Best Web Hosting Provider In India 2024
Karthika Deepam 2 Serial: టిఫిన్ బండి కాల్చేసింది జ్యోత్స్ననే – నిజం బయటపెట్టిన కార్తీక్ – ఉతికి ఆరేసిన దీప
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 14 ఎపిసోడ్‌లో రౌడీ సహాయంతో తమ టిఫిన్ బండిని జ్యోత్స్ననే కాల్చేసిందనే నిజం కార్తీక్‌కు తెలిసిపోతుంది. కోపం పట్టలేకపోయిన దీప…జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది. ఇంకోసారి మా జోలికి వస్తే ఉతికి ఆరేస్తానని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది.
Karthika Deepam 2 Serial: కార్తీక్, దీప టిఫిన్ బండి కాలిపోతుంది. రౌడీలతో టిఫిన్ బండిని కాల్చేసిన జ్యోత్స్న…ఏం తెలియనట్లుగా సాయం చేయడానికి కార్తీక్ దగ్గరకు వస్తుంది. నీ సాయం మాకు అక్కరలేదని జ్యోత్స్నతో ఖరాఖండిగా చెబుతాడు కార్తీక్. బండి లేకపోతే బల్ల మీద పెట్టుకొని టిఫిన్స్ అమ్ముకుంటాం..అవసరమైతే నాలుగు నాలుగు క్యాన్లు పట్టుకొని ఫుట్‌పాత్‌పై కూర్చుంటాం అంతే కానీ ఏడుస్తూ కూర్చొని నీ సాయం మాత్రం తీసుకోం అని జ్యోత్స్నతో సీరియస్‌గా అంటాడు కార్తీక్.
అప్పుగా ఇస్తా…
ఫుట్‌పాత్‌పై అమ్ముకోవాల్సిన అవసరం నీకు లేదని, కష్టాల్లో నిన్ను వదిలేసి వెళ్లిపోనని, నీకు ఎంత కావాలో చెప్పు డబ్బు నేను ఇస్తానని కార్తీక్‌తో జ్యోత్స్న అంటుంది. అవసరమైతే అప్పుగా తీసుకోమని చెబుతుంది. నాకు అప్పు ఇస్తే నష్టపోయేది నువ్వేనని కార్తీక్ బదులిస్తాడు.
కార్తీక్ ఎంత చెప్పిన జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లదు. ఇలాంటి పంచాయితీలు పెడితే తమ వ్యాపారం సాగదని, కస్టమర్లు పారిపోతారని కార్తీక్ అంటాడు. అయినా జ్యోత్స్న వినకపోవడంతో పో ఇక్కడి నుంచి కార్తీక్ కోపంగా అంటాడు.
దీప షాక్…
కార్తీక్ కోపాన్ని చూసి దీప షాకవుతుంది. జ్యోత్స్ను వెళ్లిపొమ్మని అంటుంది. నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. నేనే వెళ్లిపోతానని దీపపై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. నా సాయంనువ్వు తీసుకునే వరకు వస్తూనే ఉంటానని కార్తీక్‌తో ఛాలెంజ్ చేస్తుంది జ్యోత్స్న. నువ్వు ఎంత పొమ్మన్న నిన్ను వదిలేదు లేదని కార్తీక్‌ను ఉద్దేశించి మనసులో అనుకుంటుంది.
జ్యోత్స్న వెళ్లగానే కోపంగా బైక్ తీసుకొని కార్తీక్ బయలుదేరుతాడు. దీపను తనతో పాటు రమ్మని అంటాడు. ఎక్కడికి అని దీప అడిగితే…నువ్వు ముందు బండెక్కు అని కార్తీక్ చెబుతాడు. బైక్‌పై స్పీడుగా వెళ్లి జ్యోత్స్న కారుకు తన బైక్ అడ్డంగా పెడతాడు కార్తీక్. కారు దిగమని కోపంగా జ్యోత్స్నతో అంటాడు.
టిఫిన్ బండి కాలిపోవడానికి తానే కారణమని తెలిసిపోయిందా ఏంటి అని జ్యోత్స్న కంగారు పడుతుంది.
నిజం చెప్పిన కార్తీక్…
ఎందుకు చేశావని జ్యోత్స్నను నిలదీస్తాడు కార్తీక్. ఏం తేలియనట్లుగా నేనేం చేశానని జ్యోత్స్న అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదని అంటుంది. లాగి పెట్టి కొట్టానంటే అని కార్తీక్ చెయ్యెత్తుతాడు. కార్తీక్ కోపాన్ని దీప కంట్రోల్ చేస్తుంది. జ్యోత్స్నను కొట్టకుండా అడ్డుకుంటుంది.
మన టిఫిన్ బండి కాలిపోవడానికి జ్యోత్స్ననే కారణమని అసలు నిజం బయటపెడతాడు కార్తీక్. బండి తగలబెట్టిన రౌడీని ఛేజ్ చేస్తుంటే అతడి ఫోన్ దొరికిందని, ఆ రౌడీకి అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసిందని, తాను లిఫ్ట్ చేసేలోపు రౌడీ ఫోన్ లాక్కొని పారిపోయాడని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్నను కొట్టిన దీప…
మనకు బతుకుతెరువు అయిన టిఫిన్ బండిని కాల్చేసిన ఈ మనిషిని ఏం చేయాలని కార్తీక్ అనగానే దీప కోపం పట్టలేక జ్యోత్స్న చెంపపై గట్టిగా ఒక్కటి పీకుతుంది. నా తాళిని బేరం పెట్టావు…నా కారణంగా కార్తీక్‌ను ఇబ్బంది పెట్టావు..టిఫిన్ సెంటర్ మూసేయించాలని చూశావు. ఊడుకుబోతు తనమని మారుతావని అనుకున్నాం….వదిలేశాం కదా అని తగలబెట్టేస్తావా…ఎందుకు టిఫిన్ సెంటర్ కాల్చేశావని జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది దీప. ఇంత దుర్మార్గమైనదానిలా ఎలా తయరయ్యావని నిలదీస్తుంది.
ఇంత నీచమైన స్థాయి…
టిఫిన్ సెంటర్ పెట్టుకొని మన బతుకు ఏదో బతికితే జ్యోత్స్న ఎందుకు ఓర్చుకోలేకపోతుందని, ఇంత నీచమైన స్థాయిన దిగజారుతుందని అనుకోలేదని దీప ఎమోషనల్ అవుతుంది. టిఫిన్ సెంటర్ కాలిపోతే మన జీవితాలు ఏం ఆగిపోవని కార్తీక్ అంటాడు. ఇంటి దగ్గర నీ మాటలు విన్న తర్వాత నీకు బుద్ది చెప్పకుండా వదిలేయడం తప్పనిపించింది, నీ చెంప పగలగొట్టాలని వచ్చాను..ఆ పని నా భార్య చేసిందని కార్తీక్ కోపంగా అంటాడు.
లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్…
మా జోలికి రావద్దు..ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని, అత్త ముఖం చూసి వదిలేస్తున్నానని కార్తీక్ అంటాడు. ఇంకోసారి ఇదే రిపీట్ అయితే బట్టల్ని బంద మీద ఉతికినట్లు ఉతికి ఆరేస్తానని దీప కూడా జ్యోత్ప్నను హెచ్చరిస్తుంది. నువ్వు ఎంత తొక్కితే మేము అంత ఎదుగుతామని, ఇలాంటి చిల్లర పనులతో కార్తీక్ గెలుపును ఆపలేవని జ్యోత్స్నతో దీప అంటుంది. కార్తీక్ పక్కన ఈ దీప ఉన్నంత కాలం ఏం చేయలేవని అంటుంది.
దీప ప్రాణాలకు ప్రమాదం…
దీప కొట్టిన దెబ్బలను తట్టుకోలేకపోతుంది జ్యోత్ప్న. నొప్పితో విలవిలలాడుతుంది. అయినా కార్తీక్, దీప ఇంటికొచ్చి గొడవ చేయకపోవడం సంతోషిస్తుంది. టిఫిన్ బండి కాల్చేసిన విషయం ఇంట్లో వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడాలని అనుకుంటుంది. దీప ఉంటే ఎప్పటికైనా తనకు ప్రమాదమేనని, శివన్నారాయణ ఇంటి అసలు వారసురాలు దీప అనే నిజం ఆమెకు తెలిసేలోపు దీపను ప్రాణాలతో లేకుండా చేయాలని ఫిక్సవుతుంది. ఆ తర్వాత సుమిత్ర అసలు కూతురిగా బావతో కలిసి సంతోషంగా బతికితీరుతానని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.
కాంచన ప్రశ్నలు…
సాయం చేయడానికి వచ్చిన జ్యోత్స్నపై ఎందుకు ఆరిచావని కార్తీక్‌ను అడుగుతుంది కాంచన. కానీ కార్తీక్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు. మనుషులు పైకి కనిపించినట్లు లోపల ఉండరు. నేను అరిచేది మాత్రమే కనిపిస్తుంది. అవతలి వాళ్ల చేతలు కనిపించవని తల్లితో కోపంగా మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోతాడు కార్తీక్. కార్తీక్ మాటలు కాంచనకు అంతుపట్టవు.
నిజం తెలుసుకున్న దాసు…
కాంచనతో ఎందుకలా కోపంగా మాట్లాడారు అని కార్తీక్‌ను నిలదీస్తుంది దీప. అమ్మ జ్యోత్స్నను మంచిదానిలా భావిస్తుంటే తట్టుకోలేకపోయానని కార్తీక్ అంటాడు. మన టిఫిన్ సెంటర్ బండి కాల్చింది జ్యోత్స్న అని అమ్మకు తెలియాల్సిందేనని కార్తీక్ అంటాడు. ఈ నిజం ఎవరికి చెప్పొద్దని దీప అంటుంది.
తక్కువ రోజుల్లోనే ఆ బండి మన ఫ్యామిలీలో ఒక మెంబర్‌లా మారిందని, అలాంటి బండిని జ్యోత్స్న కాల్చేయడం బాధను కలిగిస్తుందని కార్తీక్ అంటాడు. ఈ బాధలేవో మనమే పడదామని, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని కార్తీక్‌కకు సర్ధిచెబుతుంది దీప, కార్తీక్, దీప మాటల్ని చాటు నుంచి దాసు వింటాడు. ఈ రోజుతో జ్యోత్స్న పాపాల చిట్టా పూర్తయిందని, శివన్నారాయణ ఇంటి అసలు వారసురాలు ఎవరనే నిజం బయటపెట్టే టైమ్ వచ్చిందని అనుకుంటాడు.
తాట తీస్తా…
జ్యోత్స్న చెంపలు ఎర్రగా వాచిపోయి ఉండటం పారిజాతం గమనిస్తుంది. నిన్ను ఎవరు కొట్టారని మవనరాలిని అడుగుతుంది. కార్తీక్ దగ్గరుండి దీప చేత తనను కొట్టించాడని జ్యోత్స్న బదులిస్తుంది. మీ తాతయ్యతో చెప్పి ఇప్పుడే వాళ్ల తాట తీస్తానని పారిజాతం అంటుంది. అల్రెడీ వాళ్లు నా తాట తీశారని, ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం చేయద్దని అంటుంది. పాపం అని పలకరించడానికి వెళ్లిన నిన్నే కొడతారా…నాకు వస్తున్న కోపానికి దీపను తగలేయాలని ఉందని పారిజాతం అంటుంది.
పారిజాతం కంగారు….
రౌడీతో టిఫిన్ సెంటర్ బండి కాల్చేసిన నిజం బయటపెడుతుంది జ్యోత్స్న. కానీ కార్తీక్‌కు నిజం తెలిసిపోయిందని, దీప తన ముఖాన్ని చట్నీ చేసిందని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న చేసిన పనికి పారిజాతం వణికిపోతుంది.
నిన్ను కాపాడటం నా వల్ల కాదని అంటుంది. ఇంటికొచ్చి కార్తీక్, దీప గొడవ చేస్తే ఇంటికి నిన్ను యువరాణిని చేయాలన్న తన కల ఆగిపోయేదని పారిజాతం అంటుంది. శివన్నారాయణ అసలు వారసురాలు దీపనే అనే నిజం దాసు ఎక్కడ బయటపెడతాడోనని లోలోన జ్యోత్స్న కంగారు పడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.