Best Web Hosting Provider In India 2024
Rashmika Mandanna Injury: జిమ్‌లో గాయపడిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఇప్పుడెలా ఉందంటే?
Rashmika Mandanna Injury: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జిమ్ లో గాయపడింది. దీంతో ఆమె నటిస్తున్న సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. యానిమల్, పుష్ప 2 బ్లాక్‌బస్టర్ హిట్స్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. ప్రస్తుతం వివిధ సినిమాల్లో నటిస్తోంది.
Rashmika Mandanna Injury: రష్మిక మందన్నా జిమ్ చేస్తూ గాయపడింది. దీంతో ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న సికందర్ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఆమె బాగానే కోలుకుంటోందని రష్మిక సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఆమె నటిస్తున్న అన్ని ప్రాజెక్టులు మళ్లీ మొదలవుతాయని కూడా తెలిసింది. ఈ మధ్యే ఆమె పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే.
రష్మిక మందన్నాకు గాయం
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తోంది. ఈ మధ్యే పుష్ప 2 రూపంలో ఆమె ఖాతాలో ఓ బిగ్గెస్ట్ హిట్ పడింది. అంతకుముందు ఏడాది కూడా యానిమల్ రూపంలో రష్మిక బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె జిమ్ చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తూ గాయపడింది. ఆమెపై గాయం రష్మిక సన్నిహిత వర్గాలు స్పందించాయి. “జిమ్ చేస్తూ ఈ మధ్యే రష్మిక గాయపడింది.
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటోంది. అయితే దీనివల్ల ఆమె నటిస్తున్న సినిమాల షూటింగులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకుంటోంది. త్వరలోనే మళ్లీ షూటింగులు మొదలు పెడుతుంది” అని ఆ వర్గాలు తెలిపాయి. రష్మిక గాయం చిన్నదే అయినా.. ఆమె చేతుల్లో ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులు ఉన్న కారణంగా కాస్త విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
సికందర్ మూవీ షూటింగ్
ప్రస్తుతం రష్మిక మందన్నా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి సికందర్ మూవీ షూటింగ్ చేస్తోంది. ఈ సినిమాను ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఆమెకు గాయమవడంతో ఈ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. నిజానికి శుక్రవారం (జనవరి 10) నుంచి సికందర్ చివరి దశ షూటింగ్ లో రష్మిక, సల్మాన్ పాల్గొనాల్సి ఉందని మూవీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీలో ఈ ఏడాది మార్చిలో రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పుడు రష్మిక గాయం వల్ల షూటింగ్ ఆలస్యమైనా.. రిలీజ్ వాయిదా పడే అవకాశాలు లేవని ఆ మూవీ టీమ్ చెబుతోంది.
సికందర్ తోపాటు రష్మిక పలు ఇతర సినిమాల్లోనూ నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ కూడా చేస్తోంది. ఈ మధ్యే మూవీ టీజర్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా విక్కీ కౌశల్ తో కలిసి మరో బాలీవుడ్ మూవీ చావాలోనూ నటిస్తోంది.