Best Web Hosting Provider In India 2024
13 Jan 2025 10:34 AM
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన వైయస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలోని అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్పారు.