Best Web Hosting Provider In India 2024
Bhogi Pallu:పిల్లలకు పోసే భోగి పండ్లలో బంతి పూల రేకులు ఎందుకు కలుపుతారు? వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
Bhogi Pallu: భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పండ్లు పోయడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. భోగి పండ్లలో రేగి పండ్లు, చిల్లర నాణాలతో పాటు బంతిపూల రేకులను కలిపి పిల్లల తలమీద వేస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారు? బంతిపూల రేకులు చల్లడం వల్ల పిల్లలకు కలిగే లాభాలేంటి?
సంక్రాంతికి ముందు రోజున వచ్చే పండుగ భోగి. ఈ రోజున పిల్లలకు భోగి పండ్లను పోయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా చేయడం వల్ల పిల్లలకు దిష్టి పోతుందనీ, వీటిలో కలిపే రేగు పండ్లు, నాణేలు, బంతిపూల రేకులు వారిపై ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అయితే భోగి పండ్లలో బంతిపూల రేకులను కలగపడానికి వెనక శాస్త్రీయ కోణం కూడా ఉందని మీలో ఎంతమందికి తెలుసు. బంతిపూలు తలమీద వెయ్యడం వల్ల పిల్లలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం రండి.
బంతి పూలే ఎందుకు?
బంతిపూల రెక్కలను తుంచి భోగి పండ్లలో కలిపడానికి కారణం వాటి నుంచి వెలువడే వాసన. బంతిపూల రేకులను పిల్లల తలమీద పోసినప్పుడు వాటి వాసన పిల్లల శరీరమంతటా పాకుతుంది. అవి పిల్లల ఒంటికి తగులుతాయి. బంతి పూల వాసన మనస్సుకు, శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది.శరీరానికి ,మనస్సుకు విశ్రాంతి ఇవ్వడంలో సహాయపడతాయి. అందుకే అరోమాథెరపీతో పాటు అనేక సాంప్రదాయ చికిత్సలో ఈ పువ్వుల వాసనను విరివిగా ఉపయోగిస్తారు. ఈ వాసన పిల్లలు పీల్చుకోవడం వల్ల మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి.
1. ఒత్తిడి ,ఆందోళన తగ్గించడం:
బంతి పూల వాసన సంతోషకరమైన ,శాంతివంతమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతపరచడంలో సహాయపడుతుంది, ఆందోళన, ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ వాసన శరీరాన్ని, మనస్సును మెల్లగా విశ్రాంతి పరిచేలా చేస్తుంది.
2. మూడ్‌ను మారుస్తుంది:
బంతి పూల వాసన మానసిక స్థితిని మెరుగుపరచడం లో కూడా సహాయపడుతుంది. ఇది పిల్లలో బద్దకాన్ని, విరక్తిని తగ్గించి వారిని మానసికంగా చురుగ్గా మారుస్తుంది. మానసిక ఉల్లాసాన్ని, శాంతిని పెంపొందిస్తాయి. ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు సానుకూల మార్పులు తీసుకువస్తుంది.
3. భావోద్వేగ సమతుల్యత:
బంతి పూల వాసన మనస్సులోని ఆందోళనలను తగ్గించే శక్తి ఉంటుంది. భావోద్వేగాలను సమతుల్యం చేసేందుకు, ప్రశాంతతను పెంపొందించేందుకు ఈ వాసన బాగా ఉపయోగపడుతుంది. మానసిక ఉత్కంఠను తగ్గిస్తుంది.
4. నిద్ర మెరుగుదల:
బంతి పూల వాసన బాగా నిద్ర పట్టేందుకు కూడా సహయం చేస్తుంది. నిద్రకు ముందు దీని వాసనను ఆస్వాదించడం శరీరానికి, మనసుకూ శాంతి చేకూర్చి, నిద్రపోవడం సులభం చేస్తుంది.
5. దృష్టి ,ఏకాగ్రత :
బంతి పూల వాసన మానసిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. పిల్లల దృష్టి కోణాన్ని మార్చి, వారిలో ఏకాగ్రతను పెంచుతుంది. ఫోకస్ గా పనిచేసేలా చేస్తుంది.
6. శ్వాస ఆరోగ్యం:
బంతి పూల వాసన శ్వాస సంబంధిత సమస్యలు తగ్గించే లక్షణాలు కలిగివుంటుంది. ఇది జలుబు, దగ్గు, ముక్కు కొద్దిగా మూసుకుపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఉపశమనాన్ని అందిస్తుంది.
7. శాంతి వాతావరణం:
బంతి పూల వాసన సహజంగా మనోవృత్తిని మెరుగుపరచడంలో ముందుంటుంది. చుట్టూ ఉన్న నెగిటివ్ ఆరాను తరిమికొట్టడం దీని సహజ లక్షణం. వీటిని పిల్లల మీద చల్లడం వల్ల వారి చుట్టూరా ఉండే నెగిటివ్ ఆరా తొలగిపోతుంది. వారి శరీరాన్ని శాంతింపజేస్తుంది. ఇది గది వాతావరణాన్ని మార్చి ప్రశాంతత, శాంతిని పెంచుతుంది.
8. ఆత్మవిశ్వాసం:
బంతి పూల వాసన ఆత్మవిశ్వాసం పెంచడంలో సహాయపడుతుంది. ఇది మానసిక దృఢత్వాన్ని, మరింత సానుకూల ఆలోచనలను క్రమంగా అందిస్తుంది.
9. శక్తి ,ఉత్తేజం:
ఈ వాసన శరీరానికి మేలైన శక్తిని ఇచ్చి, ఉత్సాహం ,జీవిత శక్తిని పెంచుతుంది.
10. ఆధ్యాత్మిక ,పూజా ప్రయోజనాలు:
బంతి పూల వాసన ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. పూజలు, మంత్రపఠనాలు ,ధ్యాన సమయంలో ఈ వాసన పూజా చింతనను పెంచుతుంది.