Best Web Hosting Provider In India 2024
Karnataka Temple:క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. 25 సెకన్ల పాటు ఈ మ్యూజికల్ సౌండ్స్ విని ఎంజాయ్ చేయండి
Karnataka: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్లు చేయడం, వైఫై కనెక్ట్ అవడం, ప్రొఫైల్ కు లింక్ అవడం వరకూ తెలుసు. కానీ, నేరుగా సంగీతం వినడం కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా. రండి పూర్తిగా తెలుసుకుంటే, మీకు మరింత గొప్ప ఫీలింగ్ అనిపిస్తుంది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 25 సెకన్ల పాటు మ్యూజికల్ సౌండ్స్ వినొచ్చట. ఇంత విచిత్రమైన విషయం ఏ మ్యూజికల్ క్లాసులోనే, ఏదో మార్కెటింగ్ ట్రిక్కో అనుకునేరు. కాదండీ. ఇది పవిత్రమైన దేవాలయంలో అబ్బరపరుస్తున్న విషయం. కర్నాటకలోని హంపిలో ఉన్న విజయ విఠల దేవాలయంలోని విశేషం ఇది.
కర్ణాటకలోని హంపి ఒకప్పుడు అద్భుతమైన భారతీయ మహానగరం. ఇప్పటికీ హంపి నగరం ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది. అక్కడ నిర్మించిన పురాతన దేవాలయాలు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటే, విజయనగర సామ్రాజ్యపు మహానగర శిథిలాల ఆనవాళ్లు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ విషయం గురించి ఇప్పుడే తెలుసుకుని ఉంటే, నెక్స్ట్ హాలిడేస్ కు అక్కడకే వెళ్తారేమో కూడా.
ఎందుకంటే, హంపిలోని విజయ విఠల దేవాలయంలో ఒక ప్రత్యేక ఫీచర్ ఏర్పాటు చేశారు. ఆలయంలోని ఒక 10 స్తంభాలపై QR కోడ్‌లను ఏర్పాటుచేశారు. ఆలయ సందర్శనానికి వచ్చిన పర్యాటకులు ఎవరైనా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ పై క్లిక్ చేస్తే, 25-సెకన్ల పాటు మ్యూజిక్ క్లిప్ వినిపిస్తుందట.
హంపి శిలా స్తంభాలకు ప్రాణం పోస్తున్న QR కోడ్‌లు
హంపిలోని విజయ విఠల దేవాలయంలో స్తంభాలు సంగీతం వినిపిస్తాయని తెలిసిన విషయమే. కానీ, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు పెట్టారంటే, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా, గతంలో స్తంభాన్ని తడితే శబ్దాలు వినిపించేవట. ఇప్పుడు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఆలయ నిర్మాణంలో మార్పులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆలయ అధికారులు ఈ ఏర్పాటు చేశారట. పైకప్పుతో అనుసంధానించిన ఈ 56 స్తంభాల నుంచి సంగీతం వినిపిస్తుందట. కాకపోతే ప్రస్తుతానికి ఒక పది స్తంభాలకు మాత్రమే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారట. ఎవరైతే ఆ కోడ్ స్కాన్ చేస్తారో.. వారు స్తంభంలో వినిపించే మ్యూజికల్ వైబ్రేషన్స్ వినొచ్చని చెప్తున్నారు.
హంపి పర్యాటక రంగాన్ని మెరుగుపరిచేందుకు కొత్త సౌకర్యాలు
UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అర్హత పొందిన హంపి ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇప్పటివరకూ దానికి అందిన లిమిటెడ్ ఫెసిలిటీస్ తో పర్యాటకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ లోటుపాట్లను అధిగమించేలా కొత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. భవిష్యత్ లో మరిన్ని కొత్త ఫీచర్స్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.
టూరిస్ట్‌ల కోసం
ఆలయ ప్రాంగణంలో సౌలభ్యాన్ని పెంపొందించడానికి, ప్రాథమిక సౌకర్యాల కొరతను పరిష్కరించడానికి పర్యాటక శాఖ 20 ‘ట్రావెలర్ నూక్స్’ నిర్మించాలని యోచిస్తోందని పోర్టల్ నివేదించింది. హంపి పురావస్తు, సాంస్కృతిక, సహజ ప్రకృతి దృశ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ నూక్స్, తాగునీరు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, శుభ్రమైన మరుగుదొడ్లు, సమాచార కియోస్క్‌ల వంటి సౌకర్యాలను అందిస్తాయి. ఇవన్నీ సందర్శకులు ఆలయానికి వచ్చినప్పుడు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు ఉపయోగపడతాయి.
వీటిలో పాలిచ్చే తల్లులకు ప్రత్యేక సదుపాయాలు, డైపర్ మార్చే స్టేషన్లు, Wi-Fi సీటింగ్ ప్రాంతాలు, వికలాంగులకు అనుకూలమైన వాష్‌రూమ్‌లు వంటి సౌకర్యాలు ఉండనున్నాయట. హంపి వాస్తు శిల్పి గొప్పదనం తెలిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్