Best Web Hosting Provider In India 2024
Daaku Maharaj Release Trailer: రాయలసీమ నా అడ్డా.. చంపడంలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ మరో లెవెల్
Daaku Maharaj Release Trailer: బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ మరో లెవెల్లో ఉంది. బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగులు, మాస్ యాక్షన్ సీన్లతో నిండిపోయిన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ మూవీ ఆదివారం (జనవరి 12) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Daaku Maharaj Release Trailer: డాకు మహారాజ్ మాస్ అవతార్ ఏంటో రిలీజ్ ట్రైలర్ తో చూపించారు మేకర్స్. నందమూరి బాలకృష్ణ మరో నట విశ్వరూపానికి చిన్న టీజర్ లా ఈ రిలీజ్ ట్రైలర్ కనిపిస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి సందర్భంగా వచ్చే ఆదివారం (జనవరి 12) రిలీజ్ కానుండగా.. శుక్రవారం (జనవరి 10) ఈ కొత్త ట్రైలర్ వచ్చింది. బాలయ్య బాబు మాస్ డైలాగులకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని దీనిని చూస్తే తెలుస్తోంది.
డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్
రాయలసీమ మాలూమ్ తేరేకో.. ఓ మేరా అడ్డా.. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్.. ఇలాంటి పవర్ ఫుల్, మాస్ డైలాగులతో నిండిపోయింది డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్. మొదట వచ్చిన ట్రైలర్ తో పోలిస్తే ఈ ట్రైలర్లో మొత్తం బాలకృష్ణ మార్క్ డైలాగులే వినిపిస్తాయి.
అనంతపురంలో నిర్వహించాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో తొక్కిసలాట కారణంగా రద్దు చేయగా.. శుక్రవారం (జనవరి 10) హైదరాబాద్ లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే రిలీజ్ ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు. ఈ తాజా ట్రైలర్ తో డాకు మహారాజ్ పై ఉన్న అంచనాలు మరో లెవెల్ కు వెళ్లాయనడంలో సందేహం లేదు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఒంటిపై 16 కత్తి గాయాలు.. ఓ బుల్లెట్ గాయం.. అయినా కింద పడకుండా అంతమందిని నరికాడంటే.. అతడు మనిషి కాదు.. వైల్డ్ యానిమల్ అనే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. తర్వాత బాలయ్య పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. హమ్ కో దుష్మన్ కమ్.. జాన్ దేనే వాలే ఫ్యాన్స్ జాదా హై అనే డైలాగుతో బాలయ్య మొదలుపెడతాడు.
రాయలసీమ మాలూమ్ తేరే కో.. వో మేరా అడ్డా.. ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు.. నేను చంపడంలో మాస్టర్స్ చేశా.. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ ఇలా వరుస డైలాగులతో చెలరేగిపోయాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈ సంక్రాంతికి థియేటర్లు మార్మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. డాకు మహారాజ్ మూవీ ఆదివారం (జనవరి 12) థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. రెండేళ్ల కిందట చిరంజీవితో వాల్తేర్ వీరయ్యతో వచ్చిన డైరెక్టర్ బాబీ కొల్లి.. ఇప్పుడు బాలకృష్ణతో ఈ డాకు మహారాజ్ తీశాడు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ కు యావరేజ్ టాక్ రావడం కూడా డాకు మహారాజ్ కు కలిసి రావచ్చు.