Best Web Hosting Provider In India 2024
OTT Horror: ఓటీటీలోకి వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్.. 2 భాషల్లో ఫ్రీ స్ట్రీమింగ్, 6.8 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!
Speak No Evil OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్ డ్రామా స్పీక్ నో ఈవిల్ వచ్చేసింది. జనవరి 13 నుంచి ఓటీటీలో స్పీక్ నో ఈవిల్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్స్‌కు ఫ్రీగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇదివరకు ఈ సినిమా రెంటల్ విధానంలో మాత్రమే రిలీజ్ అయింది. మరి ఈ మూవీని ఎక్కడ చూడాలంటే?
Speak No Evil OTT Release: హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. సాధారణ మనుషులకు కామన్ ఎమోషన్ అయిన భయం ఆధారంగా ఈ సినిమాలు తెరకెక్కడంతో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంటారు. అందుకే ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్‌తో హారర్ జోనర్‌లో సినిమాలు, వెబ్ సిరీసులు తెరకెక్కుతుంటాయి.
బ్లాక్ బస్టర్ హిట్
అలా గతేడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైన స్పీక్ నో ఈవిల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే, మొదటగా 2022లో స్పీక్ నో ఈవిల్ సినిమా స్పానిష్‌లో విడుదలైంది. ఈ సినిమాను క్లైమాక్స్‌తో సహా కొన్ని మార్పులు చేసి ఇంగ్లీష్‌లో ఇదే టైటిల్‌తో 2024లో రీమేక్ చేశారు.
బడ్జెట్ అండ్ కలెక్షన్స్
2024లో సెప్టెంబర్ 9న న్యూయార్క్ సిటిలో రిలీజ్ అయి ఫుల్ పాజిటివ్ రెప్సాన్స్ తెచ్చుకుంది. అనంతరం సెప్టెంబర్ 13న అమెరికాతోపాటు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు ఐదింతల లాభాలు తీసుకొచ్చింది ఈ సినిమా. స్పీక్ నో ఈవిల్ మూవీకి 15 మిలియన్ డాలర్ల బడ్జెట్ పెడితే.. వరల్డ్ వైడ్‌గా 76 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.
రెంటల్ విధానంలో
అంతలా హిట్ అయిన స్పీక్ నో ఈవిల్ ఓటీటీలోకి ఎప్పుడో వచ్చేసింది. కానీ, రెంటల్ విధానంలో స్పీక్ నో ఈవిల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్పానిష్, ఇంగ్లీష్ రెండు వెర్షన్ సినిమాలు రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్నాయి. కానీ, స్పీక్ నో ఈవిల్ 2024 మూవీ మాత్రం ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్స్ ఎలాంటి రెంటల్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా చూసేలా ఓటీటీ రిలీజ్ అయింది.
6.8 ఐఎమ్‌డీబీ రేటింగ్
జనవరి 13 నుంచి జియో సినిమా ఓటీటీలో స్పీక్ నో ఈవిల్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అది కూడా ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో స్పీక్ నో ఈవిల్ ఓటీటీ రిలీజ్ అయింది. కాబట్టి, హారర్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను సబ్ టైటిల్స్‌తో ఎంచక్కా జియో సినిమా ఓటీటీలో వీక్షించొచ్చు. ఇదిలా ఉంటే, హారర్ థ్రిల్లర్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన స్పీక్ నో ఈవిల్ మూవీకి ఐఎమ్‌డీబీ సంస్థ 6.8 రేటింగ్ ఇచ్చింది.
83 శాతం ఫ్రెష్ కంటెంట్
అంతేకాకుండా, ఫ్రెష్ కంటెంట్ చెప్పే రొటెన్ టొమాటోస్ 83 శాతం ఇచ్చింది. అంటే, స్పీక్ నో ఈవిల్ కంటెంట్ 83 శాతం ఫ్రెష్‌గా ఉందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు జేమ్స్ వాట్కిన్స్ దర్శకత్వం వహించారు. ఇందులో జేమ్స్ మక్అవోయ్, మెకంజీ డేవిస్, ఐస్లింగ్ ఫ్రాన్సియోసి, స్కూట్ మెక్‌నెయిరీ, చైల్డ్ ఆర్టిస్ట్ డాన్ హౌ, చైల్డ్ ఆర్టిస్ట్ అలిక్స్ వెస్ట్ లెఫ్లెర్ ప్రధాన పాత్రలు పోషించారు.
రెండు ఫ్యామిలీస్ చుట్టూ
స్పీక్ నో ఈవిల్ మూవీ రెండు ఫ్యామిలీస్ చుట్టూ సాగుతుంది. టూర్‌లో పరిచయమైన ఒక ఫ్యామిలీ ఇంటికి మరో కుటుంబం వెకేషన్‌కు వెళ్తుంది. అప్పుడు ఆ ఇంట్లో చోటు చేసుకున్న సంఘటనల సముహారమే స్పీక్ నో ఈవిల్ స్టోరీ. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు గంట 50 నిమిషాలు ఉన్న స్పీక్ నో ఈవిల్ మూవీని జియో సినిమా ఓటీటీలో చూసి భయపడొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్