Harish Rao: హాలీవుడ్‌తో పోటీని ఎదుర్కోవాలంటే ఆ టెక్నాలజీ చాలా అవసరం.. మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Harish Rao: హాలీవుడ్‌తో పోటీని ఎదుర్కోవాలంటే ఆ టెక్నాలజీ చాలా అవసరం.. మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jan 11, 2025 11:48 AM IST

Ex Minister Harish Rao About Kalpra VFX And AI Technology: తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్‌తో పోటీ పడుతోందని, హాలీవుడ్‌తో మరింత పోటీని ఎదుర్కొవాలంటే ఇలాంటి టెక్నాలజీ అవసరం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కామెంట్స్ చేశారు.

హాలీవుడ్‌తో పోటీని ఎదుర్కోవాలంటే ఆ టెక్నాలజీ చాలా అవసరం.. మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్
హాలీవుడ్‌తో పోటీని ఎదుర్కోవాలంటే ఆ టెక్నాలజీ చాలా అవసరం.. మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్

Ex Minister Harish Rao Kalpra VFX And AI Technology: సినిమా ఇండస్ట్రీలోకి వీఎఫ్‌ఎక్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఫిల్మ్ మేకర్స్ అంతా టెక్నాలజీని ఉపయోగిస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్‌ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం (జనవరి 10) సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది.

yearly horoscope entry point

మాజీ మంత్రితో ప్రారంభం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, దర్శకులు శ్రీనువైట్ల కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్విసెస్‌ను ప్రారంభించారు. వారితోపాటు కరుణ కుమార్, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన, నటులు విక్రాంత్ రెడ్డి, రఘు కుంచె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు బిడ్డ అమెరికాలో స్థిరపడి

మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ “మన తెలుగు బిడ్డ మల్లీశ్వర్ గారు అమెరికాలో స్థిరపడి ఎంటర్‌‌పెన్యూర్‌‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడి నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు ఇప్పించాలని నేను ఆహ్వానించగానే సిద్ధిపేటలో ఐటీ కంపెనీ పెట్టి ఎంతోమంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ మల్లీశ్వర్ గారిని అభినందించాలి” అని అన్నారు.

పోటీని ఎదుర్కోవాలంటే

“మన తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్‌తో పోటీ పడుతుంది. రాబోయే కాలంలో హాలీవుడ్‌తో మరింత పోటీని ఎదుర్కొవాలంటే.. ఇలాంటి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ చాలా అవసరం. సినిమా బడ్జెట్‌ను తగ్గిస్తూ.. విజువల్ ఎఫెక్ట్స్‌ను పెంచుతూ ప్రేక్షకులు అట్రాక్ట్ చేయాలంటే ఈ టెక్నాలజీ అవసరం ఉంది” అని హరీశ్ రావు తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం

“ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ వెంట పరుగెడుతుంది. అమెరికా నుంచి ఇండియా వచ్చి ఇది స్థాపించిన మల్లీశ్వర్ గారు ఇంకా ఎదగాలని, చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తనవంతు కృషి చేయాలని కోరుతున్నా. ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రానికి ఆస్కార్ వచ్చిందంటే తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వ కారణం. ఇలాంటి టెక్నాలజీని తెలుగు పరిశ్రమకు రావడం అభినందనీయం” అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్వీసెస్ సీఈవో డాక్టర్ మల్లీశ్వర్ మాట్లాడుతూ “ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ వెరీ మచ్. యూఎస్‌లో నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఏఐ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ డెవలెప్ చేశాం. సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాలని అనుకున్నాం. వీఎఫ్‌ఎక్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఇక్కడ బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నాం” అని అన్నారు.

హాలీవుడ్‌లో వాడే టెక్నాలజీ

“హాలీవుడ్‌లో వాడే టెక్నాలజీని ఇక్కడ కూడా పరిచయం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో దర్శకులు రాజమౌళి గారు, నాగ్ అశ్విన్ గారికి తెలుసు. తక్కువ బడ్జెట్‌ సినిమాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడాలని మేం అనుకున్నాం. టాలీవుడ్‌తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమవంతు పాత్ర పోషిస్తాం. నా ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ” అని మల్లీశ్వర్ చెప్పుకొచ్చారు.

“మల్లీశ్వర్ గారు మంచి ఆలోచనతో వీఎఫ్‌ఎక్స్‌తో పాటు ఏఐ బ్రాంచ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ వంతుగా పాలుపంచుకోవడంతో పాటు అనేక మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా” అని డైరెక్టర్ శ్రీనువైట్ల తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024