Best Web Hosting Provider In India 2024
Sankranthiki Vasthunnam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..
Sankranthiki Vasthunnam OTT: సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ డీల్ జరిగిపోయింది. ఓటీటీ పార్ట్‌నర్ ఏదో సమాచారం బయటికి వచ్చేసింది. శాటిలైట్ హక్కుల గురించి కూడా సమాచారం వెల్లడైంది.
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు టికెట్ల బుకింగ్స్ ఓ రేంజ్‍లో జరుగుతున్నాయి. ఈ మూవీకి భారీ ఓపెనింగ్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రేపు జనవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కామెడీ మూవీ పక్కా సంక్రాంతి మూవీలో ఉండటంతో బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో పాటలు పాపులర్ కాగా.. ప్రమోషన్లు కూడా మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. ఈ చిత్రం ఓటీటీ పార్ట్‌నర్‌ను కూడా లాక్ చేసుకుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఓటీటీ హక్కుల వివరాలు
సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సంస్థ దక్కించుకుంది. దీంతో జీ5 ఓటీటీకి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతమయ్యాయి. థియేట్రికల్ రన్ తర్వాత జీ5 ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. జీ తెలుగు టీవీ ఛానెల్‍కు శాటిలైట్ రైట్స్ దక్కాయి.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫిబ్రవరిలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిబ్రవరి మూడో వారంలో ఓటీటీలో అడుగుపెట్టవచ్చు. థియేటర్లలో ఈ మూవీ పర్ఫార్మెన్స్, థియేట్రికల్ రన్‍ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు కావొచ్చు.
అదిరిపోయే బుకింగ్స్
సంక్రాంతికి వస్తున్నాం.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. పండుగకు సూటయ్యేలా ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఈ మూవీ వస్తోంది. పాటలు, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో ఈ మూవీకి తొలి రోజు మంచి కలెక్షన్లు దక్కన్నాయి. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ కానుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పోటీలో ఉన్నా.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి బుకింగ్స్ ఫుల్ జోష్‍లో ఉన్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భార్య, మాజీ ప్రేయసి మధ్య నగిలిపోయే పాత్ర చేశారు వెంకీ. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్లలో ఫుల్ సందడి చేస్తున్నారు. వెంకీ చాలా ఉత్సాహంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. కొన్ని ఈవెంట్లలో డ్సాన్స్ కూడా చేశారు. ఈ చిత్రంలోని పాటలు మోత మోగుతున్నాయి. ఈ మూవీకి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు. శ్రీ వెంకేటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సాయికుమార్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, నరేశ్, వీటీవీ గణేశ్, శ్రీనివాస్ అవసరాల కూడా కీలకపాత్రలు పోషించారు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి గోదారిగట్టు సాంగ్ ఫుల్ బజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా ఎంటర్‌టైన్‍మెంట్ పక్కా అనేలా ఉంది. దీంతో ఈ పండుగకు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
సంబంధిత కథనం