Best Web Hosting Provider In India 2024
Nail Polish: నెయిల్ పాలిష్ గోళ్లపై ఎక్కువ కాలం అందంగా మెరవాలంటే ఈ చిట్కాలను పాటించండి
Nail Polish: నెయిల్ పాలిష్ వేసుకోని అమ్మాయిలు ఇప్పుడు ఉండరేమో. నెయిల్ ఆర్ట్ వచ్చాక నెయిల్ పాలిష్ వేసుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే నెయిల్ పాలిష్ ఎక్కువ కాలం పాటూ మెరుపు కోల్పోకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి.
మీ గోళ్లు అందంగా కనిపించడానికి నెయిల్ పాలిష్ వేసుకునే అలవాటు మీకూ ఉందా? ఎన్ని ట్రెండ్స్ వచ్చినా గోళ్లకు నెయిల్ పాలిష్ అప్లై చేసే ట్రెండ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అమ్మాయిలైనా, మహిళలైనా వారి మేకప్ బాక్స్ లో నెయిల్ పాలిష్ సీసాలు ఎక్కువగా కనిపిస్తాయి. నెయిల్ పాలిష్ సమస్య ఏమిటంటే, వెంటనే అప్లై చేసినప్పుడు, గోర్లు చాలా అందంగా కనిపిస్తాయి. కానీ కొన్ని రోజులకు అది ఫేడవుట్ అవుతుంది. దీని తరువాత, గోళ్లు మునుపటి కంటే అధ్వాన్నంగా కనిపించడం ప్రారంభిస్తాయి. మీ నెయిల్ పాలిష్ ఎక్కువ కాలం ఉండకపోతే, ఈ రోజు మేము మీకు కొన్ని చిట్కాలను చెబున్నాము, ఇది మీ నెయిల్ పెయింట్ ను ఎక్కువకాలం ఉండేలా చేస్తుంది.
నెయిల్ పాలిష్ ఎక్కువ కాలం ఉండాలనుకుంటే, దాన్ని అప్లై చేసేటప్పుడు మీరు దానిని డబుల్ కోట్ చేయాలి. అంటే నెయిల్ పాలిష్ అప్లై చేసిన తర్వాత బాగా ఆరనివ్వాలి. దీని తరువాత, మరొకసారి అప్లై చేయండి. కలర్ నెయిల్ పెయింట్ పైన పారదర్శక నెయిల్ పాలిష్ అప్లై చేయవచ్చు. ఇది నెయిల్ పాలిష్ ను లాక్ చేసి గోళ్లపై ఎక్కువసేపు ఉంటుంది.
బేస్ కోట్ వేయడం మర్చిపోవద్దు
మీకు ఇష్టమైన నెయిల్ పాలిష్ అప్లై చేయడానికి ముందు, బేస్ కోట్ వేయడం మర్చిపోవద్దు. ఇది ఒక రకమైన పారదర్శక నెయిల్ పాలిష్. ఇది నెయిల్ పెయింట్ ఎక్కువసేపు ఉండటానికి పనిచేస్తుంది. ముందుగా గోళ్లపై మంచి బేస్ కోట్ ను అప్లై చేసి ఆరనివ్వాలి. దీని తరువాత, నెయిల్ పెయింట్ వేయండి. ఇది మీ నెయిల్ పాలిష్ ను ఎక్కువ కాలం ఉంచుతుంది.
నెయిల్ పాలిష్ అప్లై చేసేటప్పుడు, ఇది మొత్తం గోరుపై బాగా అప్లై అయిందో లేదో చూసుకోండి. చాలాసార్లు నెయిల్ పాలిష్ ను గోళ్లకు అన్ని వైపులా, చివర వరకు సరిగ్గా అప్లై చేయకపోవడం వల్ల ఇది సులభంగా ఊడిపోతుంది. అటువంటి పరిస్థితిలో, తొందరపడకుండా, మొత్తం గోరుకు నెయిల్ పాలిష్ అప్లై చేయండి.
మీరు నెయిల్ పాలిష్ కొన్నప్పుడల్లా, కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని కొనండి. ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన నెయిల్ పాలిష్ కొనండి. చవకగా వచ్చే నెయిల్ పెయింట్ కొంతకాలం మంచిగా అనిపించవచ్చు, కానీ ఇది మీ గోళ్ళను దెబ్బతీస్తుంది. నెయిల్ పెయింట్ ఎంత మందంగా ఉంటే, అది అంత ఎక్కువసేపు ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది కాకుండా, జెల్ నెయిల్ పాలిష్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి మీరు వీటిని కొనుగోలు చేయవచ్చు. వాటర్ ప్రూఫ్ నెయిల్ పెయింట్ కొనడానికి ప్రయత్నించండి. అవి ఎక్కువ కాలం అందంగా గోళ్లపై కనిపిస్తాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్