Best Web Hosting Provider In India 2024
Bhogi Wishes 2025: మీ బంధుమిత్రులకు భోగీ పండుగ శుభాకాంక్షలు ఇలా తెలుగులో చెప్పేయండి
Bhogi Wishe 2025: భారతదేశంలో వివిధ పేర్లతో జరుపుకునే మకర సంక్రాంతి నాలుగు రోజుల పండుగ (భోగి, కోలం, ముగ్గులు) దక్షిణ భారతదేశంలో భోగి పేరుతో ప్రారంభమవుతుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఉన్న భోగి…
సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగీ. పెద్ద పండుగను మొదలుపెట్టేది భోగీతోనే. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భోగి పండుగను నిర్వహించుకుంటారు. భోగి రోజున ప్రజలు తమ ఇంట్లోని పాత వస్తువులను లేదా పనికిరాని వస్తువులను బయటకు తీస్తారు. భోగీ మంటల్లో వాటిని వేసి తగలబెడతారు. ఈ సంప్రదాయానికి అర్థం పాత వస్తువులను వదిలేసి కొత్తవాటిని స్వీకరించడం.
సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణానికి మారినప్పుడు ఈ పెద్ద పండుగను నిర్వహించుకుంటారు. భోగి పండుగను వర్షాన్ని ఇచ్చే దేవుడైన ఇంద్రుడికి అంకితం చేస్తారు. రైతులు ఇంద్రుడిని ప్రార్థిస్తారు. ఇంద్రుని అనుగ్రహంతో తమ జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని వారి విశ్వాసం. ఈ సందర్భంగా ప్రజలు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా తమ ప్రియమైన వారికి గ్రీటింగ్ మెసేజులు, విషెస్ పంపుతారు. మీకు కూడా బంధుమిత్రులకు భోగీ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ తెలుగులో ఇచ్చాము. మీకు నచ్చిన వాటిని అందులో ఎంపిక చేసుకోండి.
భోగీ శుభాకాంక్షలు 2025
1. ఈ పవిత్ర భోగి పండుగ,
ప్రతి ఒక్కరి ఇంటికి సంతోషాన్ని తెస్తుంది,
సూర్యకిరణాలు మిమ్మల్ని ఆశీర్వదించాలి,
మీకు మీ కుటుంబసభ్యులకు భోగీ శుభాకాంక్షలు
2. భోగిలో గత చెడులను కాల్చండి,
కొత్త సంవత్సరాన్ని కొత్త ఉత్సాహం, ఆశలతో నిలవండి
హ్యాపీ భోగి 2025
3. భోగి రోజున సూర్యుడి నుండి వచ్చే కొత్త కిరణాలు
మీ జీవితంలో కొత్త ఆనందాన్ని తెస్తాయి.
భోగీ శుభాకాంక్షలు
4. ఇంటికొచ్చే పాడి పంటలు
కమ్మనైన పిండి వంటలు
చలికాచే భోగీ మంటలు
ఏటేటా సంక్రాంతి ఇంటింటా
కొత్త కాంతిని నింపాలని కోరుకుంటూ
అందరికీ భోగీ శుభాకాంక్షలు
5. కష్టాలు బాధలు భోగీ మంటలతో పోవాలి
కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి
మీ అందరికీ భోగీ శుభాకాంక్షలు
6. తరిగిపోని ధాన్య రాశులతో
తరలివచ్చే సిరిసంపదలతో
తిరుగులేని అనుబంధాల అల్లికలతో
మీ జీవితం ఎప్పుడూ ఎదగాలని కోరుతూ
భోగీ శుభాకాంక్షలు
7. ఆనందాల భోగీనాడు
మీరు చేపట్టే కార్యక్రమాన్నీ
విజయవంతం అవ్వాలని కోరుకుంటూ
మీకు భోగీ శుభాకాంక్షలు
8. గతానికి వీడ్కోలు పలుకుతూ
రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే
భోగీ పండుగ సందర్భంగా
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
9. భోగభాగ్యాలనిచ్చే భోగి
సరదానిచ్చే సంక్రాంతి
కమ్మని కనుమ
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను
నింపాలని కోరుకుంటున్నాను
మీకు మీ కుటుంబసభ్యులకు
భోగీ శుభాకాంక్షలు
10. కళకళలాగే ముంగిట రంగవల్లులు
బసవన్నల ఆటపాటలు
ఈ భోగీ మీకు సంతోషాలను పంచాలి
మీకు భోగీ శుభాకాంక్షలు
11. గతానికి వీడ్కోలు పలుకుతూ
రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే
భోగి పండుగ సందర్భంగా
అందరికీ భోగీ పండుగ శుభాకాంక్షలు
12. మీలోని చెడును, చెడు అలవాట్లను
భోగీ మంటల్లో వేసేయండి
జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి
భోగీ పండుగ శుభాకాంక్షలు
సంబంధిత కథనం