్ చేయండి అంటూ ఫ్యాన్స్ ను అడిగింది. మరుసటి రోజే జనవరి 10 అంటూ డేట్ కూడా రివీల్ చేసింది.

బచ్చల మల్లి మూవీ ఎలా ఉందంటే?

అల్లరి నరేష్, అమృతా అయ్యర్ జంటగా నటించిన మూవీ బచ్చల మల్లి. ఈ సినిమాను సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేశాడు. గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. ఏపీలోని తుని దగ్గరలో ఉన్న సురవరం అనే ఊళ్లో జరిగిన కథగా ఈ మూవీని తెరకెక్కించారు.

మల్లి అనే పాత్రలో నరేష్ నటించాడు. చదువులో ఎంతో తెలివైన విద్యార్థిగా ఉండే మల్లి.. తన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఎలా ఓ మొండి వ్యక్తిగా మారాడు? కావేరి (అమృతాఅయ్యర్) అనే అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది? అసలు మల్లి తండ్రి చేసిన తప్పేంటి? దానివల్ల మల్లి, కావేరి ఎదుర్కొనే సవాళ్లేంటన్నది ఈ బచ్చల మల్లి మూవీలో చూడొచ్చు.

ఈ సినిమాకు అల్లరి నరేషే పెద్ద ప్లస్ పాయింట్. అతని నటన మరో లెవెల్. తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇదీ ఒకటి. మూవీ స్టోరీ కూడా బాగానే ఉన్నా.. దానిని తెరపై ప్రెజెంట్ చేసిన విధానం ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.

స్క్రీన్ ప్లేలో లోపాలు, అనవసరమైన సీన్లు చికాకు తెప్పిస్తాయి. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపవడంతో ఈ మూవీని నెల లోపే ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతికే ఈటీవీ విన్ ఓటీటీ మూవీని స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024