Urine Smells: మీ మూత్రం దుర్వాసన వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి, ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు!

Best Web Hosting Provider In India 2024

Urine Smells: మీ మూత్రం దుర్వాసన వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి, ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు!

Ramya Sri Marka HT Telugu
Jan 11, 2025 08:30 AM IST

Urine Smells: మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో దుర్వాసన వస్తే, దానిని తేలికగా తీసుకోకండి. ఇది శరీరంలో అంతర్లీనంగా పెరుగుతున్న 5 వ్యాధులకు సంకేతం కావచ్చు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించకపోవడం మరెన్నో ప్రమాదాలకు దారి తీయొచ్చు.

మీ మూత్రం దుర్వాసన వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి
మీ మూత్రం దుర్వాసన వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి (Shutterstock)

మగవారిలోనైనా, ఆడవారిలోనైనా అప్పుడప్పుడు మూత్ర విసర్జన సమయంలో సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరిలో మూత్రం బాగా దుర్వాసనతో వస్తుంటుంది. ఇది కొంతకాలం వరకే అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, దుర్వాసన అనేది కొనసాగుతూ ఉంటే, అది మరేదైనా వ్యాధులకు సంకేతం కావొచ్చు. శరీరంలో జరిగే మార్పులను ప్రతిబింబించేదిగా ఉంటుంది మూత్రం. రంగులో మార్పు, వాసనలో మార్పు సంభవిస్తుంటాయి. అలాగే శరీరంలో ఏదైనా తీవ్రమైన వ్యాధులు మొదలవుతూ ఉంటే, అవి మూత్రాన్ని దుర్వాసన వచ్చేదిగా మారుస్తాయి. మూత్రం నుండి అసాధారణ వాసన రావడం లేదా దుర్వాసన వస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. అటువంటి పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

yearly horoscope entry point

అసలు మూత్రం దుర్వాసన రావడానికి ఏమేం అంశాలు కారణం కావొచ్చో తెలుసుకుందాం.

కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంకేతం

మూత్రం నుండి అసాధారణ వాసన రావడం అనేది కిడ్నీ సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. శరీరంలో విష పదార్థాల పరిమాణం పెరుగుతుండటం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. దీనిని నిర్లక్ష్యపెడితే కొంతకాలం తర్వాత, ఈ పెరుగుతున్న విష పదార్థాలు కిడ్నీ పనితీరుపై కూడా ప్రభావితం చూపిస్తాయి. కిడ్నీ సమస్య అప్పటికే మొదలై ఉంటే, మీ మూత్రం వాసన వస్తుండటంతో పాటు చర్మం పసుపు రంగులోకి మారడం, వేగంగా బరువు తగ్గడం, దురద, వాపు వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అటువంటి సమయంలో, మీరు ఒకసారి వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి.

డయాబెటిస్ సంకేతం అయుండొచ్చు

డయాబెటిస్ లేదా మధుమేహం వ్యాధి లక్షణాల్లో ఇది కూడా ఒకటి. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రం నుండి చాలా దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా పండు వాసన వస్తే, మీ చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. మన శరీరంలో జరిగే మార్పుల కారణంగా డయాబెటిస్ సమస్య మొదలయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో మనకు మూత్రం ద్వారా చిన్న చిన్న సంకేతాలు అందుతాయి. వీటిని మనం సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ, అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకుని మధుమేహం వస్తుందని పసిగడితే ప్రారంభం స్థాయిలోనే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

మహిళల్లో UTI ప్రమాదం ఉండవచ్చు

UTI అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇది పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇదొక రకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్ కారణంగా కూడా మూత్రం నుండి దుర్వాసన రావచ్చు. బాక్టీరియాలో అమ్మోనియా శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రం నుండి దుర్వాసన వస్తుంది. దీనితో పాటు దురద, మంట లేదా స్వల్పంగా నొప్పి వంటి ఏవైనా ఇతర లక్షణాలు కనిపిస్తూ ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

మహిళల్లో బాక్టీరియల్ వాజినోసిస్ కూడా ఒక కారణమే

బాక్టీరియల్ వాజినోసిస్ అనేది మహిళల యోనిలో కలిగే ఒక ఇన్ఫెక్షన్. దీని వల్ల కూడా మూత్రం నుండి దుర్వాసన రావచ్చు. ఇది సాధారణంగా యోనిలో సహజంగా ఉండే బాక్టీరియా పెరిగినప్పుడు సంభవిస్తుంది. దీనితో పాటు యోనిలో దురద, మంట, మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా ఏదైనా డిశ్చార్జ్ కలుగుతుంటాయి. అటువంటి సమయంలో మీరు కచ్చితంగా ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

లివర్ సంబంధిత సమస్యలు

లివర్‌లో ఏవైనా సమస్యలు ఉంటే, మూత్రం, మలంలో సంకేతాలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మూత్రం నుండి అకస్మాత్తుగా దుర్వాసన రావడం లివర్ సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. ఈ దుర్వాసన మూత్రంలో పెరుగుతున్న విష పదార్థాలను సూచిస్తుంది. లివర్ ఈ విష పదార్థాలను విచ్ఛిన్నం చేయలేనప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. ఈ సమయంలో మూత్రంలో దుర్వాసనతో పాటు దాని రంగులో కూడా మార్పు ఉండవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024