Best Web Hosting Provider In India 2024
Sankranthi: సంక్రాంతి మూడు రోజుల పండుగ కాదు నాలుగు రోజుల వేడుక, ఏ రోజు ఏం చేస్తారంటే
Sankranthi: ముఖ్యమైన దక్షిణ భారత పండుగ సంక్రాంతి. ఈ పండుగ కేవలం మూడు రోజుల పండుగ అనుకుంటారు. నిజానికి ఇది నాలుగుపాటు చేసుకునే పండుగ.
సంక్రాంతి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పండుగ. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ ఇది. ఈ పండుగ మూడు రోజుల పాటూ నిర్వహించుకుంటారని అనుకుంటారు. భోగీ, సంక్రాంతి, కనుమ మాత్రమే లెక్కిస్తారు. నిజానికి ఈ పండుగ నాలుగు రోజుల పాటూ నిర్వహించుకోవాలి.
ఈ పండుగలో చాలా చోట్ల ఇంద్రుడిని, సూర్యభగవానుడిని పూజిస్తారు. వీరి వల్లే పంటలు పండుతాయని భావిస్తారు. అందుకే పాలు పొంగించి, కొత్త బియ్యంతో పాయసం వండి సూర్యుడికి సమర్పిస్తారు. తమిళనాడులో ఈ పండుగను నాలుగు రోజుల పాటూ నిర్వహిస్తారు.
మొదటి రోజు: భోగీ పొంగల్
ఈ సంవత్సరం జనవరి 13 న భోగి వచ్చింది. దీన్ని భోగి పొంగల్ అంటారు. ఇది సంక్రాంతి వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది. తమ వ్యవసాయ భూమిని సారవంతం చేసేందుకు కృతజ్ఞతగా మొదటి రోజు వర్షాధిపతి ఇంద్రుడిని పూజిస్తారు. పంజాబ్ లో లోహ్రీ పండుగ మాదిరిగానే, ఈ రోజు కార్యక్రమాలు భోగి మంటల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. ఈ రోజున ప్రజలు సూర్యభగవానుడితో పాటు పంటలు పండించడానికి ఉపయోగించే వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు.
రెండవ రోజు: సూర్య పొంగల్
ఇక రెండో రోజు సూర్య పొంగల్ గా పండుగ చేసుకుంటారు. ఈ వేడుకలో ఇదే ప్రధానమైన రోజు. దీన్నే మిగతా చోట్ల సంక్రాంతిని నిర్వహించుకుంటారు. తాజా పాలను మరిగించి పొంగేలా చేస్తారు. తీపి వంటకం పాయసం వండుతారు. చెరకు, కొబ్బరి, అరటి వంటి ఇతర వస్తువులను కూడా సూర్యభగవానుడికి సమర్పిస్తారు.
మూడో రోజు: మట్టు పొంగల్
గోవుల ఆరాధనకు అంకితమైనది మూడో రోజు. దీన్ని మట్టు పొంగల్ అని పిలుస్తారు. ఆవులు, ఎద్దులు వంటి పశువులను ఈ రోజున పూచిస్తారు. ఎందుకంటే అవి రైతులకు ఇవి ఎంతో సాయం చేస్తాయి. పశువులను స్నానం చేయించివాటిని అందంగా అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేసి పూలదండలతో అలంకరిస్తారు.
నాలుగో రోజు: కానుం పొంగల్
ఇక నాలుగో రోజు పండుగలో చివరి రోజు. దీన్ని కానుమ్ పొంగల్ అని పిలుస్తారు. ఈ రోజున, ప్రజలు సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. జీవితంలో మాధుర్యానికి, ఆనందానికి ప్రతీకగా చెరకును దేవతలకు నైవేద్యంగా పెడతారు. ఈ రోజు చాలా వేడుకగా బంధుమిత్రులను కలుస్తారు. కలిసి ఆడిపాడతారు.
ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే భోగీ, సంక్రాంతి, కనుమ పండుగలను నిర్వహించుకుంటారు. నాలుగో రోజు ముక్కనుమ అంటారు. కానీ దీన్ని పెద్ద పట్టించుకోరు. మొదటి మూడు రోజులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సంక్రాంతి రోజు ఎలాంటి మాంసాహారాన్ని ముట్టుకోరు. కానీ కనుమ రోజు పూర్తిగా మాంసాహారాన్నే తినేందుకు ఇష్టపడతారు.
ఆంధ్రప్రదేవ్ లో గోదావరి జిల్లాల్లో ఎంతో వేడుకగా సంక్రాంతి పండుగ జరుగుతుంది. ఎంతో మంది పర్యాటకులు అక్కడ జరిగే కోడిపందేలు చూసేందుకు తరలి వెళతారు. తమిళనాడులో కూడా జల్లికట్టు జరిగేది సంక్రాంతికే.
సంబంధిత కథనం
టాపిక్