Best Web Hosting Provider In India 2024
OTT Telugu: ఓటీటీలోకి ఒక్కరోజే 4 తెలుగు సినిమాలు.. అదిరిపోయే రేటింగ్, డిఫరెంట్ జోనర్స్.. ఒక్కదాంట్లోనే 3 స్ట్రీమింగ్!
OTT Release Movies Telugu Latest: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 4 తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవి కూడా 7.5కిపైగా రేటింగ్‌తో చూసేందుకు బెస్ట్ అయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, లవ్ యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ జోనర్స్‌లో ఉన్నాయి. వీటిలో 3 సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ అయ్యాయి.
OTT Telugu Movies Release : ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ శుక్రవారం (జనవరి 10) థియేటర్‌లో గేమ్ ఛేంజర్ హవా నడవగా.. ఓటీటీల్లో నాలుగు తెలుగు సినిమాలు రెండు, రెండు ఓటీటీల్లో రిలీజ్ అయి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. నాలుగు డిఫరెంట్ జోనర్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాలను ఎక్కడెక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రేమించొద్దు ఓటీటీ
గతేడాది జూన్ 7న తెలుగులో చిన్న సినిమాగా రిలీజ్ అయింది ప్రేమించొద్దు. డోంట్ లవ్ అనేది క్యాప్షన్. టీనేజ్ లవ్ స్టోరీ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేదు. శిరిన్ శ్రీరామ్ నిర్మాతగా, దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియాగా ఐదు భాషల్లో తెరకెక్కింది.
పదికి 8 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకున్న ప్రేమించొద్దు ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 10 నుంచి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ అండ్ బీ సినీ ఈటీ లేదా బీసినీట్ (Bcineet OTT) రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ప్రేమించొద్దును ఎంచక్కా చూసేయొచ్చు.
బచ్చల మల్లి ఓటీటీ
అల్లరి నరేష్, అమృత అయ్యర్ హీరో హీరోయిన్స్‌గా నటించిన రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ మూవీ బచ్చల మల్లి. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో తెరకెక్కిన బచ్చల మల్లికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కకపోయిన ఐఎమ్‌డీబీ నుంచి మాత్రం 9.4 రేటింగ్ సాధించుకుంది.
ఇలాంటి బచ్చల మల్లి సినిమా ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయింది. జనవరి 10 నుంచి ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్, సన్ ఎన్ఎక్స్‌టీలో బచ్చల మల్లి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మాత్రం రెంటల్ విధానంలో బచ్చల మల్లి అందుబాటులో ఉంది.
హైడ్ అండ్ సీక్ ఓటీటీ
2024 సెప్టెంబర్ 20న తెలుగులో రిలీజ్ అయిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్. బసిరెడ్డి రానా కథ, దర్శకత్వం వహించిన హైడ్ అండ్ సీక్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 9.1 రేటింగ్ తెచ్చుకుంది. జనవరి 10 నుంచి ఆహాలో హైడ్ అండ్ సీక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఈ మూవీని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
మిస్ యూ ఓటీటీ
హీరో సిద్ధార్థ్, ఆషిక రంగనాథ్ జోడీగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మిస్ యూ. ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ సంపాదించుకుంది. ఈ శుక్రవారం (జనవరి 10) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో మిస్ యూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు, తమిళం భాషలో అందుబాటులో ఉన్న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇలా జనవరి 10న ఒక్కరోజే నాలుగు తెలుగు సినిమాలు రాగా వాటిలో అమెజాన్ ప్రైమ్‌లో 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్