Best Web Hosting Provider In India 2024
Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 10 సినిమాలు.. 6 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో 6 సినిమాలు స్పెషల్‌గా ఉండగా.. మూడు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొత్తంగా ఈ సినిమాలన్లీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ జోనర్స్‌లో ఉన్నాయి.
OTT Movies Release Today Telugu: ఓటీటీలోకి ఇవాళ ఏకంగా 10 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో క్రైమ్, హారర్ ఫాంటసీ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్, బయోగ్రాఫికల్ డ్రామా జోనర్స్‌లో సినిమాలు ఉన్నాయి. మరి అవేంటీ, ఎక్కడ చూడాలి, ఏ సినిమాలు స్పెషల్ అనేది ఇక్కడ తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
మిస్ యూ (తెలుగు, తమిళ రొమాంటిక్ మూవీ)- జనవరి 10
ఫోకస్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ సినిమా)- జనవరి 10
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
అడ్ విటమ్ (హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 10
బ్లాక్ వారెంట్ (హిందీ వెబ్ సిరీస్)- జనవరి 10
ఆల్ఫా మేల్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- జనవరి 10
బచ్చల మల్లి (తెలుగు రూరల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 10
హైడ్ అండ్ సీక్ (తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- ఆహా ఓటీటీ- జనవరి 10
అథోముగం (తమిళ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- జనవరి 10
గూస్‌బంప్స్ ది వానిషింగ్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 10
ది సబర్మతి రిపోర్ట్ (హిందీ డ్రామా చిత్రం)- జీ5 ఓటీటీ- జనవరి 10
రోడీస్ డబుల్ క్రాస్ (హిందీ రియాలిటీ షో)- జియో సినిమా ఓటీటీ- జనవరి 11
ఒక్కరోజే ఓటీటీలోకి 10 స్ట్రీమింగ్
ఇలా ఇవాళ ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 10 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అల్లరి నరేష్ నటించిన తెలుగు రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ బచ్చల మల్లి, హీరో సిద్ధార్థ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మిస్ యూ, తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా హైడ్ అండ్ సీక్, బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం ది సబర్మతి రిపోర్ట్ చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
స్పెషల్ 6- తెలుగులో 3
వీటితోపాటు హారర్ ఫాంటసీ థ్రిల్లర్ గూస్‌బంప్స్ ది వానిషింగ్ వెబ్ సిరీస్, తమిళ థ్రిల్లర్ డ్రామా అథోముగం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా మొత్తంగా ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన పదింట్లో ఐదు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో ఆరు స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో మూడు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.