Best Web Hosting Provider In India 2024
Murder Mystery Movie: తెలుగులోకి వచ్చిన మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ – ఫ్రీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Murder Mystery Movie: తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ వీ2 డబుల్ మర్డర్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు.
Murder Mystery Movie: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కురుక్కు తెలుగులో వీ2 డబుల్ మర్డర్ అనే టైటిల్‌తో డబ్ అయ్యింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఫ్రీగా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వీ2 మూవీలో ఆనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, అజయ్ ఘోష్, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు.
కిల్లర్ ఎవరన్నది?..
ఓ డబుల్ మర్డర్ కేసును కొంత మంది పోలీస్ ఆఫీసర్ల బృందం ఎలా ఛేదించింది అన్నదే వీ2 డబుల్ మర్డర్ మూవీ కథ. కిల్లర్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాకుండా ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ మూవీని నడిపించిన తీరుకు ప్రశంసలు దక్కాయి.
స్టార్లు లేకుండా…
కురుక్కు మూవీ గత ఏడాది జూలైలో థియేటర్లలో రిలీజైంది. పెద్ద స్టార్లు ఎవరూ లేకుండా కేవలం కాన్సెప్ట్‌ను నమ్మి రిలీజైన ఈ మూవీ మలయాళంలో మంచి వసూళ్లను రాబట్టింది.
ఐఎమ్‌డీబీలో 10కిగాను 6.7 రేటింగ్‌ను ఈ మూవీ సొంతం చేసుకున్నది. కురుక్కు సినిమాలో కనిపించిన నటీనటులు చాలా మందికి ఇదే మొదటి మూవీ కావడం గమనార్హం.
వీ2 కథ ఇదే…
రూబిన్, అతడి వైఫ్ స్నేహ దారుణంగా హత్యకు గురవుతారు. రూబిన్ డెడ్‌బాడీ రోడ్డుపై కనిపించగా…స్నేహ తమ ఇంట్లోనే చనిపోయి ఉంటుంది. ఈ డబుల్ మర్డర్ కేసు సంచలనంగా మారుతుంది. హంతకుడిని జార్జ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కళ్లారా చూస్తాడు. కానీ మద్యం మత్తులో ఉండటంతో కిల్లర్‌ను గుర్తుపట్టలేకపోతాడు.
అనుకోకుండా జార్జ్ ఈ డబుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు. ఈ కేసు ఇన్వేస్టిగేషన్ బాధ్యతను సజన్ అనే పోలీస్ ఆఫీసర్ తీసుకుంటాడు. జార్జ్ నిరపరాధి అని సజన్ నమ్ముతాడు. డబుల్ మర్డర్స్ మిస్టరీని షణ్ముగం ఎలా ఛేదించాడు? రూబిన్, స్నేహలను హత్య చేసింది ఎవరు ? ఈ మర్డర్స్‌కు పోలీస్ ఆఫీసర్ జాన్ అబ్రహమ్‌కు ఉన్న సంబంధం ఏమిటి అన్నదే వీ2 డబుల్ మర్డర్స్ మూవీ కథ.
నిడివి ఎంతంటే?
వీ2 డబుల్ మర్డర్స్ మూవీ నిడివి కూడా గంట నలభై తొమ్మిది నిమిషాలే కావడం గమనార్హం. ఈ సినిమాకు దీక్ష్, సురేష్ మ్యూజిక్ అందించారు. మలయాళంలో మీరా నాయర్ హెవెన్, తిమిరం, సిగయ్‌తో పాటు పలు సూపర్‌హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. డైరెక్టర్ అభిజీత్ కురుక్కుతో పాటు ఊర కుడుక్కు అనే వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించాడు.