Best Web Hosting Provider In India 2024
Karthika Deepam 2: దీపకు కార్తీక్ సేవలు – జ్యోత్స్న సీఈవో పోస్ట్‌కు ఎసరు – ఆనందంతో శ్రీధర్ డ్యాన్స్
Karthika Deepam 2: కార్తీక దీపం 2 జనవరి 11 ఎపిసోడ్‌లో కార్తీక్ చేతిలో తన ఓటమికి జ్యోత్స్ననే కారణమని శివన్నారాయణ ఫైర్ అవుతాడు. సీఈవో పోస్ట్ నుంచి నిన్ను తీసేస్తున్నానని, ఇక నుంచి ఆఫీస్‌కు వెళ్లద్దని జ్యోత్స్నకు ఆర్డర్ వేస్తాడు.
Karthika Deepam 2: కార్తీక్ మెడలో ఉన్న లాకెట్ కావాలని శౌర్య పట్టుపడుతుంది. కూతురు ఎంత అడిగిన కార్తీక్ ఇవ్వనని అంటాడు. అమ్మ అడిగిన కూడా ఆ లాకెట్ ఇవ్వవా అని ఫిట్టింగ్ పెడుతుంది శౌర్య. మీ అమ్మ అడగలేదుగా అని శౌర్యతో అంటాడు కార్తీక్. అది కార్తీక్ సొంత విషయం, ఆ లాకెట్‌ను అడగొద్దు అంటూ కూతురిపై దీప ఫైర్ అవుతుంది.
లాకెట్ పంచాయితీ…
లాకెట్ పంచాయితీ ఎటు నుంచి ఎటో పోతుంది అని కార్తీక్ కంగారు పడతాడు. దీప కూడా ఇబ్బంది పడుతుందని అనుకుంటాడు. తన మెడలో నుంచి లాకెట్ తీసేస్తాడు. ఈ లాకెట్ ఎవరి కంట పడకుండా దాచేస్తానని దీప, శౌర్యతో చెబుతాడు కార్తీక్.
ఈ లాకెట్ కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నా వారికి నా విన్నపం ఏమిటంటే ప్రాణదాత అంటే కృతజ్ఞత…నా మాటల్లోని సారాంశాన్ని గమనించగలరు అంటూ దీపకు ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇస్తాడు కార్తీక్. ఆ లాకెట్ మీ అమ్మది…మీ అమ్మమ్మ జ్ఞాపకం. ఆ లాకెట్ నీకు కార్తీక్ ఇచ్చే రోజు తొందరలోనే దీప మనసులో కోరుకుంటుంది.
శివన్నారాయణ ఫైర్…
జ్యోత్స్న ఆఫీస్‌లో చేసిన రచ్చను శివన్నారాయణ, సుమిత్ర, దశరథ్ తప్పుపడతారు. మనవరాలికి క్లాస్ ఇస్తాడు శివన్నారాయణ. రేపటి నుంచి నువ్వు ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేద జ్యోత్స్నతో అంటాడు. తాను ఏ తప్పు చేయలేదని, సీఈవోగానే ఉంటానని వాదిస్తుంది జ్యోత్స్న.
రూల్స్ పాటించని నీలాంటి సీఈవో కంపెనీకి అవసరం లేదని శివన్నారాయణ ఆన్సర్ ఇస్తాడు. మనం చేతకానీ నిర్ణయాలు తీసుకుంటున్నావని కార్తీక్ నిరూపించేలా చేశావని, ఎంప్లాయ్స్‌కు నువ్వు సారీ చెప్పావంటే మేము చెప్పినట్లేనని శివన్నారాయణ చెబుతాడు.
కార్తీక్ గెలిచాడు…
మనం హీనంగా చూసిన కార్తీక్, దీప…నా ఎంప్లాయ్స్‌తో నా కంపెనీ ముందే ధర్నా చేయించి వాడు గెలిచాడని శివన్నారాయణ కోప్పడతాడు. వాడు గెలవడం కాదు నువ్వే మీ తాతను ఓడించావు…నీలాంటి తొందరపాటు మనిషిని సీఈవోను చేసినందుకు సిగ్గుపడుతున్నానని శివన్నారాయణ కోపంగా జ్యోత్స్నకు క్లాప్ ఇస్తాడు.
సుమిత్ర సలహా…
కార్తీక్‌ను తిరిగి సీఈవో చేస్తే బాగుంటుందని సుమిత్ర సలహా ఇస్తుంది. అదే జరిగితే నేను ఛైర్మన్ పోస్ట్ నుంచి తప్పుకుంటానని శివన్నారాయణ తన నిర్ణయం చెప్పేస్తాడు. మీరు ఇప్పుడు సీఈవో పోస్ట్ నుంచి తనను పక్కనపెడితే దీప ముందు ఓడిపోయినట్లు అవుతుందని, తనకు ఒక్క అవకాశం ఇవ్వమని కుటుంబసభ్యులను వేడుకుంటుంది. జ్యోత్స్న కూతురి నిర్ణయాలపై తనకు నమ్మకం పోయిందని,ద శరథ్ అంటాడు.
తప్పులు చేయద్దు…
ఇంకోసారి ఎప్పుడు తప్పు చేయనని క్షమించమని శివన్నారాయణ బతిమిలాడుతుంది దీప. మనవరాలు ఆవేదన చూసి శివన్నారాయణ కరిగిపోతాడు. నువ్వు మీ తాతను గెలిపిస్తావని అనుకున్నానని, కానీ కార్తీక్ చేతిలో ఓడిపోయేలా చేస్తావని ఊహించలేదని అంటాడు.
కార్తీక్ లేకపోతే కంపెనీ నడవదు అనేలా మరోసారి చేస్తే బాగోదని జ్యోత్స్నను హెచ్చరిస్తాడు. మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూ తలదించుకునేలా చేయద్దని జ్యోత్స్నకు శివన్నారాయణ వార్నింగ్ ఇస్తాడు.
పేరుకే సీఈవో…
ఇక నుంచి నువ్వు పేరుకే కంపెనీ సీఈవో..కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం నీకు లేదని అంటారు. తనకు ఎదురైన అవమానాలకు దీపనే కారణమని జ్యోత్స్న అనుకుంటుంది. ఆమెను ఇంతకు రెట్టింపు ఏడిపించాలని నిర్ణయించుకుంటుంది. దీపతో మాట్లాడకూడదని పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ.
శ్రీధర్ గంతులు…
శివన్నారాయణ పరువు కార్తీక్ తీసేసాడని తెలిసి శ్రీధర్ ఆనందంతో డ్యాన్సులు చేస్తుంటాడు. తనను కొట్టిన శివన్నారాయణకు తగిన శాస్తి జరిగిందని సంబరపడతాడు. కడుపు నిండా భోజనం చేసినంత హాయిగా ఉందని అంటాడు. మీ కొడుకు మీ మామగారి పరువు తీశారని మీరు ఆనందపడుతున్నారు సరే…రేపు మీకు అలాంటి అవమానమే జరిగితే ఏం చేస్తారని కావేరి అంటుంది.
తనను అవమానించేవారు ఎవరూ లేరని శ్రీధర్ బదులిస్తాడు. కార్తీక్ టిఫిన్ పొట్లాలు కట్టుకుంటూ దీపతో కలిసి పాత సైకిల్‌పై తిరుగుతున్నాడని అంటాడు. శివన్నారాయణకు తనకు ఎదురుపడే ధైర్యమే లేదని చెబుతాడు. నన్ను అవమానించిన వాళ్లందరికి దేవుడు బుద్దిచెప్పాడని సంబరపడిపోతాడు. వాళ్లతో పోలిస్తే తాను బెటర్ పొజిషన్‌లో ఉన్నానని గంతులేస్తాడు.
మారిపోయిన జ్యోత్స్న…
దీపపై పగతో మనవరాలు జ్యోత్స్న తప్పుటడుగులు వేస్తుందని పారిజాతం కనిపెడుతుంది. నీ కళ్లల్లో ఓటమి, తప్పు చేశానన్న భావన కంటే కసి ఎక్కువగా కనిపిస్తున్నాయని, నీ ప్రవర్తన, పద్ధతి, ఆలోచన అన్ని మారిపోయానని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. నువ్వు ఎక్కడో రూట్ తప్పి తప్పుల మీద తప్పులు చేస్తున్నావని మనవరాలితో అంటుంది పారిజాతం.
నువ్వు వెంటనే రూట్ మార్చకపోతే మీ అమ్మ, నాన్న…తాతయ్యమనసు మార్చేసి మళ్లీ మన రెండు కుటుంబాల్ని ఏకం చేసే ప్రమాదముందని పారిజాతం అంటుంది. దీప, దాని కూతురు తప్పితే రెండు కుటుంబాలు ఎప్పటికైనా ఏకం కావాల్సిందేనని జ్యోత్స్న అంటుంది. అప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కంపెనీలో ఎంప్లాయ్స్ గురించి కాదు దీప గురించి అని మనవరాలితో చెబుతుంది పారిజాతం.
వీక్ పాయింట్ తెలుసుకో…
టార్గెట్ ఎంత బలమైంది అయినా ఏదో వీక్ పాయింట్ ఉంటుందని, అది తెలుసుకొని దెబ్బకొట్టాలి…లేదంటే ఆ టార్గెట్ అందుకునే బలాన్ని పెంచుకోవాలి. అలా కాకుండా తొందరపడితే ఇలాగే అందరి ముందు ఓడిపోయి ఇలా తలదించుకోవాల్సివస్తుందని మనవరాలికి సలహా ఇస్తుంది పారిజాతం.
తాత నిన్నుసీఈవో పోస్ట్ నుంచి తీసేలోపు నీ తప్పులను సరిదిద్దుకోమని మనవరాలితో అంటుంది.దీప కంట్లో కన్నీళ్లు చూసే వరకు ఊరుకునేది లేదని అంటుంది. ఎవరికో ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది.
దీపకు కార్తీక్ సేవలు…
పెద్ద గిన్నె టేబుల్‌పై పెట్టబోయి నొప్పితో విలవిలలాడుతుంది దీప. ఏమైందని కార్తీక్ కంగారుగా కిచెన్‌లోకి వస్తాడు. చేయి నొప్పిగా ఉందని దీప అంటుంది. ఉదయం నుంచి నిద్రపోయే వరకు కాలంతో పోటీపడి పనిచేస్తే ఇలాగే ఉంటుందని కార్తీక్ అంటాడు.
దీప చేయికి కొబ్బిరి నూనె, పెయిన్ బామ్ కార్తీక్ స్వయంగా రాస్తాడు. కార్తీక్ కింద కూర్చోవడం చూసి దీప ఇబ్బంది పడుతుంది. ఎవరైన వస్తే బాగోదు అని అంటుంది. అందరూనిద్రపోయాయని కార్తీక్ అంటాడు. దీప చేతికి పెయిన్ బామ్ రాస్తుంటాడు కార్తీక్. కానీ దీప చేయిని వెనక్కి తీసుకుంటుంది. మీరు ఇలా నాకు సేవలు చేయడం బాగాలేదని అంటుంది.
పెళ్లానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టం అని అంటాడు. రేపు ఎప్పుడైనా మన మధ్య గొడవలు జరిగినప్పుడు నీ కోస వంట చేశా…కాళ్లు నొక్కా అంటూ చేసిన సేవలన్నీ చెబుతావు కదా…నేను కొన్ని పనులు చేసి నీపై ఎదురుదాడి దిగొచ్చని కార్తీక్ చెబుతాడు.
కార్తీక్ కవితలు…
కార్తీక్ తనపై కురిపిస్తోన్న ప్రేమ చూసి దీప ఎమోషనల్ అవుతుంది. మీలాంటి భర్త దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలని మనసులో అనుకుంటుంది. ఏ జన్మలో ఎవరికి ఎవరం రుణపడిపోయామో తెలియదు కానీ మీతో కలిసి బతికే రాత దేవుడు రాశాడని అనుకుంటుంది.
దీపను తన మాటలతో నవ్విస్తాడు కార్తీక్. నువ్వు నవ్వితే బాగుంటావని భార్యను పొగుడుతాడు.నీ కను రెప్పలు హంస రెక్కల్లా ఉంటాయని అంటాడు. ఆడపిల్ల అమాయకమైన నవ్వు..శీతాకాలం పొగమంచులను చీల్చుకొని వచ్చే సూర్య కిరణాల మాదిరిగా వెచ్చగా ఉంటాయని అంటాడు. తనలోని కవిని వెలికితీస్తాడు. కార్తీక్ ప్రేమకు ఫిదా అవుతుంది దీప. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.