Best Web Hosting Provider In India 2024
Turmeric Board: నెరవేరిన నిజామాబాద్ రైతుల కల, పసుపు బోర్డుకు గ్రీన్ సిగ్నల్, నేడు వర్చువల్‌గా ప్రారంభం
Turmeric Board: నిజామాబాద్ రైతుల దశాబ్దాల కల నెరవేరింది. ఎట్టకేలకు కేంద్రం నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డును ప్రకటించింది. కేంద్ర మంత్రి పీయూష్ నేడు వర్చువల్‌గా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు.బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Turmeric Board: సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తోన్న జాతీయ పసుపు బోర్డు ఎట్టకేలకు నిజామాబాద్‌కు దక్కింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ జాతీయ పసుపు బోర్డను నేడు వర్చువల్ ప్రారంభించనున్నారు. పసుపు బోర్డు ఛైర్మన్‌గా బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించారు.
పసుపు బోర్డు కోసం నిజామాబాద్ జిల్లా రైతులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లోని ఇందూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వస్తే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారం బీజేపీ ప్రకటించింది.
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ పసుపుబోర్డు ఇస్తామని హామీ ఇచ్చారు. అదే ఏడాది అక్టోబరు 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే విషయం అందులో పేర్కొనలేదు. సోమవారం నిజామాబాద్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. చైర్మన్‌గా నిజామా బాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర వాణిజ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పల్లె గంగారెడ్డి మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రధాన కార్యా లయాన్ని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని ఎంపీ ధర్మపురి అర్వింద్ వివరించారు.
ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్న రీజినల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే మంగళవారం నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యకలా పాలు ప్రారంభమవుతాయి. “ ప్రపంచ వ్యాప్తంగా పసుపు సాగులో 75%, మార్కెట్లో 62% ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్‌లో సాగు అవుతోంది.
2022-23 ఆర్ధిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో పసుపు పంట సాగు చేశారు. అందులో 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75% ఉంటుందని అంచనా. దేశంలో అత్యధికంగా మహారా ష్ట్రలో 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది. జాతీయ పసుపు బోర్డు కోసం మహారాష్ట్ర నుంచి కూడా తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది.
పసుపు బోర్డుఏర్పాటుతో నాణ్యమైన పంట పండేలా రైతు లను ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో భారత ఆధిపత్యాన్ని నిలబెట్టేలా బోర్డు చేయూత అందిస్తుంది. ఈ బోర్డులో కేంద్ర ఆయుష్ ఫార్మాస్యూటి కల్స్, వ్యవసాయ, వాణిజ్య శాఖలకు చెందిన వారిని సభ్యు లుగా నియమిస్తారు. పసుపును అత్యధికంగా పండించే మూడు రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారు లకు రొటేషన్ పద్ధతిలో ఈ కేంద్రం బాధ్యతలు అప్పగిస్తారు.
కేంద్ర/ రాష్ట్ర పరిశోధన సంస్థల్లో పనిచేసే నిపుణులు, పసుపు రైతులు, ఎగుమతిదారులకు సభ్యత్వం ఇస్తారు. కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శిని నియమించనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వారణాసి లోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో చర్చ నీయాంశమైంది.
బాండ్ పేపర్‌పై రాసిచ్చి మరీ…
నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ధర్మపురి అర్వింద్ తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ మీద రాసి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచినా బోర్డు ఏర్పా టులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలు తప్పలేదు. చివరకు నిజామాబాద్‌లో బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంపై అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు.
రైతు కుటుంబం నుంచి ఛైర్మన్ ఎంపిక..
పసుపు బోర్డు తొలి ఛైర్మన్‌గా నియమితులైన గంగారెడ్డి అంకాపూర్‌కు చెందిన రైతు కుటుంబంలో పుట్టారు. డిగ్రీ వరకు చదివారు. కొన్నాళ్లు ఆర్ ఎస్ఎస్‌లో పనిచేశారు. 1901 నుంచి 1993 వరకు అంకాపూర్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా, 1993 నుంచి 1997 వరకు బీజేపీ ఆర్మూర్ మండలాధ్యక్షుడిగా పల్లె గంగారెడ్డి పని చేశారు. యువమోర్చా జిల్లా అధ్యక్షు డిగా, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, భాజపా జిల్లా కార్యదర్శిగా, రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షు డిగా పనిచేశారు. 2020 నుంచి భాజపా రాష్ట్ర కార్య దర్శిగా ఉన్నారు.
టాపిక్