Best Web Hosting Provider In India 2024
Maha Kumbh Mela : మహా కుంభ మేళాకు వెళుతున్న తెలుగువారికి అలర్ట్! పార్కింగ్, రూట్ వివరాలు..
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళాకు వెళుతున్న తెలుగువారికి అలర్ట్! పార్కింగ్, రూట్, డైవర్,న్స్‌తో పాటు ఇతర వివరాలను యూపీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మహా కుంభమేళా 2025కి సర్వం సిద్ధమైంది. సోమవారం ప్రారంభంకానున్న ఈ కుంభమేళాకు కోట్లాది మంది ప్రజలు తరలివెళ్లనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మరీ ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవ్వకుండా అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు సమగ్ర ప్రణాళికను అమలు చేశారు.
మహా కుంభమేళాకు వెళ్లే వారికి అలర్ట్..!
ఉత్తర్‌ప్రదేశ్ సమాచార శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. మహా కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించే వాహనాలకు నిర్దేశిత ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు ఈ ప్రణాళికలో ఉన్నాయి.
సంగం మేళా ప్రాంతానికి ప్రవేశ మార్గం జవహర్ లాల్ నెహ్రూ మార్గ్ (బ్లాక్ రోడ్) ద్వారా, నిష్క్రమణ మార్గం త్రివేణి మార్గ్ ద్వారా ఉంటుంది. ప్రధాన స్నానోత్సవాల సందర్భంగా “అక్షయవత్ దర్శనం” సందర్శకుల కోసం మూసివేసి ఉంటుంది.
జౌన్పూర్ నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాల్లో చిని మిల్ పార్కింగ్, పూర్వా సుర్దాస్ పార్కింగ్, గరాపూర్ రోడ్, సామ్యామై టెంపుల్ కచార్ పార్కింగ్, బద్రా సౌనోటి రహీమాపూర్ మార్గ్, ఉత్తర / దక్షిణ పార్కింగ్ ఉన్నాయి. జౌన్పూర్ నుంచి వచ్చే వాహనాలను ఇక్కడ పార్క్ చేసి భక్తులు ఓల్డ్ జీటీ రోడ్డు మీదుగా నడుచుకుంటూ మేళా ప్రాంతంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
వారణాసి నుంచి వచ్చే వాహనాలకు మహువా బాగ్ పోలీస్‌స్టేషన్ ఝుసీ పార్కింగ్ (అఖాడా పార్కింగ్), సరస్వతి పార్కింగ్, ఝుసీ రైల్వే స్టేషన్, నాగేశ్వర్ టెంపుల్ పార్కింగ్, జ్ఞాన్ గంగా ఘాట్, చాట్నగర్ పార్కింగ్, శివ మందిర్ ఉస్తాపూర్, మహమూదాబాద్ పార్కింగ్ వద్ద ఏర్పాట్లు చేశారు.
మహా కుంభమేళా 2025 కోసం వారణాసి నుంచి వచ్చే వాహనాలను ఇక్కడ పార్క్ చేసి భక్తులు చాట్ నగర్ రోడ్డు గుండా నడుచుకుంటూ మేళా ప్రాంతంలోకి ప్రవేశిస్తారు.
అదేవిధంగా, మీర్జాపూర్ నుంచి వచ్చే వాహనాలను దేవ్రాఖ్ ఉపర్హర్ పార్కింగ్, ఉత్తర / దక్షిణ, టెంట్ సిటీ పార్కింగ్, ఒమెక్స్ సిటీ పార్కింగ్, గాజియా పార్కింగ్, ఉత్తర / దక్షిణం వద్ద పార్క్ చేస్తారు. మీర్జాపూర్ నుంచి వచ్చే వాహనాలను ఇక్కడ పార్క్ చేసి యాత్రికులు అరైల్ బంద్ రోడ్డు మీదుగా నడుచుకుంటూ మేళా ప్రాంతంలోకి ప్రవేశించాలి.
రేవా-బండా-చిత్రకూట్ వైపు నుంచి వచ్చే వాహనాలను నవప్రయాగం పార్కింగ్, (తూర్పు/ పడమర/ విస్తరణ), అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ పార్కింగ్, (యమునా పట్టి), మహేవా పురబ్/ పశ్చిమ పార్కింగ్, మీర్ఖ్పూర్ కచార్ పార్కింగ్ వద్ద పార్కింగ్ చేస్తారు.
రేవా-బండా-చిత్రకూట్ నుంచి వచ్చే వాహనాలను ఇక్కడ పార్క్ చేసి భక్తులు ఓల్డ్ రేవా రోడ్, న్యూ రేవా రోడ్డు, అరైల్ బంద్ మీదుగా మేళా ప్రాంతంలోకి ప్రవేశిస్తారు.
కాన్పూర్-కౌశాంబి వైపు నుంచి వచ్చే వాహనాలు కాళీ ఎక్స్టెన్షన్ ప్లాట్ నంబర్ 17 పార్కింగ్- అలహాబాద్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ పార్కింగ్- దధీకండో గ్రౌండ్ పార్కింగ్ వద్ద ఏర్పాట్లు చేశరు.
కాన్పూర్-కౌశాంబి నుంచి వచ్చిన వాహనాలను ఇక్కడ పార్క్ చేయాల్సి ఉంటుంది. భక్తులు జీటీ జవహర్ చౌరాహా, కాళీ మార్గ్ మీదుగా మేళా ప్రాంతంలోకి ప్రవేశిస్తారు.
లక్నో-ప్రతాప్‌గఢ్ నుంచి వచ్చే వాహనాలు గంగేశ్వర్ మహదేవ్ కచార్ పార్కింగ్, నగ్వాసుకి పార్కింగ్, బక్షి బంద్ కచార్ పార్కింగ్, బడా బాగ్దా పార్కింగ్, ఐఈఆర్టీ పార్కింగ్ వద్ద పార్క్ చేయాల్సి ఉంటుంది. యాత్రికులు నవాస్ కీ మార్గ్ మీదుగా నడుచుకుంటూ మేళా ప్రాంతంలోకి ప్రవేశిస్తారు.
మహా కుంభమేళా 2025 కోసం అయోధ్య-ప్రతాప్‌గఢ్ వైపు నుంచి వచ్చే వాహనాలను శివ్ బాబా పార్కింగ్ వద్ద పార్కింగ్ చేస్తారు. అనంతరం సంగం లోయర్ మార్గ్ మీదుగా నడుచుకుంటూ మేళా ప్రాంతంలోకి ప్రవేశించాలి.
సంగం ప్రవేశ మార్గం: భక్తులు/స్నానాలు చేసేవారు జీటీ జవహర్ నుంచి ప్రవేశించి, కాళీ రోడ్డుకు వెళ్లి, కాళీ ర్యాంప్‌ను ఉపయోగించి, సంగం ఎగువ మార్గం గుండా నడుచుకుంటూ సంగం చేరుకోవచ్చు.
సంగం నుంచి ఎగ్జిట్ రూట్స్..
భక్తులు అక్షయవత్ మార్గం ద్వారా నిష్క్రమించి, త్రివేణి మార్గ్ మీదుగా ఇంటర్‌లాకింగ్ రిటర్న్ రూట్లో బయటకు వెళ్లిపోతారు.
జనవరి 14 (మకర సంక్రాంతి), జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (బసంత్ పంచమి) ప్రధాన స్నానాల అనంతరం మహా కుంభమేళా ఫిబ్రవరి 26 న ముగుస్తుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link