Best Web Hosting Provider In India 2024
The Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వాయిదా ఖాయమేనా.. ఆ స్థానంలో మరో భారీ మూవీ రిలీజ్?
The Raja Saab Release: ది రాజా సాబ్ చిత్రం రిలీజ్ ఆలస్యం కానుందంటూ సమాచారం బయటికి వస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రకటించిన తేదీకి రాదనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ తేదీన వచ్చేందుకు మరో చిత్రం కూడా రెడీగా ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ కోసం అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ రోల్ చేస్తున్నారని, వింటేజ్ డార్లింగ్‍ను ఈ చిత్రంలో చూస్తారనే అంచనాలు ఇప్పటికే ఏర్పడ్డాయి. ప్రభాస్ తొలిసారి హారర్ జానర్ చేస్తున్నారు. దీంతో ది రాజా సాబ్ మూవీపై హైప్ మరింత ఎక్కువగా ఉంది. అయితే, ముందు ప్రకటించిన తేదీ నుంచి ఈ చిత్రం వాయిదా పడనుందంటూ తాజాగా రూమర్లు బయటికి వచ్చాయి.
వాయిదా పడనుందా?
ది రాజా సాబ్ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ గతంలోనే చెప్పింది. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ వేగంగా సాగింది. అయితే, ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడడం ఖాయం అంటూ తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం ఆలస్యం కానుందనే రూమర్లు విపరీతంగా వస్తున్నాయి.
సంక్రాంతి పండుగ రోజున ది రాజా సాబ్ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. దాంట్లో రిలీజ్ డేట్ విషయంపై క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ చిత్రం వాయిదా పడిన విషయాన్ని ఆ పోస్టర్లో టీమ్ వెల్లడిస్తుందనే అంచనాలు వినిపిస్తున్నారు. ఈ చిత్రం వాయిదా పడితే ప్రభాస్ అభిమానులకు భారీ నిరాశ ఎదురవుతుంది.
విశ్వంభర రెడీ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర చిత్రం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఆయన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రావడంతో విశ్వంభరను చిరూ వాయిదా వేసుకున్నారు. సరైన డేట్ కోసం వేచిచూస్తున్నారు. ఒకవేళ ది రాజా సాబ్ మూవీ వాయిదా పడితే.. ఏప్రిల్ 10న విశ్వంభరను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేశారనే సమాచారం బయటికి వచ్చింది. ఈ భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10వ తేదీని ఫిక్స్ చేసుకుంది. తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ కూడా అదే రోజు రేసులో నిలిచింది. ధనుష్ మూవీ ఇడ్లీ కడాయ్ కూడా ఆ తేదీనే రానుందని ప్రకటన వచ్చింది. మొత్తంగా ఏప్రిల్ 10న ఏ చిత్రాలు రిలీజ్ అవుతాయోననే ఆసక్తి నెలకొంది.
సంబంధిత కథనం