Best Web Hosting Provider In India 2024
OTT: రూ.40కోట్ల బడ్జెట్.. రూ.2కోట్లలోపు కలెక్షన్లు.. ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ మూవీ
OTT Movie: ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రం ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికి రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్న మూవీ పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్ కూడా ఖరారైంది.
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వ్యక్తి పాత్రను ఆయన పోషించారు. ఈ మూవీకి సూజిత్ సిర్సార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గతేడాది నవంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ ఎమోషనల్ డ్రామా మూవీకి పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. డిజాస్టర్‌గా నిలిచింది. ఐ వాంట్ టు టాక్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ?
ఐ వాంట్ టు టాక్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధమవుతోంది. జనవరి 17వ తేదీన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంట్ లేకుండా అందుబాటులోకి రానుంది. దీంతో ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు.
నిజ జీవితం ఆధారంగా..
ఐ వాంట్ టు టాక్ చిత్రంలో అభిషేక్ బచ్చన్‍తో పాటు అహియా బమ్రూ లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రంలో జానీ లివర్, పర్ల్ డే, జయంత్ కృప్లానీ, క్రిస్టిన్ గోడార్డ్, సాయివిష్ణు దూశెట్టి, స్మిత్ పటేల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను డైరెక్టర్ సూజిత్ తెరకెక్కించారు. క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేసిన అర్జున్ సేన్ అనే వ్యక్తి నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అర్జున్ పాత్రను అభిషేక్ పోషించారు. చిన్నతనం నుంచి కూతురితో సరైన రిలేషన్ లేని తండ్రికి క్యాన్సర్ రావడం, అతడు 100 రోజులే జీవిస్తాడని తెలియడం, ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిస్థితుల చుట్టూ ఈ మూవీ ఎమోషనల్‍గా సాగుతుంది.
బాక్సాఫీస్ డిజాస్టర్
ఐ వాంట్ టు టాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు మొత్తంగా సుమారు రూ.40కోట్ల బడ్జెట్ అయినట్టు అంచనా. ఈ చిత్రం రూ.2కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ సినిమా ఫుల్ రన్‍లో కేవలం రూ.1.25కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్టు అంచనా. ఈ చిత్రం కమర్షియల్‍గా అల్ట్రా డిజాస్టర్ అయింది. అభిషేక్ బచ్చన్‍కు మరో ప్లాఫ్ పడింది. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు వచ్చినా.. కలెక్షన్లు మాత్రం రాలేదు.
ఐ వాంట్ టు టాక్ చిత్రాన్ని రైజింగ్ సన్ ఫిల్మ్స్, కినో వర్క్స్ బ్యానర్లపై శీల్ కుమార్, రోనీ లహరి, కుమార్ ఠాకూర్, కరణ్ వాద్వా ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి జార్జ్ జోసెఫ్, తబా చాకే మ్యూజిక్ అందించారు.
సంబంధిత కథనం