Best Web Hosting Provider In India 2024
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి చుక్కలు చూపించిన శృతి – రోహిణి జెలసీ – ఫస్ట్‌నైట్‌పై బాలు రచ్చ
Gunde Ninda Gudi Gantalu:గుండె నిండా గుడి గంటలు జనవరి 14 ఎపిసోడ్‌లో కొత్త కోడలు శృతికి తెగ మర్యాదలు చేస్తుంది ప్రభావతి. అవన్నీ చూసి రోహిణి జెలసీగా ఫీలవుతుంది. మరోవైపు శృతితో మాట్లాడవద్దని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.
Gunde Ninda Gudi Gantalu: రవితో కలిసి శృతి అత్తింట్లో అడుగుపెడుతుంది. శృతి రాకతో ప్రభావతి తెగ హడావిడి చేస్తుంది. కానీ ప్రభావతికి షాకుల మీద షాకులు ఇస్తుంది శృతి. తనకు వంట చేయడం రాదని అంటుంది. కనీసం మ్యాగీ కూడా చేయలేనని చెబుతుంది. పెళ్లికి ముందు అమ్మ వంట చేసేదని, పెళ్లి తర్వాత రవి చేస్తున్నాడని అంటుంది. వంట చేయడం నేర్చుకునే అవసరం రాలేదని శృతి చెబుతుంది.
సత్యం ఆశీర్వాదం…
శృతి చేత దేవుడి దగ్గర దీపం పెట్టిస్తుంది ప్రభావతి. ఇంటి ఆచారాల్ని ఒక్కొక్కటి చెబుతూ శృతి చేత అన్ని చేయిస్తుంటుంది. సత్యం, ప్రభావతి ఆశీర్వాదం తీసుకుంటారు రవి, శృతి. గంపెడు పిల్లలతో సంతోషంగా ఉండండి అని ఇద్దరిని దీవిస్తాడు సత్యం. గంపెడు పిల్లలా నా వల్ల కాదని శృతి కంగారుగా బదులిస్తుంది. పిల్లపాపలతో సంతోషంగా ఉండమని మీ మావయ్య ఉద్దేశం అని ప్రభావతి కవర్ చేస్తుంది. అలా అయితే ఓకే అని శృతి బదులిస్తుంది.
ప్రభావతి ఇబ్బంది…
మీనాతో రవి, శృతి మాట్లాడుతుండగా ప్రభావతి అడ్డుకుంటుంది. మీనాకు పనిచెప్పి కొడుకు, కోడలిని అక్కడి నుంచి తీసుకెళుతుంది. శృతికి పద్దతులు, ఆచారాలు తెలియకపోవడంతో తన మనసులో ఏది అంటే అది మాట్లాడుతుంది. శృతి మాటల వల్ల ప్రభావతి తెగ ఇబ్బందిపడుతుంది.
రోహిణి జెలసీ….
శృతికి ప్రభావతి తెగ మర్యాదలు చేయడం చూసి రోహిణి ఉడుక్కుంటుంది. శృతి తన ప్లేస్‌ను కొట్టేసేలా ఉందని లోలోన అనుకుంటుంది. రవి, శృతి చేత ఒకే గ్లాస్‌లో పాలు తాగించే ఆచారం చేయించాలని ప్రభావతి ప్లాన్ చేస్తుంది. పాలు అంటే వికారమని తాను తాగనని శృతి అంటుంది. ప్రభావతితో పాటు రవి బలవంతంతో ఒప్పుకుంటుంది. ముందు తాను తాగిన తర్వాతే రవికి ఇస్తానని అంటుంది. మేల్ డామినేషన్‌కు తాను ఒప్పుకోనని అంటుంది. శృతి రూల్‌ను ప్రభావతి తప్పక అంగీకరిస్తుంది.
అచ్చం తండ్రిలానే..
శృతి దూకుడు చూసి రంగా మావయ్యలో అనుమానం మొదలవుతుంది. బుద్దులన్నీ తండ్రి సురేంద్రలానే ఉన్నాయని, రవిని గుప్పెట్లో పెట్టుకొని ఆడించేలా ఉందని ఉందని సత్యంతో అంటాడు రంగా. ప్రభావతి ఎలా భరిస్తుందోనని రంగా అంటాడు. డబ్బున్న కోడళ్లతో సర్ధుకుపోవడం ప్రభావతికి అలవాటేనని సత్యం బదులిస్తాడు. మీనాలో ఉండే ఒద్దిక, మంచితనం మిగిలిన కోడళ్లలో లేదని అంటాడు. ముగ్గురు కొడుకులు, కోడళ్లతో నిండుగా ఉందని, తన ఇళ్లు ఎప్పటికీ ఇలాగే కలకలలాడుతుండాలని అనుకుంటాడు.
శృతితో మాట్లాడొద్దు…
మీనా వంట చేస్తుంటుంది. ఇంకా వంట కాలేదా…ఎంత సేపు చేస్తావని ప్రభావతి ఫైర్ అవుతుంది. నేనేం ఖాళీగా లేనని మీనా బదులిస్తుంది. అంటే నేను ఖాళీగా ఉన్నానని అంటున్నావా అని ప్రభావతి రుసరుసలాడుతుంది. రవి, శృతి వచ్చారని నీకు కడుపుమంటగా ఉన్నట్లుగా ఉందని మీనాను ఆడిపోసుకుంటుంది. శృతితో ఎక్కువగా మాట్లాడవద్దని, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండమని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.
ఈ కొంపలో ఉండను…
శృతి నీలా పూలమ్ముకునే కుటుంబంలో పుట్టలేదని, కోటీశ్వరుల కుటుంబం నుంచి వచ్చిందని, నచ్చకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అన్న అంటుంది అని మీనాతో ప్రభావతి అంటుంది. అప్పుడే తనకు నచ్చలేదని శృతి గొంతు గట్టిగా వినిపిస్తుంది. నేను ఇక్కడ ఉండనని, మా ఇంటికి వెళ్లిపోతానని అరుస్తుంది. అంతగా మీ వాళ్లు కావాలని అనుకుంటే ఈ కొంపలోనే పడి ఉండు అని శృతి అనడంతో ప్రభావతి తెగ కంగారు పడుతుంది.
సీరియల్ కోసం డబ్బింగ్…
శృతిని ఏమన్నారని రవి, మీనాలపై అరుస్తుంది ప్రభావతి. తామేం అనలేదని వాళ్లు సమాధానమిస్తారు. శృతిని రవి పిలిచి ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అన్నవట ఏమైందని అడుగుతాడు. తాను సీరియల్ ప్రోమో కోసం డబ్బింగ్ చెప్పానని, వాటి డైలాగ్స్ విని మీరు పొరపడ్డారని శృతి అంటుంది. శృతి మాటలతో ప్రభావతి రిలీఫ్‌గా ఫీలవుతుంది.
రవిని బాదిన శృతి….
శృతి, మీనా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి ప్రభావతి ఓర్చుకోదు. మీనాకు బలవంతంగా కిచెన్‌లోకి పంపిస్తుంది. ఆకలికి శృతి అసలు ఓర్చుకోలేదని భార్యను ఏడిపిస్తాడు రవి. అతడి అల్లరి భరించలేని శృతి ప్రభావతి ముందే అతడిని వంగో పెట్టి వీపుపై దబా దబా వాయిస్తుంది. శృతి స్పీడు చూసి ప్రభావతి కంగారు పడుతుంది.
బంగారం లాంటి కోడళ్లు…
అప్పుడే అక్కడికి రోహిణి వస్తుంది. శృతి, రోహిణిలను చూసి తనకు బంగారం లాంటి ఇద్దరు కోడళ్లు దొరికారని ప్రభావతి మురిసిపోతుంది. మీనాను ఇన్‌సల్ట్ చేస్తుంది. ఎలాగైతేనేం మిమ్మల్ని కష్టపడి ఇంటికి తీసుకురాగలిగానని ప్రభావతి అంటుంది.
మీనా వల్లే…
ఇందులో మీరు చేసింది ఏముంది. ఇదంతా మీనానే చేసింది ప్రభావతికి షాకిస్తుంది శృతి. మీనానే మా అమ్మనాన్నలతో మాట్లాడి నా మీద వాళ్లకు ఉన్న కోపాన్ని పొగొట్టిందని, నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని మీనా మంచి మనసు గురించి గొప్పగా చెబుతుంది శృతి. నేను ఇక్కడికి వచ్చానంటే కారణం మీనానే మీరు కాదని ప్రభావతితో చెబుతుంది మీనా.
ఈగలు, దోమలు….
మీనా అక్కడికి రావడం చూసి కంగారు పడుతుంది ప్రభావతి. తనకు కాఫీ కావాలని ఆమెను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఈ ఇళ్లు మా నాన్నే కట్టించాడని తెగ బిల్డప్‌లు ఇస్తుంది ప్రభావతి. బ్రిటీష్ వాళ్ల కాలం నాటి ఈ ఇంటికి చూడగానే నాకు అదే అనిపించిందని ఆమె బిల్డప్‌లను తీసిపడేస్తుంది శృతి.
మనోజ్ బెడ్ రూమ్‌లో కూర్చొని ఈగలు, దోమలు కొట్టుకుంటూ కనిపిస్తాడు. మీ భర్తకు ఆఫీస్ ఏం లేదా శృతి అంటుంది. కారు షోరూమ్‌లో పనిచేస్తాడని రోహిణి అంటుంది.
శృతి జోక్…
మీ రూమ్ నీట్‌గా ఉందని రోహిణితో శృతి అంటుంది. రోహిణి బ్యూటీషియన్ అని ప్రభావతి గొప్పగా చెబుతుంది. అందుకొని రూమ్‌కు ఏమన్నా మేకప్ వేస్తుందా అని శృతి జోకులు వేస్తుంది. ఆమె జోకులు చూసి రోహిణి సహించలేకపోతుంది. బెడ్‌రూమ్ ఇరుకుగా ఉందని శృతి అంటుంది.
రోహిణి తండ్రి గురించి బిల్డప్‌లు…
రోహిణి, శృతి తనకు చాలా స్పెషల్ అంటూ ప్రభావతి అంటుంది. నువ్వు మా అమ్మకు నచ్చావు…ఇక నుంచి నిన్ను నెత్తిన పెట్టుకొని మోస్తుందని రవి అంటాడు. రోహిణి తండ్రి గురించి గొప్పలు చెబుతుంది. ప్రభావతి బిల్డప్‌లు చూసి తాను ఎక్కడ దొరికిపోతానేమోనని రోహిణి భయపడుతుంది. మలేషియాలోని ట్విన్ టవర్ వీళ్ల నాన్నదేనని అంటుంది.
శోభనం ఏర్పాట్లు…
రవి, శృతిలకు బాలు రూమ్‌లో శోభనం ఏర్పాట్లు చేస్తారు. గదిని అందంగా అలంకరిస్తారు. తన గదిని శృతి, రవిలకు ఇచ్చేది లేదని బాలు గొడవ చేస్తాడు. మీనా సర్ధిచెప్పిన వినడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.