Ragi Roti Recipe: శీతాకాలంలో రాగి రొట్టెలను తిన్నారంటే ఈ ఐదు ప్రయోజనాలు పొందచ్చు.. ఇదిగో ఇలా తయారు చేసుకొండి!

Best Web Hosting Provider In India 2024

Ragi Roti Recipe: శీతాకాలంలో రాగి రొట్టెలను తిన్నారంటే ఈ ఐదు ప్రయోజనాలు పొందచ్చు.. ఇదిగో ఇలా తయారు చేసుకొండి!

Ramya Sri Marka HT Telugu
Jan 10, 2025 06:30 AM IST

Ragi Roti Recipe: కఠినమైన చలి నుండి తప్పించుకోవడానికి, తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలు తినే అద్బుతమైన ఆహారం రాగి రొట్టెలు. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా తప్పకుండా ప్రతి రోజూ తింటారు. రాగి రొటీ తయారీ విధానం, లాభాల గురించి తెలుసుకోండి.

శీతాకాలంలో రాగి రొట్టెలను తిన్నారంటే ఈ ఐదు ప్రయోజనాలు పొందచ్చు
శీతాకాలంలో రాగి రొట్టెలను తిన్నారంటే ఈ ఐదు ప్రయోజనాలు పొందచ్చు

రాగులు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం, ఫాస్ఫరస్, అయోడిన్, విటమిన్ బి, ఐరన్ పుష్కలంగా ఉండే రాగులు తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే రాగులను ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తప్పక తినాలని నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో చలి నుండి తప్పించుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రాగి రొట్టెలను తప్పక తినాలట. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు.. రుచిలో కూడా ఏం తక్కువ చేయవు.

yearly horoscope entry point

కోదో రొట్టెలు, మండువా రోటీలు అని పిలిచే ఈ రాగి రొట్టెలను పర్వ త ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా ఎక్కువగా తింటారు. రాగి రొట్టెలతో పాటు వెన్న, నెయ్యి, బెల్లం, కూర, చట్నీ వంటి వాటితో కలిపి రోజూ క్రమం తప్పకుండా తింటారు. శీతాకాలంలో వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం.

రాగి రొట్టెలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది

రాగులలో ఉండే అధిక ఫైబర్ కడుపు సంబంధిత సమస్యలైన అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రొట్టెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గుతాయి.

బరువు తగ్గడంలో ప్రయోజనకరం

రాగుల్లో ట్రిప్టోఫాన్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది, తద్వారా వ్యక్తికి పదే పదే ఆకలి వేయదు. పదే పదే తినాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. మీరు బరువు తగ్గడానికి అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటే, ఈ రొట్టెను క్రమం తప్పకుండా కొద్ది రోజులు తిని చూడండి.

ఎముకలను దృఢంగా ఉంచుతుంది

రాగి పిండిలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ దంతాలను, ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పిండి రొట్టెలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ ఉన్న రోగులకు చక్కటి ప్రయోజనం చేకూరుస్తుంది.

శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది

రాగి రొట్టె వేడిగా ఉంటుంది. శీతాకాలంలో దీన్ని తినడం వల్లె చలి నుండి రక్షించి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

డయాబెటిస్

మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగి రొట్టె ఒక వరం లాంటిది. వీటిలో గ్లూటెన్ ఉండదు. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నప్పటికీ రాగి రొట్టెలను నిర్భయంగా ఉదయం-సాయంత్రం తినచ్చు. అధిక ఫైబర్ కారణంగా కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. చక్కెర స్తాయిలు నియంత్రణలో ఉంటాయి.

రాగి రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు:

  1. రెండు కప్పుల రాగి పిండి
  2. ఒక కప్పు గోధుమ పిండి
  3. ఒక టీస్పూన్ ఉప్పు
  4. ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు
  5. నెయ్యి, వెన్న లేదా నూనె

రాగి రొట్టె తయారీ విధానం:

  • ఒక గిన్నెలో రాగి పిండి, గోధుమ పిండి తీసుకుని దాంట్లో ఉప్పు వేసుకుని బాగా కలపాలి.
  • ఇప్పుడు నీటిని బాగా వేడి చేసి పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీరు అయితే రాగి పిండి రొట్టెలు రుచిగా ఉంటాయి.
  • చేత్తో వేడి వేడి నీటిని పిండిని కలపడం ఇబ్బంది అయితే గరిటె తీసుకుని కలుపుకోవచ్చు.
  • నీళ్లు, పిండి కలిసి వేడి తగ్గిన తర్వాత రొట్టెలు చేసుకోవడానికి తగినట్టుగా పిండి మెత్తగా అయ్యేంత వరకూ బాగా కలుపుకోవాలి.
  • పిండి కలుపుకుని 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి.
  • తర్వాత పిండిని చిన్న ముద్దగా చేసి తీసుకుని రొట్టెలు తయారు చేసుకోవాలి.ఇలా చేసెటప్పుడు రొట్టెల మీద పొడి రాగి పిండి వేయడం మర్చిపోకండి.
  • తర్వాత రొట్టె పెనం తీసుకుని మీడియం ఫేమ్ మీద రొట్టెలను కాల్చుకోండి.
  • రొట్టె కాల్చుకునే టప్పుడు అన్నివైపులా వేడి తగిలేలా గుండ్రుంగా తిప్పుతూ కాలచ్చుకోవాలి.
  • రాగి రొట్టె కాలేటప్పుడు చక్కగా పొంగుతాయి. ఒకపైపు పొంగిన తర్వాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి.
  • రొట్టె దాదాపు కాలిన తర్వాత దాని మీద నెయ్యి, వెన్న లేదా నూనె రాసుకుని పెనం మీద నుంచి తీసేసి డబ్బాలో వేసుకోవాలి.
  • అంతే రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి రొట్టెలు తయారయినట్టే.
  • వీటిని అల్లం పచ్చడి, టమాటా పచ్చడితో పాటు ఇతర కూరలతో నంచుకుని తిన్నారంటే అదిరిపోతుంది. పిల్లలకు వీటిని అలవాటు చేశారంటే వారు చాలా బలంగా తయారవుతారు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా రాత్రి డిన్నర్ లాగా తీసుకోవచ్చు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024