NNS 11th January Episode: ​శరీరంలోకి ఆరు ఆత్మ.. ఎక్కడుందో తెలుసుకునే శక్తి మనోహరికి ఇచ్చిన ఘోర.. మిస్సమ్మలో అనుమానం!

Best Web Hosting Provider In India 2024

NNS 11th January Episode: ​శరీరంలోకి ఆరు ఆత్మ.. ఎక్కడుందో తెలుసుకునే శక్తి మనోహరికి ఇచ్చిన ఘోర.. మిస్సమ్మలో అనుమానం!

Hari Prasad S HT Telugu
Jan 11, 2025 06:00 AM IST

NNS 11th January Episode: ​నిండు నూరేళ్ల సావాసం శనివారం (జనవరి 11) ఎపిసోడ్లో ఆరు ఆత్మ ఇంట్లోని ఓ వ్యక్తి శరీరంలోకి వెళ్లిందని ఘోర గుర్తిస్తాడు. ఎవరిలోకి వెళ్లిందో తెలుసుకునే శక్తి మనోహరికి ఇస్తాడు. అటు మిస్సమ్మలో కొత్త అనుమానం మొదలవుతుంది.

శరీరంలోకి ఆరు ఆత్మ.. ఎక్కడుందో తెలుసుకునే శక్తి మనోహరికి ఇచ్చిన ఘోర.. మిస్సమ్మలో అనుమానం!
శరీరంలోకి ఆరు ఆత్మ.. ఎక్కడుందో తెలుసుకునే శక్తి మనోహరికి ఇచ్చిన ఘోర.. మిస్సమ్మలో అనుమానం!

NNS 11th January Episode: ​జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 11) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పౌర్ణమి రోజు ఆరు ఆత్మ ఎవరి శరీరంలో ప్రవేశించిందోనని వెతుకుతూ ఉంటాడు గుప్త. ఆశ్రమం దగ్గర నిల్చుని ఏడుస్తున్న ఆరుని చూసి ఏమైందని అడుగుతాడు. మీరు ఇన్నాళ్లనుంచి నాకు చాలా సహాయం చేస్తున్నారు. చివరిగా మరొక సాయం చేయగలరా అని అడుగుతుంది ఆరు. ఏంటో చెప్పమంటాడు గుప్త. కొద్ది రోజులు మా చెల్లితో.. మా నాన్నతో గడపాలని ఉంది. ఈ ఒక్క కోరిక మన్నించండి అని అడుగుతుంది ఆరు.

yearly horoscope entry point

అస్తికలను కలపకుండా ఆపుతానన్న ఆరు

గుప్త మౌనంగానే ఉండిపోతాడు. పోనీ అస్థికలు నదిలో కలపకుండా ఏమైనా చేయమంటారా..? అంటుంది ఆరు. బాలిక అది అసాధ్యం అంటాడు గుప్త. అసలు కుదరదా గుప్త గారు మీరేం చేయలేరా…? అని అడుగుతుంది.

చేయలేను అంటాడు గుప్త అయితే నేనే ఏదో ఒకటి చేస్తాను. ఆస్తికలు నదిలో కలపకుండా ఏదో ఒకటి చేయాలి చేస్తాను అంటూ ఆరు ఇంటికి వెళ్తుంది. గుప్త ఎంత చెప్పినా వినకుండా వెళ్తుంది. గుప్త ఏం చేయలేక యముడిని పిలుస్తాడు. యముడు రాడు.

మనోహరిపై మిస్సమ్మ అనుమానం

మనోహరి చేతల గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది మిస్సమ్మ. నిర్మల వచ్చి పిలిచినా పలకదు. గట్టిగా పిలుస్తుంది నిర్మల. ఉలిక్కి పడిన మిస్సమ్మ అత్తయ్యా అంత గట్టిగా అరవకుంటే పిలవొచ్చు కదా అంటుంది. నా పిలుపు కానీ నా అరుపు కానీ నీ చెవిలో పడలేదు కదా..? అందుకే అరిచాను అంటుంది నిర్మల. మీరు పిలిచారా…? ఏదో ఆలోచనలో ఉండి వినిపించలేదు అని మిస్సమ్మ చెప్పగానే వినిపించని అంతగా ఆలోచిస్తున్నావా..? అని అడగ్గానే.. మనోహరి కిచెన్‌లోకి వచ్చి అదోలా చూసింది అని చెప్పగానే నా గది దగ్గరకు కూడా వచ్చి అదోలా చూసింది. ఎందుకని అలా చూస్తున్నావు అని అడగ్గానే.. నీకోసం వెతుకుతున్నాను అని చెప్పింది.

మళ్లీ మనోహరి ఏదైనా ప్లాన్‌ చేస్తుందని ఆలోచిపస్తున్నావా..? అని నిర్మల చెప్పగానే కాదు అత్తయ్యా ప్రతి పౌర్ణమికి ఆ మనోహరి ఇంట్లో ఏదో వెతుకుతుంది. ఇంతకు ముందు కూడా నా దగ్గరకు వచ్చి ఆరు అని పిలిచింది అని చెప్తుంది మిస్సమ్మ. ఇప్పుడు నాకు అర్థం అయింది. ఎప్పుడు ఎవరినో అడిగి తనకు పిచ్చి పట్టినట్టు ఉంది అంటుంది నిర్మల. మీరు అలా తేలిగ్గా మాట్లాడకండి అత్తయ్యా మనోహరి చేసే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది అంటూ పౌర్ణమి రోజు ఆరు అక్క ఆత్మకు శక్తి వచ్చి ఎవరిలోనైనా ప్రవేశిస్తుందేమో అంటుంది మిస్సమ్మ. కథ బాగుందని నిర్మల వెటకారంగా చెబితే.. సరే అత్తయ్యా పదండి అంటూ వెళ్లిపోతుంది.

ఇంట్లోని వ్యక్తిలోకి దూరిన ఆరు ఆత్మ

ఆరు ఇంటికి వస్తుంది. గుప్త ఆపుతూ.. నువ్వు ఇది చేయడం సరికాదు. అంటే సరి అయినది కాబట్టే ఆ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు అంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. గుప్త ఎంత చెప్పినా వినదు. గుప్త భయంతో యముడిని పిలుస్తాడు. యముడు రాగానే.. ఆ బాలిక మనం చెప్పిన మాట వినదని చెప్పాను కదా..? ఇప్పుడు ఆ బాలిక మానవ శరీరంలో దూరింది. ఇప్పుడేమి చేయాలి అని అడుగుతాడు.

ఆ బాలికను ఏమైనా చేసి ఎన్ని మాయలు చేసైనా సరే యమపురికి తీసుకురా…? అని చెప్తాడు యముడు. మనోహరి.. ఘోర దగ్గర ఉంటుంది. పౌర్ణమి గడియలు మొదలైయ్యాక కూడా ఆత్మ ఎవరి ఒంట్లోకి ప్రవేశించలేదా అంటూ ఆవేశపడుతుంటాడు. అది ఎవరి ఒంట్లోకి దూరలేదు కానీ నేను కొంచెం ఉంటే అమర్‌కు దొరికిపోయేదాన్ని.. అయినా అది ఎవరిలోకి దూరకపోతే నేనేం చేయాలి. అయినా రేపు ఆస్తికలు కలపాలనుకుంటున్నారు. ఈ పౌర్ణమికి శక్తి ఉందో లేదో అంటుంది మనోహరి. ఇంతలో ఘోర మంత్రం వేసి చూసి ఆత్మ ఆ ఇంట్లో ఒకరిలోకి ప్రవేశించింది అని చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది.

నేను చూశాను ఎవరిలోకి ప్రవేశించలేదు అంటుంది మనోహరి. ఆత్మ ఇప్పుడే మనిషిలోకి ప్రవేశించింది వెళ్లి చూసి చెప్పు అంటూ మనోహరికి ఒక లాకెట్‌ ఇస్తూ ఇది నీ మెడలో వేసుకో.. ఇంట్లో ఉన్న వాళ్లందరినీ ముట్టుకో ఎవరిని ముట్టుకుంటే ఈ ముత్యం వెలుగుతుందో వారిలో ఆత్మ ఉన్నట్లే అని చెప్తాడు. సరే అని మనోహరి వెళ్తుంది. మనోహరి ఆరు ఆత్మ ఎవరి శరీరంలో ఉందో కనుక్కుంటుందా? ఘోర తాయత్తు పనిచేస్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి​ 11న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024