Best Web Hosting Provider In India 2024
Bad Cholesterol Signs: జాగ్రత్త! మీ గోళ్ళపై కనిపించే ఈ లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు కావచ్చు!
Bad Cholesterol Signs: అధిక కొలెస్ట్రాల్ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ముందే గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది గుండె నొప్పి, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో వచ్చే కొన్ని మార్పుల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా గోళ్లలో కనిపించే ఈ లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ సంకేతాలని తెలుసుకోండి.
అధిక కొలెస్ట్రాల్ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య ఇది తెలియకుండానే శరీరంలోని రక్తనాళాలలో పేరుకుపోయి గుండె నొప్పి లేదా స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. దీన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణానికి ముప్పు రావచ్చు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. శరీరంలో వచ్చే కొన్ని మార్పుల ద్వారా మనం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తించవచ్చు. ముఖ్యంగా చేతి గోళ్లు, కాళ్ల గోళ్ల ద్వారా మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిందని పసిగట్టచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాణాపాయాన్ని తగ్గించుకోవచ్చు.
కొలెస్ట్రాల్ అంటే ఏంటి?
కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు. మన శరీరానికి ఆరోగ్యకరమైన కణాలు తయారు చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. అయితే ఇది అధిక మొత్తంలో ఉంటే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి అనేక గుండె సమస్యలకు దారితీయవచ్చు.చెడు కొలెస్ట్రాల్ అంతా రక్తనాళాలలో చేరి ప్లాక్‌లను ఏర్పరుస్తుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకాలు కలిగిస్తుంది.ఈ పరిస్థితి గుండెపోటు లేదా స్ట్రోక్ లాంటి ప్రాణాంతమైన సమస్యలను తెచ్చిపెడుతుంది.
అధిక కొలెస్ట్రాల్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
సాధారణంగా అధిక కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఎలాంటి ప్రత్యక్ష లక్షణాలను చూపించదు. నిశ్వబ్దంగా శరీరంలోని రక్తనాళాల్లో పేరుకుపోతుంది. ఇది తీవ్రమవుతున్నప్పుడు కొన్ని చర్మంపై, గోళ్ళపై కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. వీటిని మీరు గమనించారంటే అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారని తెలుసుకోవచ్చు. ఫలితంగా దీర్ఘకాలిక గుండె సమస్యలను అరికట్టవచ్చు. గోళ్లపై కనిపించే ఈ లక్షణలు మీ శరీరంలో హానికరమైన కొవ్వులు పెరిగిపోయాయి అనడానికి సంకేతాలు కావచ్చు. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడండి.
గోళ్లపై కనిపించే అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ఏంటి?
1. గోళ్లపై పసుపు మచ్చలు(xanthomas):
అధిక కొలెస్ట్రాల్‌ను సూచించే ముఖ్యమైన లక్షణం గోళ్లపై పసుపు మచ్చలు. వీటినే జాంటోమాస్ అని పిలుస్తారు. ఇవి మీ చర్మంలో, ముఖ్యంగా గోళ్లపై ఏర్పడతాయి.శరీరంలో హానికరమైన కొవ్వులు అధికమైనప్పుడు, ఇలా పసుపు మచ్చలు ఏర్పడతాయి. రక్త ప్రసరణ గోళ్ళకు చేరకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇవి చర్మంలోని కణాలలో ఏర్పడతాయి. ఇది సాధారణంగా అధిక LDL కొలెస్ట్రాల్ ఉన్నవారిలో కనిపిస్తుంది. ఈ పసుపు మచ్చలు గోళ్ళపై, మోచేతులు, గోళ్ళ మధ్య ,కొంతమంది దగ్గర ఎడమ లేదా కుడి కాళ్లపై కూడా కనిపిస్తాయి.
2. గోళ్ళలో రంగు మార్పు
అధిక కొలెస్ట్రాల్ ,దాని కారణంగా సంభవించే రక్తప్రసరణ కారణంగా గోళ్ళ రంగు మారుతుంది. గోళ్లకు రక్తప్రసరణ సరిగ్గా అందకపోవడం, తక్కువ సరఫరా అవడం వల్ల గోళ్లు పసుపు, నీలం రంగులోకి మారతాయి.ఇలా గోళ్ల రంగు మారడం ఇతర రక్తనాళాల సమస్యలకు కూడా సంకేతాలు కావచ్చు. కనుక ఈ పరిస్థికి కారణాలు గుర్తించి అదుపు చేసుకోవడం అత్యవసరంగా అవసరం.
3. గోళ్ళలో నొప్పి, మంట :
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. రక్తప్రసరణ తక్కువవుతుంటే గోళ్ళలో జబ్బు, నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా నడిచే సమయంలో గోళ్లలో మంట, నొప్పి వంటివి ఇంటర్వెల్ క్లాడికేషన్ అనే పరిస్థితికి దారితీస్తుంది.
4. గోళ్ళు చల్లబడటం:
అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్తప్రసరణ సమస్యలు ఏర్పడతాయి. ఇది పాదాల లేదా చేతి గోళ్ళను చల్లగా లేదా నిస్సహాయంగా మార్చుతుంది.ధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్తనాళాలలో అవరోధాలు ఏర్పడినప్పుడు సాధారణంగా కనిపిస్తుంది. రక్త ప్రవాహం దాదాపు నిలిచిపోతుంది అన్నప్పుడే గోళ్లు చల్లగా, నిర్జీవంగా మారతాయి.
4. గోళ్ళపై ముదురు గీతలు:
ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ గోళ్ళ కింద ముదురు గీతలు చెడు కొలెస్ట్రాల్ కి సంకేతం కావచ్చు. దీనిని స్ప్లింటర్ హెమరేజ్ అంటారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం, గోళ్ళపై ఈ గుర్తులు గుండె జబ్బుల ప్రమాదాన్ని సూచిస్తాయి.
5. ఎరుపు లేదా గోధుమ రంగు గీతలు:
కాళ్ళు, చేతుల గోళ్ళపై కనిపించే గుర్తులను స్ప్లింటర్స్ అంటారు. ఈ గుర్తులకు రావడానికి కారణం దెబ్బతిన్న చిన్న రక్తనాళాలు కావొచ్చు. వీటి వల్ల చిన్న రక్తపు మరకలు కూడా కనిపిస్తాయి. ఇవి గోళ్ళపై తరచూ కనిపిస్తుంటాయి. ఈ నాళాలు దెబ్బతినడానికి కారణం రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటమే.
6. పొడవైన గీతలు కనిపించడం:
గోళ్ళ మీద పొడవైన గీతలు కనిపించడం కూడా చెడు కొలెస్ట్రాల్ లక్షణంగానే పరిగణించాలి. దీనివల్ల గోళ్ళు సరిగ్గా పెరగవు మరియు వంకరగా పెరుగుతాయి. ముఖ్యంగా కాలి బొటనవేలు గోళ్ళు వంకరగా పెరగడం PAD వ్యాధి వల్ల జరుగుతుంది. దీనిలో చెడు కొలెస్ట్రాల్ వల్ల కాళ్ళకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు మరియు గోళ్ళ పెరుగుదల నెమ్మదిస్తుంది.