Best Web Hosting Provider In India 2024
Anshu: మన్మథుడు హీరోయిన్ అన్షుపై డైరెక్టర్ అసభ్యకరమైన కామెంట్లు.. శరీరాకృతి గురించి వ్యాఖ్యలు
Nakkina Trinadha Rao – Anshu: నటి అన్షు గురించి దర్శకుడు త్రినాథ రావు అభ్యంతరకరమైన కామెంట్లు చేశారు. మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‍లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
మన్మథుడు (2002) సినిమాలో కింగ్ నాగార్జున సరసన హీరోయిన్‍గా నటించిన అన్షు చాలా పాపులర్ అయ్యారు. తొలి సినిమాతోనే సక్సెస్ చూశారు. ఆ తర్వాత మరో మూడు చిత్రాల్లోనే కనిపించి.. సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. సుమారు 20ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ సినీ ఇండస్ట్రీకి తిరిగి వచ్చేశారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నారు. మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు (జనవరి 12) జరిగింది. అయితే, ఈ ఈవెంట్‍లో అన్షుపై అభ్యంతరకరమైన కామెంట్లు చేశారు త్రినాథ రావు.
శరీరాకృతిపై అసభ్య వ్యాఖ్యలు
మన్మధుడు చిత్రాన్ని అన్షు కోసమే తాము చాలాసార్లు చూశామని నక్కిన త్రినాథరావు అన్నారు. అప్పుడు బొద్దుగా ఉండేవారని, ఇప్పుడు సన్నబడ్డారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడూ అలాగే ఉందా అని అక్కడి వారిని అడిగారు. ఈ క్రమంలోనే అన్షు శరీరాకృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. “కొంచెం సన్నబడింది. నేనే తిని పెంచమ్మా.. తెలుగుకు సరిపోదు. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైమ్‍కు ఇంకా ఇంప్రూవ్ అవుంది” అంటూ అన్షు శరీరాకృతిపై కామెంట్లు చేశారు త్రినాథరావు.
గతంలో చౌర్య పాఠం సినిమా ఈవెంట్‍లోనూ తనకు హగ్ ఇవ్వాలంటూ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణను నక్కిన త్రినాథరావు పదేపదే అడిగారు. దీంతో పాయల్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఆయన చాలాసేపు అలాగే మాట్లాడారు. ఇప్పుడు అన్షుపై ఇలా అభ్యంతరకంగా కామెంట్లు చేశారు త్రినాథరావు. దీంతో ఆయనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. త్రినాథరావు మాటలు అసభ్యంగా ఉన్నాయని, అన్షుకు సారీ చెప్పాలని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థమవుతోందా.. చెత్త మాటలు అంటూ మరికొందరు ఆగ్రహిస్తున్నారు.
అల్లు అర్జున్‍ను ఇమిటేట్ చేస్తూ..
ఐకాన్ అల్లు అర్జున్‍ను కూడా నక్కిన త్రినాథరావు ఇదే ఈవెంట్‍లో ఇమిటేట్ చేశారు. పుష్ప 2 ఈవెంట్‍లో తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ పేరు చెప్పేందుకు తడబడి అల్లు అర్జున్ నీరు తాగారు. దాన్ని ఇమిటేట్ చేశారు త్రినాథరావు. హీరోయిన్ రితూ వర్మ పేరు మరిచిపోయినట్టుగా యాక్టింగ్ చేసి.. నీళ్లు కావాలని అడిగారు. దీనిపై కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు త్రినాథరావుకు ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మజాకా సినిమా గురించి..
మజాకా సినిమాలో సందీప్ కిషన్‍కు జోడీగా రితూ వర్మ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అన్షు, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తండ్రీకొడుకుల లవ్ స్టోరీల చుట్టూ కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ త్రినాథరావు. టీజర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది.
మజాకా మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‍ప్లే, మాటలను ప్రసన్న కుమార్ బెజవాడ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేశ్ దండా, ఉమేశ్ కేఆర్ భన్సాల్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు టీజర్లో మేకర్స్ వెల్లడించారు.
సంబంధిత కథనం