Best Web Hosting Provider In India 2024
Rana Naidu 2 OTT: ఓటీటీలోకి రానా నాయుడు 2.. స్ట్రీమింగ్ ఎప్పుడో చెప్పేసిన హీరో వెంకటేష్
Venkatesh About Rana Naidu 2 OTT Streaming: ఓటీటీలోకి రానా నాయుడు 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడో తాజాగా హీరో వెంకటేష్ చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో రానా నాయుడు సీజన్ 2పై క్లారిటీ ఇచ్చారు. మరి ఆ విశేషాల్లోకి వెళితే..!
Venkatesh About Rana Naidu 2 OTT Release: విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో జోరుగా సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్టరీ వెంకటేష్ పాల్గొని సినీ విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే బోల్డ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2 ఓటీటీ రిలీజ్ గురించి ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చారు హీరో వెంకటేష్.
సంక్రాంతికి వస్తున్నాం కోసం ఎంత ఎగ్జయిటెడ్‌గా ఉన్నారు?
-నా కెరీర్ ఇది మరో సంక్రాంతి. ఒక క్లీన్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌తో రావడం చాలా ఆనందంగా ఉంది. లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా ఉంది. సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అంతా పాజిటివ్‌గా ఉంది. నా కెరీర్‌లో సంక్రాంతికి వచ్చిన మోస్ట్ ఫిలిమ్స్ చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం ఉంది.
ఈసారి ప్రమోషన్స్ చాలా ఎనర్జిటిక్‌గా చేయడానికి కారణం?
-ఇది నేచురల్‌గా జరిగింది. మ్యూజిక్ చాలా నచ్చింది. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. కొన్ని మ్యూజిక్ ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లవ్లీ టీం కుదిరింది. ప్రమోషన్స్‌లో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. ప్రమోషన్స్‌ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉంది.
మీతో సాంగ్ పాడించాలనే ఆలోచన ఎవరిది ?
-నైట్ రెండు గంటలకి ఆ సాంగ్ విన్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. ఏదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్‌లో ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే ఉంది. ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది (నవ్వుతూ).
-ఇందులో రమణ గోగుల గారు పాడిన పాట పెద్ద హిట్ అయింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాడారు. పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.
ఈ సినిమా గురించి ఆడియన్స్‌కి ఏం చెబుతారు?
-వెరీ నైస్ ఫెస్టివల్ ఫిల్మ్‌తో వస్తున్నాం. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. క్లైమాక్స్ చాలా సర్‌ప్రైజ్ చేస్తుంది. పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు.
రానా నాయుడు 2 ఎప్పుడు?
-మార్చిలో రావచ్చు. డబ్బింగ్ అయింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఇలా రానా నాయుడు 2 ఓటీటీ రిలీజ్ మార్చిలో ఉండే అవకాశం ఉందని వెంకటేష్ క్లారిటీ ఇచ్చారు. దగ్గుబాటి రానా, వెంకటేష్ తండ్రి కొడుకులుగా నటించిన బోల్డ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు రానా నాయుడు 2 కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
సంబంధిత కథనం