Crime news : టాస్​ వేస్తే హెడ్స్​ పడిందని.. యువతిని చంపి, శవాన్ని రేప్​ చేసిన కిరాతకుడు!

Best Web Hosting Provider In India 2024


Crime news : టాస్​ వేస్తే హెడ్స్​ పడిందని.. యువతిని చంపి, శవాన్ని రేప్​ చేసిన కిరాతకుడు!

Sharath Chitturi HT Telugu
Jan 14, 2025 07:20 AM IST

Crime news : పోలాండ్​లో 2023లో జరిగిన యువతి మర్డర్​ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. టాస్​ వేస్తే హెడ్స్​ పడిందని.. యువతిని చంపి, శవాన్ని రేప్​ చేసినట్టు నిందితుడు చెప్పాడు!

యువతిని చంపి, శవాన్ని రేప్​ చేసిన కిరాతకుడు!
యువతిని చంపి, శవాన్ని రేప్​ చేసిన కిరాతకుడు!

పోలాండ్​లో కలకలం సృష్టించిన యువతి హత్య, అత్యాచార కేసుకు సంబంధించిన షాకింగ్​ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. నిందితుడు ఆమెను చంపే ముందు కాయిన్​ టాస్​ వేశాడు! టెయిల్స్​ పడి ఉంటే యువతి బతికి ఉండేదని, కానీ హెడ్స్​ పడటంతో ఆమెను చంపేశానని చెప్పాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని రేప్​ చేశాడు!

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

ఇది 2023 ఆగస్ట్​ నాటి సంఘటన. పొలాండ్​లోని కటోవైస్​ అనే ప్రాంతంలో నివాసముండే విక్టోరియా అనే 18ఏళ్ల యువతి ఒక పార్టీ నుంచి ఇంటికి బయలుదేరింది. బస్సులో ఆమెను హెపా అనే వ్యక్తి కలిశాడు. కారు రిపేర్​ షాప్​లో పనిచేసే అతను డ్యూటీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళుతుండగా విక్టోరియా కనిపించింది. ఆమెను ముగ్గులో దింపి తన అపార్ట్​మెంట్​కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నిద్రలోకి జారుకుంది. కొంతసేపటి తర్వాత, ఆ వ్యక్తి.. విక్టోరియాను దారుణంగా కొట్టి, గొంతుకు తాడు కట్టి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని రేప్​ చేశాడు. ఆ తర్వాత ప్లాస్టిక్​ కవర్​లో చుట్టి పోలీసులకు ఫోన్​ చేశాడు!

ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అధికారులు నిందితుడిని అరెస్ట్​ చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టు విచారణలు జరుగుతున్నాయి. గత వారం జరిగిన కోర్టు విచారణలో నిందితుడు పలు కీలక విషయాలను వెల్లడించారు. అవి అత్యంత హేయనీయంగా ఉన్నాయి.

“2023 ఆగస్ట్​కి ముందు, ఎవరినైనా చంపాలని నాకు బలంగా కోరికలు ఉండేవి. నా పరిసరాల్లో తిరుగుతూ, ఎవరైనా దొరుకుతారేమో అని చూశాను. అప్పుడే విక్టోరియా కనిపించింది. ‘ఇంటికి వెళతావా? లేక నాతో వస్తావా?’ అని అడిగాను. నాతో వచ్చింది. నా అపార్ట్​మెంట్​లో కూర్చున్నాము. మాట్లాడుకున్నాము. ఆమె పడుకుండిపోయింది,” అని నాటి సంఘటనలను నిందితుడు వివరించాడు.

“నాకు ఏం చేయాలో తెలియలేదు. రూమ్​ అంతా నడిచాను. ఆ తర్వాత టాస్​ వేశాను. హెడ్స్​ పడింది! అందుకే ఆమెను చంపేశాను. అలా ఎందుకు చేశానో తెలియదు. కొన్ని విషయాలు అలా జరిగిపోతుంటాయంతే! వాటి మీద నాకు కంట్రోల్​ ఉండదు,” అని కోర్టులో విక్టోరియా తల్లిదండ్రుల సమక్షంలో నిందితుడు చెప్పుకొచ్చాడు.

“కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కాయిన్​ టాస్​లు వేస్తుంటాను. టెయిల్స్​ పడి ఉంటే ఆమె బతికే ఉండేది! కాని హెడ్స్​ పడింది. ఆమె మీద కూర్చున్నాను. కొట్టాను, గొంతుకు తాడు కట్టి చంపేశాను. విలవిలలాడుతూ ఆమె చనిపోయింది,” అని హెపా వివరించాడు.

“ఆమెను చంపిన తర్వాత, ఆమె బట్టులు తీసేశాను. ఆమెతో శృంగారంలో పాల్గొన్నాను. ఆ తర్వాత బట్టలు వేసి, మృతదేహాన్ని ఏం చేయాలో ఆలోచించాను. ఒక ప్లాస్టిక్​లో కవర్​ చేసి బ్యాగులో పెట్టాను. కాల్చేద్దాము అనుకున్నాను,” అని అన్నాడు.

ఈ మాటలు విని కోర్టులో ఉన్న వారందరూ షాక్​ అయ్యారు. “నీకు బతికే అర్హత లేదు” అని బాధితురాలి బంధువులు, స్నేహితులు కోర్టు రూమ్​లో గట్టిగా అరిచారు.

నిందితుడికి జీవిత ఖైదు..!

ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 12న జరగుతుంది. నిందితుడికి కఠిన శిక్ష పడాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link