Best Web Hosting Provider In India 2024
Dates Benefits: చలికాలంలో రోజుకు 2 ఖర్జూరాలు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? తెలిస్తే గుర్తుంచుకుని మరీ తింటారు!
Dates Benefits: రుచితో పాటు పోషకాలతో నిండిన ఖర్జూరాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అయితే ఎనర్జీ బూస్టింగ్ ఇచ్చే డ్రై ఫ్రూట్‌ను రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయట. రోజుకు కేవలం రెండంటే రెండు ఖర్జూలను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో చూడండి.
తియ్యటి రుచితో పాటు అద్భుతమైన పొషకాలతో నిండిన అరుదైన డ్రైఫ్రూట్ ఖర్జూరం. అందుకే దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకూ ఇష్టంగా తింటారు. ఈ మధ్య కాలంలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఖర్జూర పండ్లను బాగా వాడుతున్నారు. వీటిని మితంగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. అనేక ప్రయోజనాలున్న ఈ పండును ప్రతి రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో రోజుకు కేవలం రెండంటే రెండు ఖర్జూరాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
శక్తి స్థాయిలను పెంచే పండు
శరీరానికి సహజమైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లు అయిన చక్కెరను అందించడంలో ఖర్జూరాలు బెస్ట్. శీతాకాలంలో వీటిని క్రమం తప్పకుండా రోజుకు రెండు తినడం వల్ల శరీరానికి తక్షణమైన శక్తి అందడంతో పాటు రోజంతా హుషారుగా ఉండేందుకు సహాయపడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచే సాధనం
యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ అధికంగా ఉండే పండు ఖర్జూరం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని రోజూ తినడం వల్ల శరీరానికి కలిగే జలుబు, ఫ్లూ జ్వరాల నుంచి రక్షణగా ఉంటుంది.
గుండె జబ్బులు తగ్గే అవకాశం
ఖర్జూరాల్లో పొటాషియం, మెగ్నీషియంలు అధికంగా ఉంటాయి. వీటిని ప్రతి రోజూ తప్పకుండా తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రత్యేకించి శీతాకాలంలో..
జీర్ణక్రియకు మంచి ఆహారం
ఖర్జూర పండ్లు అరుగుదలకు తోడ్పడే ఫైబర్‌ను అధికంగా కలిగి ఉంటాయి. ఇవి అరుగుదల ప్రక్రియ సాఫీగా జరిగి మలబద్దకం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడతాయి. వీటిని ప్రతి రోజూ రెండు చొప్పున తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగై జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ప్రత్యేకించి చలికాలంలో వీటిని తీసుకోవడం మరిన్ని ఫలితాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎముకల ఆరోగ్యానికి మంచిది
ఖర్జూరంలో మినరల్స్ అయిన కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియంలు అధికంగా ఉంటాయి. ఇంకా ఇవి దృఢమైన ఎముకలకు ప్రోత్సాహం అందించి జాయింట్స్ ను బలంగా ఉంచుతుంది. ప్రత్యేకించి చలికాలంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎముకల్లో ఉన్న సమస్యలకు, ఎముకల నొప్పులు ఉన్నవారు శీతాకాలంలో ఖర్జూరం తప్పక తీసుకోవాలి.
బరువు అదుపులో ఉంచుకోవడానికి
ఖర్జూరాలలో కొవ్వు పదార్థం తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కడుపు నిండినట్లుగా ఉండి పదే పదే ఆకలి వేయదు, అలాగే కొంచెం తినగానే సంతృప్తిగా ఫీలవుతాం. ఈ విధంగా చేయడం వల్ల ఆకలి తక్కువగా కలగడం, ఓవర్ హీట్ కాకుండా ఉంటాయి. ఊబకాయం సమస్య కూడా ఉండదు. అందుకే చలికాలంలో ఖర్జూరం తినడం చాలా మంచి ఛాయీస్.
చర్మారోగ్యానికి కూడా మేలు..
ఖర్జూరాలలో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల చర్మం ఎల్లప్పుడూ మృదువుగా, యవ్వనంగా ఉండడంలో సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం చర్మంలో తేమను నిలుపుకునేందుకు సహాయపడుతుంది. ఫలితంగా చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు చర్మ సంక్రమణలను నివారించడంలో సహాయపడతాయి ఖర్జూరాలలో విటమిన్ B5 (పాంటోతేనిక్ ఆమ్లం) రక్తప్రసరణను మెరుగుపరచి కంటి కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఫ్లవనాయిడ్స్, కారోటీనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని హానికరమైన ఉత్పత్తుల నుండి కాపాడి, శరీరంలో నుండి విషాలను తొలగించడం ద్వారా చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొత్త కణాలను పునరుజ్జీవితం చేసే ప్రక్రియను పెంచుతుంది.