నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్

Best Web Hosting Provider In India 2024

నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్

HT Telugu Desk HT Telugu Jan 14, 2025 12:49 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Jan 14, 2025 12:49 PM IST

నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.

పసుపు బోర్డు కార్యాలయం వర్చువల్ గా ప్రారంభించిన పీయూష్ గోయల్, ధర్మపురి అర్వింద్
పసుపు బోర్డు కార్యాలయం వర్చువల్ గా ప్రారంభించిన పీయూష్ గోయల్, ధర్మపురి అర్వింద్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఈరోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయం నుండి వర్చువల్ గా హాజరై ప్రసంగిస్తూ బోర్డు ఏర్పాటు కోసం క్రుషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

yearly horoscope entry point

నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. 

‘ఈరోజు రైతుల పండుగ. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ఇవాళ శుభవార్త అందించిన మహనీయుడు ప్రధాని నరేంద్రమోదీ, సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు, ఈ బోర్డు ఏర్పాటులో కర్త,కర్మ, క్రియగా ఉంటూ మొండిపట్టుతో విజయం సాధించిన ఎంపీ ధర్మపురి అరవింద్, బోర్డు ఛైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేలకు, పసుపు రైతులకు అభినందనలు.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఈ శుభ ఘడియల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో పసుపు బోర్డు కోసం 178 మంది పసుపు రైతులు లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్లు వేసి పసుపు బోర్డు అంశాన్ని జాతీయస్థాయిలోకి తీసుకెళ్లారు. ‘‘బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా’’ నని ధర్మపురి అరవింద్ రాతపూర్వకంగా హమీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డ ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రత్యేక అభినందనలు..’ అని పేర్కొన్నారు.

బోర్డు ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు

‘పసుపు బోర్డు ఏర్పాటువల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నయ్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలగబోతున్నయ్. పసుపు ఉత్పత్తుల ధరను బోర్డు నిర్ణయిస్తుంది. పసుపు దిగుబడి ఎక్కువైనా గిట్టుబాటు ధర రాదనే బాధే ఉండదు. పసుపు బోర్డే రైతు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజీల్లో ఉంచుతుంది. బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, ప్యాక్కింగ్ తోపాటు జాతీయంగా, అంతర్జాతీయ ఎగుమతులను చేసే అవకాశముంది..’ అని వివరించారు.

‘ప్రతి ఏటా పసుపు బోర్డుకు కేంద్రం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ప్రక్రుతి వైపరీత్యాలవల్ల పంట నష్టపోతే రైతులు నష్టపోకుండా పంట బీమాకు చర్యలు తీసుకుంటుంది. క్వాలిటీ డిపార్ట్మెంట్ ఏర్పాటు ద్వారా నిరంతరం క్వాలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటారు..’ అని వివరించారు.

Whats_app_banner

టాపిక్

NizamabadNizamabad Lok Sabha ConstituencyBandi Sanjay
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024