Best Web Hosting Provider In India 2024
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు 2 రోజుల ముందే గుడ్ న్యూస్.. థియేటర్లలోకి 25 కోట్ల సాంగ్ వచ్చేసింది!
Game Changer Naanaa Hyraanaa Song Adding In Theaters: రామ్ చరణ్ అభిమానులకు గేమ్ ఛేంజర్ సినిమా టీమ్ గుడ్ న్యూస్ తెలిపింది. థియేటర్లలో గేమ్ ఛేంజర్ మూవీలోని రూ. 25 కోట్ల నాననా హైరానా సాంగ్‌ను ప్రదర్శించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Game Changer Naanaa Hyraanaa Song Adding In Theaters: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రిలీజ్ విజయవంతంగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.
నిరాశకు గురైన ఫ్యాన్స్
తొలిరోజున వరల్డ్ వైడ్‌గా ‘గేమ్ ఛేంజర్’ చిత్రం రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, గేమ్ ఛేంజర్ రిలీజ్ మొదటి రోజు మూవీలోని ‘నా నా హైరానా’ పాట కనిపించకపోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. విడుదలకు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఆ సాంగ్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
థియేటర్లలో నానా హైరానా సాంగ్
అయితే, పలు సాంకేతిక కారణాల వల్లే ‘నా నా హైరానా’ పాటను జోడించలేకపోయాని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. కానీ, తాజాగా ఈ పాట విషయంలో రామ్ చరణ్ అభిమానలకు గేమ్ ఛేంజర్ టీమ్ గుడ్ న్యూస్ తెలిపింది. నేటి (జనవరి 12) నుంచి ఈ పాటను థియేటర్లో చూడొచ్చు. గేమ్ ఛేంజర్ సినిమాలో నానా హైరానా పాటను యాడ్ చేసినట్టుగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది.
రెండు రోజుల ముందుగానే
అయితే, జనవరి 14 నుంచి ఈ సాంగ్‌ను థియేటర్లలో యాడ్ చేస్తామని ముందుగా ప్రకటించారు. కానీ, దానికంటే రెండు రోజుల ముందుగానే నానా హైరానా పాటను యాడ్ చేశారు. అంటే, రెండు రోజుల ముందుగానే చెర్రీ అభిమానలకు గుడ్ న్యూస్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, గేమ్ ఛేంజర్ సినిమాలోని నాలుగు పాటలకే దాదాపుగా రూ. 75 కోట్ల వరకు ఖర్చు అయిందని జోరుగా వార్తలు వినిపించాయి.
25 కోట్ల ఖర్చు
వాటిలో నానా హైరానా పాటకు రూ. 25 కోట్లు ఖర్చు చేశారని టాక్. అందుకే అన్ని కోట్లు పెట్టిన తీసిన పాటను సినిమాలో ఎందుకు చూపించలేదని అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ సాంగ్‌ను యాడ్ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐ ఫీస్ట్ ఇచ్చే పాట
ఇన్ ఫ్రా రెడ్ కెమెరాతో చిత్రీకరించిన నానా హైరానా పాట ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండనుందని తెలుస్తోంది. కాగా, రామ్ చరణ్ రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో ఒదిగిపోయి ఓ వైపు స్టైలిష్‌గా, మరో వైపు పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారని రివ్యూలు వస్తున్నాయి. రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు, చరణ్-ఎస్.జె.సూర్య మధ్య ఉండే ఎగ్జయిటింగ్ సన్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారని చెబుతున్నారు.
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
అలాగే, రామ్ చరణ్-కియారా అద్వానీ కెమిస్ట్రీ, అంజలి అద్భుతమైన నటనకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్ అయిన శంకర్ తనదైన పంథాలో గేమ్ ఛేంజర్ సినిమాను వావ్ అనిపించే రీతిలో వండర్ మూవీగా ఆవిష్కరించారని అంటున్నారు.
ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్
ఇక గేమ్ ఛేంజర్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, తిరు ఎక్స్‌ట్రార్డినరీ విజువలైజేషన్ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.
సంబంధిత కథనం