Rangoli Tips: ఎంత పెద్ద ముగ్గుకైనా పది నిమిషాల్లో రంగులు నింపే చిట్కాలు మీకు తెలుసా? ఇవిగో ఇక్కడ చాలా ఉన్నాయి

Best Web Hosting Provider In India 2024

Rangoli Tips: ఎంత పెద్ద ముగ్గుకైనా పది నిమిషాల్లో రంగులు నింపే చిట్కాలు మీకు తెలుసా? ఇవిగో ఇక్కడ చాలా ఉన్నాయి

Ramya Sri Marka HT Telugu
Jan 12, 2025 06:33 PM IST

Rangoli Tips: భోగి, సంక్రాంతి పండుగల్లో ఇంటి ముందు పెద్ద ముగ్గు వేయాలని ఉన్నా రంగులు నింపేందుకు ఎక్కువ సమయం పడుతుందని భయపడుతున్నారా? ఈజీగా రంగులు నింపే ట్రిక్స్ ఏమైనా ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే. ఈ చిట్కాలు పాటించారంటే ఎంత పెద్ద ముగ్గు పది నిమిషాల్లో రంగులతో ముస్తాబు అవుతుంది.

ఎంత పెద్ద ముగ్గుకైనా పది నిమిషాల్లో రంగులు నింపే చిట్కాలు
ఎంత పెద్ద ముగ్గుకైనా పది నిమిషాల్లో రంగులు నింపే చిట్కాలు

భోగి, సంక్రాంతి పండుగల్లో ఇంటి ముందు పెద్ద ముగ్గు వేయాలని, దాన్ని గొబ్బెమ్మలతో అందంగా అలంకరించాలనీ అందరికీ ఉంటుంది. కానీ ఇదంతా ఈజీగా అయ్యే పని కాదు కదా.గంటల తరబడీ సమయం కేటాయిస్తే గానీ ముగ్గు వేయడం దాంట్లో నిండుగా రంగులు నింపడం పూర్తవదు.ఈ విషయం చాలా మందిని నిరాశ పరుస్తుంది. ఎంత పెద్ద ముగ్గు అయినా పది నిమిషాల్లో రంగులు నింపే ట్రిక్స్ ఉంటే బాగుండు అని మీకు అనిపిస్తే ఇది మీ కోసమే. ఈ చిట్కాలను పాటించారంటే పండక్కి ఇంటి ముందు మీరు ఎంత పెద్ద ముగ్గు వేసినా పది నిమిషాల్లో రంగులు నింపేయచ్చు. ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం.

yearly horoscope entry point

ప్లాస్టిక్ కప్ సహాయంతో:

టీ తాగేందుకు ఉపయెగించే ప్లాస్టిక్ పేపర్ కప్పులతో త్వరగా, ఈజీగా రంగులు నింపచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా..

  • ప్లాస్టిక్ టీ కప్పు తీసుకుని దాని అడుగు భాగానికి సూది లేదా పిన్నీస్‌తో చిన్న చిన్న రంథ్రాలు చేసుకొండి.
  • ముగ్గు వేసిన తర్వాత ఈ కప్పులో రంగులు నింపుకుని ముగ్గులో వేశారంటే పది నిమిషాల్లో మీ ముగ్గు రంగుల మయం అవుతుంది.
  • మరొక విధానంలో కూడా వీటిని ఉపయోగించవచ్చు.
  • ఇందుకోసం రెండు టీ కప్పులను తీసుకుని వాటికి అడుగు భాగాలను కత్తిరించేయాలి. ఇప్పుడు ఒక కప్పు అడుగు భాగానికి నెట్ క్లాత్ పెట్టి దాన్ని మరో కప్పులో పెట్టాలి.
  • అంతే ఇప్పుడు కప్పులో రంగులు నింపుకుని ముగ్గు మీద చల్లారంటే మీ ముగ్గు తర్వగా, నీట్ గా పూర్తవుతుంది.

వాటర్ బాటిల్ సహాయంతో:

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తో కూడా సులువుగా, త్వరగా ముగ్గుకు రంగులు నింపచ్చు. దీని కోసం

  • ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాన్ని సగానికి కట్ చేసుకోండి. తరువాత బాటిల్ మూత తీసేసి దాని స్థానంలో నెట్ క్లాత్ (దోమ తెర, జాలీ వంటి) పెట్టండి. నెట్ క్లాత్ ఊడిపోకుండా ఉండేందుకు ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి.
  • ముగ్గు వేసిన తర్వాత బాటిల్లో రంగును నింపి ముగ్గు మీద చల్లారంటే ఈజీగా, త్వరగా ముగ్గులో రంగులను నింపేయచ్చు.
  • వాటర్ బాటిల్ మూతకు రంథ్రాలు చేసి కూడా ముగ్గులో రంగులను నింపవచ్చు.
  • బాటిల్ మూతకు ఒకే రంథ్రం చేసుకుంటే ముగ్గు వేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.

జల్లెడ సహాయంతో:

మీ ఇంట్లో ఉండే టీ జల్లెడ, పిండి జల్లెడ సహాయంతో కూడా చేతికి రంగులు అంటుకోకుండా, సమయం వృథా అవకుండా రంగులను నింపేయచ్చు.వీటిని ఉపయోగించడం వల్ల ఎంత పెద్ద ముగ్గుకైనా త్వరగా రంగులు వేయచ్చు.

  • వీటిలో రంగులు నింపుకుని ముగ్గు మీద చల్లారంటే ఎంత పెద్ద ముగ్గు అయినా త్వరగా ఫీనిష్ అవుతుంది.
  • చిన్న చిన్న డిజైన్లకు టీ జల్లెడను , పెద్ద పెద్ద డిజైన్లు, పువ్వులకు పిండి జల్లెడను ఉపయెగించవచ్చు.

పౌడర్ డబ్బా సహాయంతో:

మీ ఇంట్లో పౌడర్ డబ్బా సహాయంతో కూడా ముగ్గులో రంగులను ఈజీగా నింపచ్చు.

పౌడర్ డబ్బాకు ముందుగానే రంథ్రాలు ఉంటాయి. అయినప్పటికీ మీరు మూతకుమరికొన్ని రంథ్రాలు చేసుకుని దాని నిండా ముగ్గు నింపుకున్నారంటే ఈజీగా, త్వరగా ముగ్గంతా రంగులు వేసేయచ్చు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024