Best Web Hosting Provider In India 2024
Benefits of Regi Pandu: రేగి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అన్ని సీజన్లలో దొరికితే బాగుండు అనుకుంటారు!
Benefits of Regi Pandu:రేగి పండు తెలియని వాళ్లు ఉంటారా? తియ్య తియ్యగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. శీతాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు కేవలం రుచిలో మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ ముందు ఉంటాయి. దీని వల్ల కలిగే లాభాలు తెలిస్తే అన్ని సీజన్లలో దొరికితే బాగుండు అని ఫీలవుతారు. అవేంటో చూద్దామా.
శీతాకాలంలో మాత్రమే దొరికే రేగి పండు ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. తిపి, పులుపు కలగలిపిన రుచితో ఉండే ఈ పండులో పోషక విలువలు మెండుగా ఉంటాయి. ఎన్నో వేల సంవత్సరాలుగా రేగి పండ్లను ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు.శీతాకాలంలో తప్పకుండా ప్రతి రోజూ రేగి పండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట. అవేంటో తెలిస్తే ఈ పండ్లు శీతాకాలంలో మాత్రమే కాకుండా అన్ని సీజన్లలో దొరికితే బాగుండు అనుకుంటారు.
రేగిపండులో పోషక విలువలు (100gకు):
- క్యాలరీలు 79 kcal
- విటమిన్ సి 69%
- ఫైబర్ 4g
- ఐరన్ 1.8mg
- పోటాషియం 250mg
- కార్బోహైడ్రేట్లు 20g
రోజూ కొన్ని రేగు పండ్లను తినడం వల్ల కలిగే లాభాలు:
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
రేగిపండు విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని వైరస్లు, బాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తుంది. శీతాకాలంలో ప్రతి రోజూ కొన్ని రేగుపండ్లను తినడం వల్ల సీజనల్ జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
రేగిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజూ రేగి పండ్లను తినడం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు రేగిపండును తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. రక్తహీనతను (అనీమియా) నివారిస్తుంది
రేగిపండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అనీమియా (Anaemia) సమస్యలతో బాధపడేవారు కొన్ని రేగిపండ్లను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.
4. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
రేగిపండులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పాడవకుండా కాపాడుతాయి.ముడతలు , మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో లభించే విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని గ్లొయింగ్‌గా మార్చుతుంది. సౌందర్యం కోసం రేగిపండును ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగిస్తారు.
5. గుండె ఆరోగ్యానికి మంచిది
రేగిపండులో ఉన్న పోటాషియం , యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెకు హానికరమైన కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి దీర్ఘకాలిక గుండె సమస్యలను నివారిస్తుంది.గుండె సంబంధిత వ్యాధులు నివారించడానికి ప్రతి రోజూ రెండు లేదా మూడు రేగి పండ్లను తినడం మంచిది.
6. నిద్రలేమిని తగ్గిస్తుంది
రేగిపండు సెడేటివ్ లక్షణాలు (sedative properties) కలిగి ఉంది. ఇది ఆందోళన (Anxiety)ను తగ్గిస్తుంది. నిద్రలేమి (Insomnia) సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట రేగిపండుతో తయారుచేసిన టీ తాగడం వల్ల శరీరాన్ని సడలించడానికి సహాయపడుతుంది.
7. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది
రేగిపండులో సహజసిద్ధమైన చక్కెరలు తక్కువగా ఉంటాయి. ఇది మధుమేహం (Diabetes) ఉన్నవారికి మంచి ఆహారం. ఫైటోకెమికల్స్ (Phytochemicals) వల్ల రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేగిపండును తగిన పరిమాణంలో తీసుకోవచ్చు.
8. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది
రేగిపండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి , ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపుని తేలికగా,తృప్తిగా ఉంచుతుంది. అతిగా తినడం తగ్గిస్తుంది, తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వెయిట్ లాస్ చేయాలనుకునేవారు రేగిపండును స్నాక్‌గా తీసుకోవచ్చు.
9. యాంటీ-క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంది
రేగిపండులో యాంటీ-క్యాన్సర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రిస్తాయి . ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ , లివర్ క్యాన్సర్ ముప్పును తగ్గించగలవు.
10. ఎముకల బలాన్ని పెంచుతుంది
రేగిపండులో కేల్షియం, ఫాస్పరస్, మ్యాగ్నీషియం ఉన్నాయి, ఇవి ఎముకలను బలపరుస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలను నివారిస్తాయి.
11. శరీర శక్తిని పెంచుతుంది
రేగిపండులో సహజసిద్ధమైన చక్కెరలు , బి విటమిన్లు ఉన్నాయి.ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.రేగిపండును ఎనర్జీ బూస్టర్గా తీసుకోవచ్చు.
సంబంధిత కథనం