Best Web Hosting Provider In India 2024
Parenting Tips: ఆరేళ్లలోపు పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని 5 పనులు ఇవే
Parenting Tips: ఇంట్లోని మీ పిల్లలకు ఆరేళ్ల కన్నా తక్కువ వయసు ఉందా? వారి ముందు తల్లిదండ్రులు చేయకూడని, మాట్లాడకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ 5 విషయాలను వారి ముందు ఎప్పుడూ మాట్లాడకూడదు.
చిన్న పిల్లలు స్వచ్ఛమైన మనసు కలవారు. వారికి తల్లిదండ్రులు, సమాజం ఏం ఏర్పిస్తే అవే నేర్చుకుంటారు. ముఖ్యంగా ఆరేళ్ల వరకు పిల్లల మానసిక వికాసం వేగంగా జరుగుతుంది. అతని మనస్సు అనేక కొత్త విషయాలను, కొత్త ప్రవర్తనను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఆరేళ్ల వయసులో ఉన్న పిల్లలు మాట్లాడటం, అర్థం చేసుకోవడం అన్నీ ఇంట్లోని వారిని చూసి నేర్చుకుంటూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడటం ద్వారా చాలా విషయాలను తెలుసుకుంటారు. చుట్టుపక్కల వాతావరణం వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు వారి పెంపకం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులు, మాట్లాడకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. అవి వారి మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.
ఆర్థిక ఇబ్బందులు
ఆరేళ్ల వయసు ఉన్న పిల్లల ముందు ఆర్ధిక ఇబ్బందులు గురించి, మీకు వచ్చే ఆదాయం గురించి మాట్లాడకండి. చాలాసార్లు తల్లిదండ్రులు తమ బిడ్డ ఇంకా చిన్నవాడని, అతను ఈ విషయాలను ఇంకా అర్థం చేసుకోలేదని భావిస్తారు. పిల్లల చిన్న మెదడు మొత్తం విషయం అర్థం కాకపోయినా, అతని తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి డబ్బు కొరత ఉందని అర్థం చేసుకుంటుంది. ఈ కారణంగా వారు కూడా దాని గురించి ఆలోచించి ఎక్కడో ఒకచోట ఒత్తిడికి గురవుతారు.
బిగ్గరగా గొడవలు
ఇంట్లో భార్యాభర్తలు ఒకరితో ఒకరు గొడవ పడటం సహజం. కానీ మీరు తల్లిదండ్రులు అయినప్పుడు, మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. తల్లిదండ్రులుగా మారాక వాదనలు, గొడవలు పడేటప్పులు జాగ్రత్తగా వ్యవహరించాలి. బిగ్గరగా అరవడం, ఒకరినొకరు దూషించడం వంటివి మీ పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మీ పిల్లలు మిమ్మల్ని చూడటం ద్వారా ప్రతిదీ నేర్చుకుంటారు. కాబట్టి వారి ముందు మీరు రఫ్ గా ప్రవర్తించకండి.
దెయ్యాలు గురించి
ప్రతిరోజూ మీరు వార్తాపత్రిక లేదా టీవీలో హృదయ విదారకమైన సంఘటనను వింటారు. ఇలాంటి షాకింగ్ సంఘటనలు ఇంట్లో ప్రస్తావించడం సహజమే. కానీ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలాంటి విషయాల గురించి మాట్లాడకుండా ఉండాలి. అలాగే,సరదా కోసం కూడా దెయ్యాలు గురించి చెప్పకండి. బూచి పేరు చెప్పి పిల్లలను భయపెట్టడం మానేయండి. ఇవన్నీ పిల్లల మనస్సులో భయాన్ని సృష్టిస్తాయి, ఇది అతని మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
చాలాసార్లు, తల్లిదండ్రులు పిల్లల పాఠశాల మరియు ఉపాధ్యాయుడి గురించి సరదాగా మాట్లాడతారు. టీచర్ల గురించి, చదువుల గురించి చెడుగా మాట్లాడకండి. ఇలాంటివి పదేపదే వింటే పిల్లల మనస్సులో ప్రతికూల భావన పడుతుంది. మీరు చదువు పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే, పిల్లవాడు కూడా అదే కాపీ కొడతాడు. అటువంటి పరిస్థితిలో, పిల్లల చదువు, ఉపాధ్యాయుడుకు పూర్తి గౌరవం ఇవ్వండి.
పిల్లలు తమ తల్లిదండ్రులను చూడటం ద్వారానే సగానికి పైగా విషయాలను నేర్చుకుంటారు. మీరు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా చాలా దగ్గరగా గమనిస్తారు. మీరు ఎల్లప్పుడూ వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుతుంటే లేదా వారి గురించి ప్రతికూలంగా మాట్లాడుతుంటే, మీ పిల్లలు కూడా ఈ ప్రవర్తనను కాపీ కొట్టడం ప్రారంభిస్తాడు. అటువంటి పరిస్థితిలో, మీరు ఎవరి గురించినైనా తప్పుగా మాట్లాడాలనుకుంటే, కనీసం పిల్లల ముందు మాట్లాడవద్దు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్