Tasty Pulao: పావుగంటలో పాలక్ పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి, సింపుల్ రెసిపీ ఇదిగో

Best Web Hosting Provider In India 2024

Tasty Pulao: పావుగంటలో పాలక్ పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి, సింపుల్ రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Jan 10, 2025 11:30 AM IST

Tasty Pulao: పాలకూర, పనీర్ రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇక్కడ మేము పాలక్ పనీర్ పులావ్ సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో చెప్పాము, రెసిపీ ఫాలో అయిపోండి.

పాలక్ పనీర్ పులావ్ రెసిపీ
పాలక్ పనీర్ పులావ్ రెసిపీ (Youtube)

ఏ కాలంలోనైనా పనీర్, పాలకూర మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఈ రెండూ కలిపి పాలకూర పనీర్ పులావ్ చేసి చూడండి. చలికాలంలో దీన్ని విడివిడిగా తింటే రుచి అదిరిపోతుంది. దీన్ని చేయడానికి ఎక్కువ సమయం కష్టపడక్కర్లేదు.. సింపుల్ గా చేసేయవచ్చు. మిగతా పులావులతో పోలిస్తే తక్కువ టైంలోనే ఇది రెడీ అయిపోతుంది. ఈ పోషకాల పాలక్ పనీర్ పులావ్ ఎలా చేయాలో చూడండి.

yearly horoscope entry point

పాలకూర పనీర్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

పాలకూర కట్టలు – రెండు

నీళ్లు – తగినన్ని

ఆయిల్ – మూడు స్పూన్లు

నెయ్యి – రెండు స్పూన్లు

జీలకర్ర – ఒక స్పూను

ఎండుమిర్చి – రెండు

వెల్లుల్లి తరుగు – రెండు స్పూన్లు

అల్లం తరుగు – రెండు స్పూన్

పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూన్

ఉల్లిపాయలు – పావు కప్పు

కారం – ఒకటిన్నర స్పూను

ధనియాల పొడి – ఒక స్పూను

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

వండిన అన్నం – రెండు కప్పులు

పాలక్ పనీర్ పులావ్ రెసిపీ

1. తాజా పాలకూరను ఈ పులావ్ చేసేందుకు తీసుకోవాలి.

2. ఒక గిన్నెలో నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి పాలకూరను వేసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించాలి.

3. తర్వాత పాలకూరను వడకట్టి తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పాలకూర ప్యూరీని పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె, నెయ్యి రెండు వేయాలి.

5. ఇది వేడెక్కాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.

6. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, దంచుకున్న అల్లం వేసి కలుపుకోవాలి.

7. అందులోనే పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని ఉల్లిపాయ ముక్కలు రంగు మారేవరకు వేయించాలి.

9. తర్వాత అందులో పన్నీర్ క్యూబ్స్ ను వేసి వేయించుకోవాలి.

10. కసూరి మేతి కూడా వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.

11. పనీర్ ముక్కలు పచ్చివాసన రాకుండా కాసేపు చిన్నమంట మీద వేయించాలి.

12. తర్వాత ముందుగా ప్యూరీగా చేసి పెట్టుకున్న పాలకూరను వేసి బాగా కలుపుకోవాలి.

13. దీన్ని చిన్నమంట మీదే ఉడికించాలి. తర్వాత కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

14. చిన్నమంట మీద ఉంచి దీన్ని బాగా వేయించాలి.

15. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసి ఒక స్పూన్ నెయ్యి, కాస్త కసూరి మేతి, కొత్తిమీర తరుగు వేసి పులిహోర లాగా ఇదంతా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

16. అంతే టేస్టీ పాలక పనీర్ పులావ్ రెడీ అయినట్టే. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది.

పాలక్ పనీర్ పులావ్ ఎంత తిన్నా కూడా తినాలనిపించేలా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పాలకూరలో, పన్నీర్ లో రెండింట్లోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఉండే ఫోలేట్ ప్రతి ఒక్కరికి అవసరం. పనీర్ లో ఉండే కాల్షియం కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కావాలి. కాబట్టి పోషకాల పాలక్ పనీర్ పులావ్ ను మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024