Best Web Hosting Provider In India 2024
Daaku Maharaaj Collection Day 1: డాకు మహారాజ్‌కు తొలి రోజు 50 కోట్లు.. అమెరికాలో ఎంత వచ్చిందంటే?
Daaku Maharaaj Worldwide Box Office Collection Day 1: నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ జనవరి 12న రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
Daaku Maharaaj Worldwide Box Office Collection: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ కొల్లి అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్ రోల్ ప్లే చేశారు.
పాజిటివ్ టాక్‌తో
అలాగే, బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటెలా డాకు మహారాజ్‌లో ఐటమ్ సాంగ్ చేయడమే కాకుండా ఓ పాత్ర కూడా పోషించిది. జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదలైన డాకు మహారాజ్ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
ఏరియాలా వారీగా
డాకు మహారాజ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 22.31 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. వాటిలో నైజాం నుంచి రూ. 4.07 కోట్లు, సీడెడ్ నుంచి 5.25 కోట్లు రాగా ఏపీలోని ఉత్తరాంధ్రలో 1.92 కోట్లు, గుంటూరులో 4 కోట్లు, కృష్ణలో 1.86 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.95 కోట్లు, పశ్చిమ గోదావరిలో 1.75 కోట్లు, నెల్లూరులో 1.51 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.
ఏపీ తెలంగాణలో
ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రూ. 22.31 కోట్ల షేర్ రాబట్టింది బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ. అలాగే, ఏపీ, తెలంగాణలో మొదటి రోజు ఈ సినిమాకు రూ. 33 నుంచి 35 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో మూవీకి రూ. 4 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో 1 మిలియన్‌కు పైగా గ్రాస్ సొంతం చేసుకున్నట్లు మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా తొలి రోజున డాకు మహారాజ్‌కు రూ. 46 నుంచి 48 కోట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయట. ఇక ఫైనల్ లెక్కలు తేలేలోపు ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ సినిమాకు రూ. 50 కోట్లు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చిరంజీవి తర్వాత
అయితే, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తొలి రోజు కలెక్షన్స్‌తో పోలిస్తే డాకు మహారాజ్ కలెక్షన్స్ చాలా తక్కువే అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బాలకృష్ణతో డైరెక్టర్ బాబీకి ఇది తొలి సినిమా. గతేడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ ఈ పొంగల్‌కి బాలకృష్ణతో డాకు మహారాజ్ మూవీతో వచ్చాడు. ఈ సినిమాకు కూడా మంచి రివ్యూలు, టాక్ వస్తున్నాయి. బాలకృష్ణ అదరగొట్టాడని అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయని చెబుతున్నారు.
సంబంధిత కథనం