Best Web Hosting Provider In India 2024
TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులా..? అయితే ఈ 8 విషయాలు తెలుసుకోండి
TG Indiramma Housing Scheme Website : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియను సర్కార్ వేగవంతం చేసింది. ఈనెలాఖారులోగా ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఏమైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరించేందుకు ఇటీవలే వెబ్ సైట్ ను కూడా తీసుకొచ్చింది. అయితే ఫిర్యాదు ప్రక్రియ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి..
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల్లో 95 శాతానికి పైగా సర్వే పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండగలోపే మొత్తం సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి అధికారులకు కూడా ఆదేశాలు అందినట్లు తెలిసింది.
ఇక ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో అవినీతికి అవకాశం ఇవ్వొద్దని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన వారికే ఇవ్వాలని నిర్ణయించింది. పారదర్శకతకు పెద్దపీఠ వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే… తాజాగా వెబ్ సైట్ ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ వెబ్ సైట్ కు సంబంధించిన ముఖ్య విషయాలు ఇక్కడ తెలుసుకోండి…
ఇందిరమ్మ ఇళ్ల వెబ్ సైట్ – ముఖ్యమైన అంశాలు:
- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. దరఖాస్తుదారుడికి ఏమైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేసుకునే వీలు ఉంటుంది.
- ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ http://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
- హోం పేజీలో Grievance Entry ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఫిర్యాదు ప్రక్రియపై ముందుకెళ్లవచ్చు.
- ఫిర్యాదు లేదా సమస్య వివరాల తర్వాత.. Grievance Id జనరేట్ అవుతోంది.
- ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది.
- గ్రామాల్లో ఎంపీడీవో ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేరుతుంది.
- ఇక పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేరుతుంది.
- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కు సంబంధించి ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా తీసుకువచ్చింది. 040-29390057 నెంబర్ కు కాల్ చేసి సేవలు పొందవచ్చు.
ఇక గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికను జోడించి… లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా సర్వే చేయిస్తోంది.
గ్రామ సభ ఆమోదం తర్వాతనే… ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు.ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేయనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్