Best Web Hosting Provider In India 2024
Allu Aravind Birthday: పుష్ప కా బాప్ కేక్‌తో అల్లు అరవింద్ 76వ బర్త్‌డే సెలబ్రేషన్స్ చూశారా.. అల్లు అర్జున్‌తో కలిసి..
Allu Aravind Birthday: అల్లు అరవింద్ తన 76వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. పుష్ప కా బాప్ అని రాసి ఉన్న కేకును అల్లు అర్జున్, ఫ్యామిలీతో కలిసి అతడు కట్ చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్నాయి.
Allu Aravind Birthday: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ శుక్రవారం (జనవరి 10) తన 76వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్ ఫొటోలను అల్లు అర్జున్ తమ్ముడు, నటుడు అల్లు శిరీష్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు. తన బర్త్ డే రోజు అల్లు అరవింద్.. పుష్ప కా బాప్ అని రాసి ఉన్న కేకును కట్ చేయడం విశేషం. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పుష్ప కా బాప్ అల్లు అరవింద్ బర్త్ డే
ఈ మధ్యే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో పుష్ప థీమ్ తోనే ఉన్న కేకును అల్లు అరవింద్ కట్ చేశాడు. అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి, శిరీష్ తోపాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఆ ఫొటోను అల్లు శిరీష్ పోస్ట్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే డాడ్.. మీకు గొప్ప ఏడాది కావాలి. అతని కోసం వాళ్ల ఫ్రెండ్స్ చేసిన బెస్ట్ కేక్ ఇది” అని అన్నాడు.
పుష్ప థీమ్ కేకుపై పుష్ప కా బాప్ అని రాసి ఉండటంతో మూవీలో అతని బ్రాండ్ అయిన చేతి గుర్తును కూడా ఈ కేకుపై చూడొచ్చు. పుష్ప 2 మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది అల్లు అరవింద్ బర్త్ డే ప్రత్యేకంగా నిలిచింది.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీ..
అల్లు అరవింద్ కట్ చేసిన ఈ కేకు చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆ కేకే ఈ ఏడాది హైలైట్ అని ఓ అభిమాని కామెంట్ చేశారు. ఆ తండ్రిలాగే కేకు కూడా లెజెండరీ అని మరొకరు అన్నారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఆ కేకును తీసుకొచ్చాడా అంటూ కొందరు ప్రశ్నించారు. అల్లు అరవింద్ తోపాటు ఈ ఫొటోలో అతని భార్య నిర్మల, అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి, వాళ్ల పిల్లలు, అల్లు శిరీష్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అటు అల్లు స్నేహారెడ్డి కూడా ఈ కేక్ కటింగ్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
పుష్ప 2 బ్లాక్ బస్టర్ కావడంతో అల్లు ఫ్యామిలీ మొత్తం చాలా ఖుషీగా ఉంది. సంధ్య థియేటర్ ఘటన, జైలు, బెయిలు లాంటి ఘటనలతో అల్లు అర్జున్ ఈ మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు తన తండ్రి అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా పుష్ప థీమ్ కేకుతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు.
టాపిక్