తొక్కిసలాట బాధితులకు వైయ‌స్‌ జగన్‌ పరామర్శ

Best Web Hosting Provider In India 2024

తిరుపతి : పద్మావతి మెడికల్‌ కాలేజీకి చెందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. 
 
వైయ‌స్‌ జగన్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతికి బయల్దేరిన సంగతి తెలిసిందే. పద్మావతి మెడికల్‌ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించే అవకాశం ఉన్న తరుణంలో వైయ‌స్‌ జగన్‌ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

తిరుచానూరు క్రాస్‌ వద్ద వైయ‌స్‌ జగన్‌ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.  అరగంట తర్వాత వెళ్లాలని పోలీసులు చెప్పడంతో..  తిరుచానూరు క్రాస్‌ వద్ద తన బుల‍్లెట్‌ ప్రూఫ్‌ వాహనం వదిలి  నడుచుకుంటూనే  కాలినడకన బయల్దేరారు వైయ‌స్ జగన్‌.. అయితే కొద్ది దూరం నడిచిన వెళ్లిన వైయ‌స్‌ జగన్‌.. ఆపై స్థానిక నేత కారులో తిరుపతికి బయల్దేరారు.

YS Jagan Consoles Victims of the Tirupati Stampede

వైయ‌స్‌ జగన్‌ వెళ్లే లోపు బాధితుల్ని తరలించే యోచనలో ఉన్న అధికారులు..  దానిలో భాగంగా  ఆయన కాన్వాయ్‌ను  అడ్డుకున్నట్లు  తెలుస్తోంది. ఆ  క్రమంలోనే అరగంట, గంట అంటూ ఏవో ​ సంబంధం లేని కారణాలను తెలియజేసే యత్నం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోని వైయ‌స్‌ జగన్‌.. బాధితుల్ని పరామర్శించడానికి బయల్దేరారు.

కనీసం ట్రాఫిక్‌ క్లియర్‌ చేయని అధికారులు
వైయ‌స్‌ జగన్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న అధికారుల్లో ఎలాగైనా బాధితుల పరామర్శను నిర్వీర్యం చేయాలనే యోచన ఉన్నట్లు కనిపిస్తోంది. కనీసం ట్రాఫిక్‌ కూడా క్లియర్‌ చేయడం లేదు అధికారులు.  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కే రోజాలు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పోలీసులు కాన్వాయ్‌ను అడ్డుకున్న క్రమంలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన వైయ‌స్‌ జగన్‌.. ఆపై స్థానిక నేత వాహనంలో తిరుపతికి బయల్దేరి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

Best Web Hosting Provider In India 2024