Best Web Hosting Provider In India 2024
Brahmamudi January 14th Episode: పుట్టింట్లో కావ్యకు అవమానం- నోరు పారేసుకున్న ధాన్యలక్ష్మీ- గుట్టు బయటపెట్టిన రుద్రాణి
Brahmamudi Serial January 14th Episode: బ్రహ్మముడి జనవరి 14 ఎపిసోడ్‌లో తన సీమంతం పుట్టింట్లో జరగడానికి కారణం కావ్య అని గొడవ పెట్టుకుంటుంది స్వప్న. నీకంటే మా అత్త బెటర్ అని స్వప్న అంటుంది. తర్వాత గదిలో స్వప్న బాధపడుతుంటే రుద్రాణి, రాహుల్ వచ్చి ఎమోషనల్ డ్రామా చేస్తారు. ఆ మాటలను స్వప్న నమ్ముతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్వప్న సీమంతానికి పుట్టింట్లో కనకం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఫ్రెష్ ఫ్రూట్స్‌కు బదులు కొన్ని ప్లాస్టిక్ పండ్లు కూడా తెప్పిస్తుంది. అలాగే సీమంతం శీను తీసుకొచ్చిన ఒక కుర్చీ విరిగిపోయి మూడు కాళ్లతోనే ఉంటుంది. దాని గురించి కనకం అడిగేసరికి దాన్ని తీసేయమని తనవాళ్లతో చెబుతాడు శీను.
శాలువ కప్పి కవర్ చేసి
కానీ, కనకం మాత్రం ఉండనిలేరా, ఓ మూలన పడి ఉంటుంది అని అంటుంది. ఈ విరిగిన కుర్చీలో ఎవరైనా కూర్చుంటే వాళ్ల నడుము విరుగుతుంది అని శీను అంటాడు. అలా ఎవరున్నారబ్బా అని రుద్రాణిని ఊహించుకున్న కనకం తను కూర్చునేలా ప్లాన్ చేయాలని అనుకుంటుంది. దాంతో విరిగిన కుర్చీ అని తెలియకుండా ఉండేందుకు శాలువ కప్పి.. ఇది మహారాణి కుర్చీ అని చెబుతుంది. తర్వాత కృష్ణమూర్తి వచ్చి ప్లాస్టిక్ పండ్ల గురించి అడుగుతాడు.
నిలువెత్తు అద్దంలా
ఉన్నంతలో చేయమంటే నీ కకృత్తితో ఉన్న పరువు పోయేలా చేసేవ్ అని కనకంకు కృష్ణమూర్తి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో కనకం ఇంటికి కార్లల్లో దుగ్గిరాల కుటుంబం అంతా వస్తుంది. కనకం ఇంటి ముందే వాళ్లు దిగి మాట్లాడుకుంటారు. స్వప్న అందం గురించి కావ్య గొప్పగా చెబుతుంది. తెలుగింటి అమ్మాయిలా మన సాంప్రదాయాలకు నిలువెత్తు అద్దంలా ఉన్నావ్ అని అక్క స్వప్నను అంటుంది కావ్య. దాంతో నార్మల్‌గా చూస్తుంది స్వప్న.
మా పరువు తీయడానికా
నా కోడలు అందంగానే ఉంది. కానీ, నువ్వే పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌లాగా కనిపిస్తున్నావ్ అని రుద్రాణి అంటుంది. దాంతో కావ్య ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. రాజ్ కూడా ఏం అనలేక ఊరుకుంటాడు. అపర్ణ చూస్తూ ఉంటుంది. దివాళ తీసినట్లు, అప్పులపాలైనట్లు, అసలు నగలే లేనట్లు ఆ బోసి మెడతో వచ్చావేంటీ.. మా పరువు తీయడానికా అని ధాన్యలక్ష్మీ అవమానంగా మాట్లాడుతూ కోప్పడుతుంది. దాంతో రాజ్, కావ్య బుక్ అయిపోతామేమే అన్నట్లుగా ఇద్దరు తెల్ల మొహాలు వేసుకుని చూస్తారు.
కంగారుపడిన కావ్య రాజ్
తర్వాత నగల గురించి అపర్ణ అడుగుతుంది. ఏంటీ కావ్య ఇది.. నేను నీకిచ్చిన నగలు ఉన్నాయి కదా. అవి వేసుకుని రావొచ్చు కదా అని కావ్యను ప్రశ్నిస్తుంది అపర్ణ. కానీ, దానికి ఏం సమాధానం చెప్పలేకపోతారు కావ్య, రాజ్. కావ్య నగలు తాకట్టు పెట్టే సీతారామయ్య హాస్పిటల్ బిల్ కడుతారు. ఆ విషయం ఇప్పుడు ఎలా చెప్పాలి అని రాజ్, కావ్య కంగారుపడతారు. నగలు తాకట్టు పెట్టినట్లు తెలిస్తే పెద్ద రచ్చ అవుతుందని, సీతారామయ్య 100 కోట్ల షూరిటీ బయటపడుతుందేమో అని భయపడుతుంటారు.
అప్పుడే పాతబడిపోయాయా
కావ్య ఏం సమాధానం చెప్పలేకపోయేసరికి రుద్రాణి అనుమానంగా చూస్తుంది. కచ్చితంగా ఏదో జరిగింది. అందుకే డబ్బు విషయంలో ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటున్నారని, సీతారామయ్య బిల్ క్యాష్ రూపంలో కట్టారని, నగలు తాకట్టు పెట్టిందా అని రుద్రాణి అనుమానిస్తుంది. కానీ, తర్వాత కాసేపటికి నగలు పాతగా కనిపిస్తున్నాయని, నలుగు పెట్టించడానికి ఇచ్చినట్లుగా కావ్య అబద్ధం చెబుతుంది. అవి కొత్తవే కదా. అప్పుడే పాతబడిపోయాయా అని రుద్రాణి అంటుంది.
విరిగిన కుర్చీలో కూర్చునేలా
కావ్యకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటీ అని అపర్ణ సపోర్ట్ చేస్తుంది. ముందు వచ్చిన కార్యక్రమం చూద్దాం అని అంతా లోపలికి వెళ్తారు. వారందరికి కనకం మర్యాదలు చేస్తుంది. రుద్రాణి పంచ్‌లు వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, కనకం రుద్రాణిని విరిగిన కుర్చీలో కూర్చొబెట్టడానికి ట్రై చేస్తుంటుంది. తర్వాత సీతారామయ్య హాస్పిటల్ బిల్ క్యాష్ రూపంలో కట్టినట్లు రుద్రాణి బయటపెట్టినట్లు తెలుస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసడ్ ముగుస్తుంది.