Best Web Hosting Provider In India 2024
Telugu Serial: స్టార్ మాలో మరో కొత్త సీరియల్ – టైటిల్ ఫిక్స్ – టెలికాస్ట్ ఎప్పుడంటే?
Telugu Serial: మరో కొత్త సీరియల్‌ను స్టార్ మా త్వరలోనే లాంఛ్ చేయబోతున్నది. భానుమతి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ సీరియల్లో శంకర్‌కుమార్ చక్రవర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.
Telugu Serial: మరో సరికొత్త సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ మా సిద్ధమైంది. ఈ సీరియల్ టైటిల్ రివీలైంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ సీరియల్‌కు భానుమతి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మా ఇంటి మహాలక్ష్మి అనే క్యాప్షన్‌తో ఈ సీరియల్ రూపొందుతోంది.
తమిళ సీరియల్ రీమేక్…
తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిన్న మరుమగల్ కు రీమేక్‌గా భానుమతి సీరియల్ తెరకెక్కుతోంది. భానుమతి సీరియల్లో శంకర్‌కుమార్ చక్రవర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతున్న ఈ సీరియల్‌తోనే వీరిద్దరు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.
సీరియల్ ప్రోమో…
భానుమతి సీరియల్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఇందులో పెళ్లి కూతురు గెటప్‌లో ఎగ్జామ్స్ రాస్తూ చైత్ర కనిపించింది. జీవితం మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లాంటిది. మ్యాథ్స్‌లోని ప్రాబ్లెమ్స్ నేను ఈజీగా సాల్వ్ చేయగలను. కానీ మా ఇంట్లో ప్రాబ్లెమ్స్ అంటూ ఆగిపోయింది. ఆ తర్వాత …ఆ అమ్మది ఒక ప్రాబ్లెమ్…మా నాన్నది ఒక ప్రాబ్లెమ్…మా చెల్లిది మరో ప్రాబ్లెమ్ అంటూ భానుమతి కుటుంబసమస్యలను ప్రోమోలో చూపించారు. భానుమతి తండ్రి తాగుబోతుగా ఈ సీరియల్లో కనిపిస్తోన్నాడు. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా తండ్రి చేసిన అప్పుల కారణంగా భానుమతి కుటుంబం పడే అవమానాలను ఆవిష్కరిస్తూ ప్రోమో సాగింది.
ఇదే చివరి పరీక్ష కాకూడదు…
పదిహేడేళ్ల వయసులో ఈజీగాసాల్వ్ చేయలేని ప్రాబ్లెమ్ ఇచ్చాడు మా నాన్న. అదే నా పెళ్లి…ఈ ప్రాబ్లెమ్‌ను ఎలాగైనా సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇదే నేను రాసే చివరి పరీక్ష కాకూడదని భానుమతి చెప్పే డైలాగ్స్ ప్రోమోలో ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ బాగా చదువుకోవాలని కలలు కనే ఓ యువతికి పెళ్లి ఎలా అడ్డంకిగా మారింది? పెళ్లి తర్వాత తన చదువును కొనసాగించిందా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఈ సీరియల్ తెరకెక్కుతోన్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.
జనవరి నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరిలో ఈ సీరియల్ లాంఛ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీరియల్ స్థానంలో భానుమతి టెలికాస్ట్ అవుతుందని ఆసక్తికరంగా మారింది.
టీఆర్పీలో టాప్…
లాంగ్ గ్యాప్ తర్వాత హీరో నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ సీరియల్స్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. చిన్న మరుమగల్ సీరియల్ స్టార్ విజయ్ ఛానెల్లో టెలికాస్ట్ అవుతోంది. తమిళంలో టీఆర్పీ రేటింగ్ పరంగా టాప్‌లో ఉంది. చిన్న మరుమగల్ సీరియల్ గత ఏడాది జనవరిలో లాంఛ్ అయ్యింది. ఈ సీరియల్లో నవీన్ కుమార్, శ్వేత కీలక పాత్రలు పోషిస్తోన్నారు. మనోజ్ కుమార్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఇటీవలే స్టార్ మాలో నువ్వుంటే నా జతగా, గీత ఎల్ఎల్బీ, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ కొత్తగా లాంఛ్ అయ్యాయి.