Best Web Hosting Provider In India 2024
Hero Venkatesh: నేను వచ్చే లోపల నలుగురిని కన్నావ్ అన్నప్పుడు అలా అనిపించింది.. హీరో వెంకటేష్ కామెంట్స్
Venkatesh About Sankranthiki Vasthunnam Role: హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ క్రైమ్ కామెడీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన రోల్ గురించి, సినిమాలోని డైలాగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దగ్గుబాటి వెంకటేష్.
Venkatesh In Sankranthiki Vasthunnam Promotions: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ క్రైమ్ కామెడీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా చేసిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్‌లో వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ విన్నప్పుడు మిమ్మల్ని ఎగ్జయిట్ చేసిన ఎలిమెంట్ ఏంటీ?
-ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. మినిమం గ్యారెంటీ అని అక్కడే తెలిసిపోయింది. అనిల్‌ది నాది సూపర్ హిట్ కాంబినేషన్. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇందులో కామెడీ స్టయిల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా సటిల్డ్‌గా కొత్తగా ట్రై చేశాం. ఫ్రెష్ సీన్స్ ఉంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. అనిల్‌తో మంచి ర్యాపో కుదిరింది. తనతో మూవీస్ ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది.
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ గురించి?
-మీనాక్షి, ఐశ్వర్య ఇద్దరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. చక్కగా పెర్ఫామ్ చేశారు. క్యారెక్టర్స్ వెరీ క్రేజీగా ఉంటాయి.
భీమ్స్ మ్యూజిక్ గురించి?
-భీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేసి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తనకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో చేశాడు. ఫస్ట్ ట్యూన్ వినగానే హిట్ అనుకున్నాం. అది సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అది ఆడియన్స్ గొప్పదనం. గోదారి గట్టు పాట 85 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అనిల్ గారు మీ ఎక్స్ కాప్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
– చాలా సరదాగా అనిపించింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి.. నా గురించే ఆలోచిస్తున్నావా ? నేను వచ్చే లోపల నలుగురిని కన్నావ్.. అన్నప్పుడు చాలా హిలేరియస్‌గా అనిపించింది. అలాంటి సీన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో నాకు నలుగురు పిల్లలు. అందులో ఒకడిని చాలా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది (నవ్వుతూ). ఇందులో క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్స్ చాలా క్రేజీగా ఉంటాయి. ఆడియన్స్ చాలా ఎంటర్టైన్ అవుతారు. యూత్ ఆ డైలాగ్స్‌ని చాలా లవ్ చేస్తారు.
మీరు సెట్స్‌లో ఉంటే నిర్మాత సెట్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని దిల్ రాజు గారు చెప్పారు. మీరే చాలా జాగ్రత్తగా చూసుకుంటారని అన్నారు?
-లేదండి.. నిర్మాతలు రావాలి (నవ్వుతూ). నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ప్రతి సినిమా నా సొంత సినిమాగా చేస్తాను. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. సిన్సియర్‌గా పని చేస్తాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్ సీతమ్మ వాకిట్లో నుంచి ట్రావెల్ అవుతున్నాను. వారితో జర్నీ చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. మేము చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. వారికి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను.
70 రోజుల్లోనే ఈ సినిమాని ఫినిష్ చేయడం ఎలా అనిపించింది?
-సినిమాని ఫాస్ట్‌గా ఫినిష్ చేయడం హ్యాపీగా అనిపించింది. అనుకున్నదాని ప్రకారం అన్నీ అద్భుతంగా కుదిరాయి.
సంబంధిత కథనం