Virat Kohli restaurant : ‘టూ మచ్​ ధరలు’- హైదరాబాద్​లోని విరాట్​ కోహ్లీ రెస్టారెంట్​పై విమర్శలు..

Best Web Hosting Provider In India 2024

Virat Kohli restaurant : ‘టూ మచ్​ ధరలు’- హైదరాబాద్​లోని విరాట్​ కోహ్లీ రెస్టారెంట్​పై విమర్శలు..

Sharath Chitturi HT Telugu Jan 14, 2025 11:14 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sharath Chitturi HT Telugu
Jan 14, 2025 11:14 AM IST

Virat Kohli restaurant Hyderabad : హైదరాబాద్​లోని విరాట్​ కోహ్లీ రెస్టారెంట్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది! క్వాంటిటీకి తగ్గట్టు ధరలు లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ స్టూడెంట్ చేసిన ఒక ట్వీట్​ ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..​

ఈ డిష్​ ధర రూ. 500 కన్నా ఎక్కువే!
ఈ డిష్​ ధర రూ. 500 కన్నా ఎక్కువే! (X/@itspsneha)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఫ్యాన్సీ, లగ్జరీ రెస్టారెంట్స్​ మెన్యూలో ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే ధరకు తగ్గట్టు క్వాంటిటీ ఉండకపోవడం, చాలా మంది ఫుడ్​ లవర్స్​ని బాధపెట్టే విషయం! హైదరాబాద్​లోని ఒక విద్యార్థినికి కూడా తాజాగా ఈ అనుభవం ఎదురైంది! అది కూడా విరాట్​ కోహ్లీకి చెందిన లగ్జరీ రెస్టారెంట్​లో. ఆమె చేసిన ఒక ట్వీట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. అసలేం జరిగిందంటే..

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

విరాట్ కోహ్లీ రెస్టారెంట్​లో రూ.525 విలువ చేసే వంటకాన్ని ఆర్డర్ చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థిని స్నేహకు నిరాశే ఎదురైంది! విరాట్ కోహ్లీకి చెందిన రెస్టో బార్ సంస్థ వన్8 కమ్యూన్​లో రూ.525 (పన్నులు లేకుండా) చెల్లించిన ఆ వంటకానికి సంబంధించిన ఫోటోను స్నేహ షేర్ చేసింది.

‘వన్8 కమ్యూన్​లో ఈ రోజు దీని కోసం రూ.525 చెల్లించాను,’ అని స్నేహ ఎక్స్​లో రాసుకొచ్చింది. డిప్పింగ్​ శాస్​లో ముంచి తీసిన కొన్ని మొక్కజన్న ముక్కల ఫొటోను తన ట్వీట్​కి చేర్చింది స్నేహ.

ఈ కింది పోస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి..

విరాట్​ కోహ్లీకి చెందిన ఈ హైదరాబాద్ రెస్టారెంట్​లో పెరి పెరి కార్న్ రిబ్స్ అనే వంటకాన్ని స్నేహ ఆర్డర్ చేసింది. మొక్కజొన్నను వెల్లుల్లి అయోలి, పర్మేసన్ చీజ్, స్కాలియన్​తో వడ్డిస్తామని మెన్యూలోని వంటకం వివరణ వెల్లడించింది.

ఐఎస్​బీ విద్యార్థిని చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ప్లేట్​లో కొన్ని కార్న్​ ముక్కలు మాత్రమే పెట్టి.. రెస్టారెంట్​ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తోందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం ఫ్యాన్సీ రెస్టారెంట్లు ఇలాగే ఉంటాయని, ఫుడ్​తో పాటు మొత్తం ఎక్స్​పీరియెన్స్​కి డబ్బులు చెల్లిస్తామని గుర్తుచేస్తున్నారు.

“ఆర్డర్ చేయడానికి ముందు మీకు ఈ విషయం (అధిక ధర) తెలుసు. కాబట్టి ఏడుపు ఆపండి,” అని ఒక ఎక్స్ యూజర్ కామెంట్స్ విభాగంలో రాశారు.

“వాతావరణం, సేవ, పరిశుభ్రత కోసం డబ్బులు కడుతున్నాము. ఆ సౌకర్యవంతమైన కుర్చీ, చుట్టూ అందంగా కనిపించే ధనవంతులు, మంచి క్రోకరీకి డబ్బులు కడుతున్నాము,” అని మరొకరు చెప్పారు. 

“వాస్తవానికి ఫుడ్​ కోసం మీరు డబ్బు చెల్లించలేదు. వైబ్స్ కోసం డబ్బులు చెల్లించారు,” అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఎక్స్ యూజర్ సుముఖ్ రావు.. విరాట్​ కోహ్లీ రెస్టారెంట్​లో (బెంగళూరు) తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కామెంట్స్ సెక్షన్​లో పోస్ట్ చేశాడు.

 

అధిక ధర కలిగిన వంటకాన్ని చూసి ఇతర ఎక్స్ వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

‘ఇది బయట రూ.45కు దొరుకుతుంది,’ అని ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. “దీనికి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలా?” అని మరొకరు షాక్​ అయ్యారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsVirat KohliBusinessViral India WorldTrending Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024