Best Web Hosting Provider In India 2024
Minister Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్పిన పెను ప్రమాదం
Minister Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా ఆయన కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది.
Minister Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒకేసారి రెండు టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో కారును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం ఎస్కార్ట్ కారులో మంత్రి పొంగులేటి ఖమ్మం చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రి పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.
అంతకు ముందు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో కలసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై మంత్రి పొంగులేటి కలెక్టర్ల కార్యాచరణ, సమన్వయ సమావేశం నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై గ్రామ, వార్డు సభలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అధికారుల బృందాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, కార్యాచరణకు సంబంధించిన వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమావేశం మంత్రులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26వ తేదీన ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తుంది.
టాపిక్