Best Web Hosting Provider In India 2024
Daaku Maharaj OTT: బాలకృష్ణ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’కు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే!
Daaku Maharaj OTT: డాకు మహారాజ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. దీంతో ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ వివరాలు బయటికి వచ్చాయి. ప్లాట్‍ఫామ్ ఏదో వెల్లడైంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రంపై చాలా బజ్ నెలకొంది. ట్రైలర్ తర్వాత ఈ యాక్షన్ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ క్రేజ్ మధ్య ఈ చిత్రం నేడు (జనవరి 12) థియేటర్లలో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య యాక్షన్ సీన్లు అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, డాకు మహారాజ్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఏదో వెల్లడైంది.
ఓటీటీ వివరాలివే..
డాకు మహారాజ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందనే సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం నేడు రిలీజ్ కావడంతో ఈ సమాచారం వెల్లడైంది. థియేట్రికల్ రన్ తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.
ఈ చిత్రం ఫిబ్రవరి రెండు లేకపోతే మూడో వారంలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టవచ్చు. అయితే, థియేట్రికల్ రన్‍పై స్ట్రీమింగ్ డేట్ ఆధారపడి ఉంటుంది. డాకు మహారాజ్ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ద్వారా మంచి ధర దక్కినట్టు తెలుస్తోంది.
స్టైలిష్ యాక్షన్
డాకు మహారాజ్ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సుల్లో బాలకృష్ణ దుమ్మురేపేశారని, స్టైలిష్‍గా ఉందంటూ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలోని విజువల్స్ గురించి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ రిచ్‍గా కనిపిస్తోందంటూ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్‍పాండే, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రలు పోషించారు.
డాకు మహారాజ్ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో హైలైట్‍గా నిలిచింది. మరోసారి బాలయ్యకు దుమ్మురేపే బీజీఎంతో మోతెక్కించారు. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రపీ కూడా ప్రశంసలు దక్కించుకుటోంది. యాక్షన్ సీన్లలోనూ విజువల్స్ రిచ్‍గా ఉండేలా చూపించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. కథ కొత్తగా అనిపించకపోయినా.. ఈ మూవీని మెప్పించేలా దర్శకుడు బాబీ తెరకెక్కించారని, బాలయ్యను అద్బుతంగా చూపించారంటూ కామెంట్లు వస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ టాక్ ఉంది. దీంతో సంక్రాంతి రేసులో ఉన్న డాకు మహారాజ్ మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
డాకు మహారాజ్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. ఈ చిత్రంపై మొదటి నుంచి నాగవంశీ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకు తగ్గట్టే రెస్పాన్స్ కూడా వస్తోంది.
సంబంధిత కథనం