Daaku Maharaaj Success Event: నేను ఇంతవరకు ఇలాంటి ఎక్స్‌‌పీరియన్స్ చూడలేదు.. డాకు మహారాజ్ హీరోయిన్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Daaku Maharaaj Success Event: నేను ఇంతవరకు ఇలాంటి ఎక్స్‌‌పీరియన్స్ చూడలేదు.. డాకు మహారాజ్ హీరోయిన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jan 13, 2025 06:14 AM IST

Shraddha Srinath About Daaku Maharaaj Success: బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ జనవరి 12న విడుదలై మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ బాబీ, హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నేను ఇంతవరకు ఇలాంటి ఎక్స్‌‌పీరియన్స్ చూడలేదు.. డాకు మహారాజ్ హీరోయిన్ కామెంట్స్
నేను ఇంతవరకు ఇలాంటి ఎక్స్‌‌పీరియన్స్ చూడలేదు.. డాకు మహారాజ్ హీరోయిన్ కామెంట్స్

Shraddha Srinath About Daaku Maharaaj Success: ఈ ఏడాది ప్రేక్షకులు, అభిమానులను అలరించడానికి నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి వచ్చిన సినిమా డాకు మహారాజ్. గతేడాది ఇదే సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ డాకు మహారాజ్ సినిమాకు దర్శకత్వం వహించారు.

yearly horoscope entry point

డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్

డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా చేశారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో డాకు మహారాజ్ సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఫుల్ పాజిటివ్‌ టాక్‌తో మూవీ దూసుకుపోవండంతో ప్రెస్ మీట్ పెట్టి సంతోషం వ్యక్తం చేసింది సినిమా టీమ్. డాకు మహారాజ్ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ బాబీ, నాగవంశీ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెలా పాల్గొన్నారు.

చాలా ప్రత్యేకమైన రోజు

కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, “ఈ సంక్రాంతి మాకు మరచిపోలేని బహుమతి ఇచ్చింది. టీమ్ అంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశాము. ఇప్పటి వరకు నేను ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చూడలేదు. ముఖ్యంగా బాలయ్య బాబు గారి అభిమానులకు ధన్యవాదాలు. సినిమాని అందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అని చెప్పింది.

వరల్డ్ క్లాస్ ఎక్స్‌పీరియన్స్

నటి ఊర్వశి రౌటెలా మాట్లాడుతూ, “ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తున్న సందర్భంగా దర్శకుడు బాబీ గారికి, టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన బాబీ గారికి థాంక్స్. నాగవంశీ గారు ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. లెజెండరీ బాలకృష్ణ గారితో పని చేయడం అనేది వరల్డ్ క్లాస్ ఎక్స్‌పీరియన్స్. డాకు మహారాజ్ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపింది.

ఎప్పటికీ మరిచిపోలేని పుట్టినరోజు

“ఇది నాకు చాలా ప్రత్యేకమైన, ఎప్పటికీ మరచిపోలేని పుట్టినరోజు. నా పుట్టినరోజు (జనవరి 12) నాడు విడుదలైన డాకు మహారాజ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇంత మంచి సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. నాకు అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అందరూ కుటుంబంతో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అని హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది.

మంచి అనుభూతి

“డాకు మహారాజ్ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. నన్ను ఈ సినిమాలో భాగం చేసిన దర్శకుడు బాబీ గారికి, నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు. బాలకృష్ణ గారు, బాబీ డియోల్ గారు, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెలా వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రానికి పని చేయడం అనేది ఒక మంచి అనుభూతి” అని సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తెలిపారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024