Best Web Hosting Provider In India 2024
Meta removes tampons: మెటా ఆఫీస్ ల్లో పురుషుల బాత్రూంల నుంచి టంపాన్స్ తొలగింపు; ఇంటర్నెట్ లో చర్చ
Meta removes tampons: అమెరికాలోని మార్క్ జుకర్బర్గ్ కు చెందిన మెటా ఆఫీసుల్లో పురుషుల బాత్రూమ్ లలో నుంచి టంపాన్స్ ను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. ఈ వివాదాస్పద నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు, సమర్ధిస్తూ మరికొందరు పోస్ట్ లు పెడుతున్నారు.
Meta removes tampons: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కొత్త పాలనా యంత్రాంగం ఆశిస్తున్న సంప్రదాయవాద విధానానికి అనుగుణంగా గణనీయమైన విధాన మార్పులను అమలు చేస్తోంది. అందులో భాగంగానే మెటా కార్యాలయాల్లో పురుషుల బాత్రూమ్ లలో నుంచి టంపాన్స్ ను తొలగించాలని నిర్ణయించింది. ఇది మెటా ఇటీవల తీసుకున్న అత్యంత వివాదాస్పదమైన మార్పుల్లో ఒకటిగా మారింది. ఈ చర్య సోషల్ మీడియా (social media) ప్లాట్ఫామ్లలో పెద్ద చర్చకు దారితీసింది.
ట్రంప్ విధాన మార్పుల్లో భాగంగా..
ట్రంప్ (donald trump) అధికారంలోకి వచ్చిన తరువాత, విధాన నిర్ణయాల్లో సంప్రదాయవాద మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ దిశగా ట్రంప్ ఇప్పటికే పలు సంకేతాలు ఇచ్చారు. అందువల్ల, రాబోయే ప్రభుత్వ సంప్రదాయ విధానాలకు అనుగుణంగానే మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్ క్లూజన్ (DEI) కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు మెటా అంతర్గత మెమోలో మెటా మానవ వనరుల వైస్ ప్రెసిడెంట్ జానెల్ గేల్ ప్రకటించారు.
ఏమిటీ టంపాన్స్?
నెలసరి సమయంలో మహిళలు ఉపయోగించే సాధనాల్లో టంపాన్స్ ఒకటి. వీటిని మెటా ఆఫీస్ ల్లో పురుషుల బాత్రూంలలో కూడా అందుబాటులో ఉంటాయి. నాన్ బైనరీ (nonbinary), ట్రాన్స్ జెండర్ (transgender) ఉద్యోగుల కోసం అలా పురుషుల బాత్రూం లలో టంపాన్స్ (tampons) ను అందుబాటులో ఉంచారు. స్త్రీ, పురుష వర్గీకరణకు లోబడి ఉండని వర్గాన్ని నాన్ బైనరీగా వ్యవహరిస్తారు. ఈ వర్గాల కోసం పురుషుల బాత్రూంలలో కూడా టంపాన్స్ ను అందుబాటులో ఉంచారు.
సోషల్ మీడియాలో రచ్చ
పురుషుల బాత్రూమ్ లలో నుంచి గతంలో నాన్ బైనరీ, ట్రాన్స్ జెండర్ ఉద్యోగులకు అందుబాటులో ఉంచిన టంపాన్స్ తొలగించాలన్న మెటా నిర్ణయం ఆన్ లైన్ లో భారీ చర్చకు దారితీసింది. ఎక్స్ లోని చాలా మంది యూజర్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, విమర్శలు చేశారు. మరికొందరు ఈ నిర్ణయాన్ని ఎగతాళి చేస్తూ, కామెంట్స్ పెట్టారు. ‘‘మెటా ఇప్పుడు తన అసలు రంగును చూపిస్తోంది’’ అని ఒక యూజర్ ఎద్దేవా చేశారు. ‘మెటా కార్యాలయాల నుండి సహానుభూతిని అనేది పూర్తిగా నిషేధించడమే ఇక మిగిలింది’ అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు, కొంతమంది వినియోగదారులు ఈ చర్యను సమర్థించారు. ఇది “కామన్ సెన్స్ విధానాలను” ప్రతిబింబిస్తుందని, సంప్రదాయ విలువలకు అనుగుణంగా ఉందని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.
మెటాలో విస్తృత విధాన మార్పులు
ఈ నిర్ణయం మెటాలో జరుగుతున్న విస్తృత మార్పుల్లో భాగంగా ఉంది. ఇప్పటికే మెటా ప్లాట్ ఫామ్స్ నుంచి ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రామ్ రద్దు కూడా ఉంది. ఎక్స్ ఉపయోగించిన నమూనా నుండి ప్రేరణ పొందిన కమ్యూనిటీ నోట్ వ్యవస్థతో ఫ్యాక్ట్ చెకింగ్ భర్తీ చేయబడుతుందని సిఇఒ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. “ఫ్యాక్ట్ చెకర్లు చాలా రాజకీయ పక్షపాతంతో ఉన్నారు మరియు వారు సృష్టించిన దానికంటే ఎక్కువ నమ్మకాన్ని నాశనం చేశారు” అని జుకర్ బర్గ్ వాదించారు.
Best Web Hosting Provider In India 2024
Source link