Best Web Hosting Provider In India 2024
Heart Health: వాకింగ్‌లో చేస్తే ఈ మార్పులు.. మీ గుండెకు రావు నొప్పులు, 7 చిట్కాలు మీ కోసం
Heart Health: వాకింగ్ అనేది ఒక సాధారణమైన వ్యాయామంలా కనిపించినప్పటికీ దీని వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచి, గుండె రేటును పెంచుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి, శరీర బరువును నియంత్రించడానికి దోహదపడి గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది.
వాకింగ్ చేయడం అనేది నిజంగా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన వ్యాయామం. వాకింగ్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ, ఒత్తిడిని తగ్గించడంలోనూ, మానసిక స్థితిని మెరుగుపరచడంలోనూ చక్కగా ఉపయోగపడుతుంది. మీరు కామన్ గా నడిచే పద్ధతిని కొంచెం మార్పు చేసుకుంటే గుండె ఆరోగ్యం విషయంలో మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. మీరు కూడా వాకింగ్ చేస్తున్నా, చేయాలనుకుంటున్నా ఈ కొద్దిపాటి టిప్స్, సులభమైన చిట్కాలు పాటించి హృదయ ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోండి.
హృదయ ఆరోగ్యాన్ని పెంచడానికి 7 పద్ధతులు:
1. ఇంటర్వల్ ట్రైనింగ్ చేయండి
వాకింగ్ చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో నడకలో వేగం మార్చండి. కాసేపు నెమ్మెదిగా, మరి కాసేపు కాస్త వేగంగా నడవండి. ఇలా చేయడం వల్ల మీ గుండె రేటు మారుతుంది. ఫలితంగా గుండె శక్తివంతం అవుతుంది. కాబట్టి, మీరు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఇంటర్వల్ ట్రైనింగ్‌ను అనుసరించవచ్చు.
2. చేతులు ఊపుతూ ఉండండి
వాకింగ్ చేస్తున్న సమయంలో, మీ చేతులను సహజంగా ఊపడం లేదా చేతులలో తేలికపాటి బరువులు పట్టుకుని ఉండటం వల్ల శరీరంలోని పైభాగం కూడా పనిచేస్తుంది. దీని వల్ల గుండె రేటు పెరుగుతుంది. కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. మీ చేతులు, భుజాలు, వెనుక భాగాలు కూడా బలంగా మారతాయి.
3. శ్వాసలో మార్పులు
నడుస్తూ, లోతుగా శ్వాస తీసుకోండి. నెమ్మెదిగా శ్వాసను విడుస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఒత్తిడిని తగ్గించవచ్చు. రక్తపోటును క్రమబద్ధీకరించవచ్చు. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. దీంతో మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరచుకోవచ్చు.
4. డైనమిక్ స్ట్రెచింగ్ చేయండి
వాకింగ్ చేయడానికి ముందు, కొన్ని సులభమైన డైనమిక్ స్ట్రెచ్చింగ్‌లను చేయడం మంచిది. అంటే వార్మప్ లు చేయండి. ఉదాహరణకు, చేతులు గుండ్రంగా చక్రాల మాదిరిగా గుండ్రంగా తిప్పడం, పాదాలు రౌండ్ షేప్ లో తిప్పడం, శరీరాన్ని తిప్పడం, మెడను గిరగిరా తిప్పడం వంటివి చేయాలి. ఈ క్రియలు మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచి, టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
5. పర్వతాలపై నడవండి
మీరు వాకింగ్ కు వెళ్లాలనుకున్న ట్రాక్‌లో ఎత్తు పల్లాలు ఉండేలా చూసుకోండి. ఒకవేళ అది కుదరకపోతే ట్రెడ్మిల్‌లో ఇన్క్లైన్ సెట్ చేయండి. ఇది గుండెను మరింత కష్టంగా పనిచేయిస్తుంది. ఫలితంగా గుండె మరింత శక్తివంతం అవుతుంది. శరీరం ఎక్కువగా శ్రమించడం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి.
6. ప్రకృతిలో నడవండి
ప్రకృతి ప్రదేశాలలో నడవడం చాలా ఉత్తమం. ఉదాహరణకు పార్క్‌లు లేదా అరణ్యాలలో నడవడం వల్ల మానసిక శాంతిని పెంచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును తగ్గించి, ప్రశాంతమైన జీవనాన్ని ఇస్తుంది. ఫలితంగా మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది హృదయ ఆరోగ్యానికి చాలా లాభదాయకం.
7. నడక కోసం ఒక స్నేహితుడిని లేదా సమూహాం ఏర్పరచుకోండి
మీ వాకింగ్ ప్రక్రియ మరింత ఇంటరెస్టింగ్‌గా, ఉత్సాహంగా మార్చుకోవడానికి స్నేహితులతో లేదా నడక సమూహంతో నడవడం మంచిది. వారితో సూటిగా మాట్లాడడం, స్నేహపూర్వకమైన సమాజాన్ని తయారుచేయడం, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఈ మార్పులను మీ రోజు వారీ నడకలో చేర్చుకోవడం ద్వారా మీరు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. కానీ, ఏదైనా కొత్త వ్యాయామం ప్రారంభించే ముందు, మీ వైద్యుడి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు, ముఖ్యంగా మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటే తప్పకుండ సంప్రదించాలి.
సంబంధిత కథనం